ఉక్కు మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై ప్రజారోగ్య ప్రతిస్పందనకు సంబంధించి ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
31 MAR 2020 3:26PM by PIB Hyderabad
కోవిడ్-19పై ప్రజారోగ్య ప్రతిస్పందనకు సంబంధించి కేంద్ర పెట్రోలియం-సహజవాయువు-ఉక్కుశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తమ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల అధికారులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశం నిర్వహించారు. ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్‌సింగ్ కులస్థే, కార్యదర్శి శ్రీ వినయ్‌కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కింది నిర్ణయాలు తీసుకున్నారు.
- అన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పరిధిలోని గనులు, శివారు కాలనీలు, పని ప్రదేశాలు వగైరాల్లో ప్రభుత్వ ఆదేశాలమేరకు ‘సామాజిక దూరం’ నిబంధనకు కట్టుబడాలి.
- కోవిడ్-19కు సంబంధించి తాము ఏర్పాటు చేసిన ఆస్పత్రులు, దిగ్బంధ కేంద్రాలు వగైరాలపై కేంద్ర ప్రభుత్వరంగం సంస్థలు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖకు/రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చిన సమాచారం మేరకు వాటిని పూర్తిస్థాయిలో సదా సిద్ధంగా ఉంచాలి.
- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ప్రారంభించిన సేవా ప్రదాన పోర్టల్ (సామాజిక సేవాభిలాషగల ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇందులో నమోదు కావచ్చు) తరహాలో ఆయా కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా వాటిని రూపొందించాలి. ఈ మేరకు సహాయక చర్యల కింద ‘అన్నదానం’ (వలసకూలీలకు, సమాజంలోని బలహీనవర్గాలకు ఆహార సరఫరా) కార్యక్రమాన్ని ఉక్కుశాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తక్షణం చేపట్టాలి.
(రిలీజ్ ఐడి: 1609728)
సందర్శకుల సూచీ సంఖ్య : : 108