నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ కారణంగా... పున:వినియోగ శక్తి వనరులకు సంబంధించిన ప్రాజెక్టుల కాలపరిమితి పొడిగింపు
प्रविष्टि तिथि:
26 MAR 2020 12:04PM by PIB Hyderabad
అన్ని పున: వినియోగ శక్తి వనరులకు సంబంధించిన ప్రాజెక్టుల కాలపరిమితిని పొడిగిస్తున్నట్టు నూతన మరియు పున: వినియోగ శక్తి వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆనంద్ కుమార్ ట్వీట్ ద్వారా తెలిపారు. 21 రోజుల లాక్ డౌన్ అమలులో వున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల కాలపరిమితిని పొడిగించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. కరోనా వైరస్ చెయిన్ ను ధ్వంసం చేయడానికిగాను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ఆయా ప్రాజెక్టులకు కావలసిన విడిభాగాల పంపిణీ తాత్కాలికంగా ఆగిపోయింది. అంతే కాదు వారికి కావలసిన కార్మికులు లభించడం లేదు. ఈ నేపథ్యంలో కాలపరిమితిని పొడిగించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రంగానికి చెందినవారందరూ హర్షం ప్రకటిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 1609499)
आगंतुक पटल : 220