ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక సంవత్సరం పొడిగింపు ఉండదు

Posted On: 30 MAR 2020 10:48PM by PIB Hyderabad

   ర్థిక సంవత్సరం పొడిగించబడినట్లు కొన్ని మాధ్యమాలలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం. భారత స్టాంపు చట్టానికి 2020 మార్చి 30వ తేదీన చేసిన కొన్ని సవరణలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసిన నేపథ్యంలో దాన్ని తప్పుగా అన్వయిస్తూ ఈ వదంతులు వస్తున్నాయి. కాబట్టి ‘ఆర్థిక సంవత్సరం పొడిగింపు లేదని’ స్పష్టం చేయడమైనది.

   వాస్త‌వానికి భారత‌ స్టాంప్ చట్టంలో కొన్ని సవరణల గురించి 2020 మార్చి 30 న రెవెన్యూ విభాగం నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. స‌వ‌రించిన నిబంధ‌న‌ల‌ను 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల‌ని తొలుత ప్ర‌క‌టించినా, ప్రస్తుత పరిస్థితుల నేప‌థ్యంలో అమలు తేదీని 2020 జూలై 1కి వాయిదా వేయాలని నిర్ణయించింది.

****(Release ID: 1609487) Visitor Counter : 41