రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మ‌హమ్మారిని ఎదుర్కొనేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్య‌తా నిధుల‌ను విడుద‌ల చేయాల్సిందిగా త‌న మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని పిఎస్‌యుల‌ను కోరిన కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ‌మంత్రి స‌దానంద గౌడ‌

ఉద్యోగులు క‌నీసం ఒక రోజు వేత‌నం పిఎం కేర్స్ నిధికి ఇవ్వాల‌ని విన‌తి

Posted On: 31 MAR 2020 11:41AM by PIB Hyderabad

కోవిడ్ -19 మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా పోర‌డాల్సిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో , కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి. వి. స‌దానంద గౌడ , త‌మ మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని  అన్ని లాభ‌దాయ‌క పి.ఎస్‌.యు ల‌ను వాటి సి.ఎస్‌.ఆర్  నిధుల‌నుంచి కొంత‌మొత్తాన్ని ప్ర‌ధాన‌మంత్రి సిటిజ‌న్స్ అసిస్టెన్స్‌, రిలీఫ్ ఎమ‌ర్జెన్సీ సిచ్చుయేష‌న్ ఫండ్ (PM CARES) కు విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరారు.
 ఈమేర‌కు  అన్ని పిఎస్‌యుల సి.ఎం.డిల‌కు ఒక లేఖ‌రాస్తూ స‌దానంద గౌడ‌, క‌రోనా మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు  అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు  తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ, ఇంత పెద్ద ఎత్తున ప్ర‌జారోగ్యాన్ని కాపాడ‌డంలో అన్ని వ‌ర్గాలు, ప్ర‌జ‌లుస‌మాజం నుంచి  నిరంత‌ర కృషి అవ‌స‌ర‌మ‌ని  అన్నారు. అందువ‌ల్ల PM CARES నిధికి కార్పొరేట్ సామాజిక బాధ్య‌తా నిధుల‌నుంచి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని అందించాల్సిందిగా కోరుతున్న‌ట్టు ఆయ‌న త‌మ లేఖ లో పేర్కొన్నారు.
 
కోవిడ్ -19 వంటి మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌లెత్తిన అత్య‌వ‌సర పరిస్థితిని ఎదుర్కొనేందుకు  భార‌త ప్ర‌భుత్వం  PM CARES నిధిని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసింది.  ఈ నిధికి  ఇచ్చే విరాళాలు సిఎస్ఆర్ ఖ‌ర్చు కింద కంపెనీల చ‌ట్టం 2013 కింద  ప‌రిగ‌ణిస్తామ‌ని ఇప్ప‌టికే  కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది.
2019-20 సంవ‌త్స‌రానికి ఇంకా ఖ‌ర్చుచేయ‌ని సి.ఎస్‌.ఆర్ నిధుల‌ను పిఎస్‌యులు వెంట‌నే పైన పేర్కొన్న ఫండ్‌కు అంద‌జేయ‌డానికి ఇది అద్భుత అవ‌కాశ‌మ‌ని శ్రీ స‌దానంద గౌడ తెలిపారు. 2020-21 ఆర్థ‌ఙ‌క సంవ‌త్స‌రానికి కూడా ఏప్రిల్ 2020 త‌ర్వాత కంపెనీలు తమ నిధుల‌ను ఈ ఫండ్‌కు విరాళంగా ఇవ్వ‌వ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు.
 ఆయా కంపెనీల‌లోని  ఉద్యోగులు కనీసం త‌మ ఒక రొజు వేత‌నాన్ని స్వ‌చ్ఛందంగా  PM CARES నిధికి అందించేలా వారిని ప్రోత్స‌హించాల‌ని పి.ఎస్‌.యుల సిఎండిల‌ను కోరారు.
శ్రీ స‌దానంద గౌడ త‌మ ఒక నెల జీతాన్ని, ఎంపిలాడ్స్ కింద ఒక కోటి రూపాయ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్ఇర జాతీయ స‌హాయ నిధికి విరాళం ప్ర‌క‌టించారు.



(Release ID: 1609625) Visitor Counter : 148