వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

లాక్డౌన్ వేళ సెజ్ యూనిట్ల‌కు, అభివృద్ధిక‌ర్త‌లు, స‌హ‌-అభివృద్ధిక‌ర్త‌ల‌కు స‌ర్కారు ఊర‌ట‌

- నివేదిక‌ల స‌మ‌ర్ప‌ణ‌, వివిధ అనుమ‌తులు పొందే విష‌య‌మై మిన‌హాయింపు
- నిర్వాహ‌కులు, యూనిట్ల‌కు ఇబ్బందులు రాకుండా చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు

Posted On: 30 MAR 2020 2:52PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మ‌హమ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు గాను దేశంలో లాక్డౌన్ అమ‌లవుతున్న నేప‌థ్యంలో.. ప్ర‌త్యేక ఆర్థిక మండ‌ళ్ల‌లోని (సెజ్‌) యూనిట్లు, వాటి అభివృద్ధిక‌ర్త‌లు, స‌హ‌-అభివృద్ధిక‌ర్త‌ల‌కు ప్ర‌భుత్వం గొప్ప ఊర‌ట క‌లిగించే నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. సెజ్ యూనిట్లు, అభివృద్ధిక‌ర్తలు, స‌హ‌-అభివృద్ధిక‌ర్త‌లు అధికారికంగా దాఖ‌లు చేయాల్సిన నివేదిక‌లు, ప్ర‌తాలు, కాలావ‌ధి ముగుస్తున్న అనుమ‌తుల రెన్యువ‌ల్స్ త‌క్ష‌ణం పొందాల్సిన అవ‌స‌ర లేకుండా మిన‌హాయింపుల‌ను ప్ర‌క‌టించింది. లాక్డౌన్ నేప‌థ్యంలో అత్య‌ధికంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాలు మూసివేసి ఉండ‌డం, ప‌ని చేస్తున్నా కేవ‌లం కొద్ది మంది సిబ్బందితో ముఖ్య విధులు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో అనుమ‌తులు లేని కార‌ణంగా సెజ్ సంస్థ‌ల కార్య‌క‌లాపాల‌కు ఎలాంటి ఆటంకం క‌లుగ‌కూడ‌ద‌న్న భావ‌న‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న ఈ తాజా నిర్ణ‌యంతో లాక్డౌన్ అమ‌లులో ఉన్న స‌మ‌యంలో సెజ్‌లు డెవ‌ప‌ర్లు, సహ‌-డెవ‌ల‌పర్లు స్వ‌తంత్ర చార్ట‌ర్డ్ ఇంజినీర్లు ధ్రువీక‌రించిన త్రైమాసిక అభివృద్ధి నివేదికను (క్యూపీఆర్‌) దాఖలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఐటీ లేద ఐటీ ఆధారిత సేవ‌ల‌ను అందిస్తున్న సెజ్ యూనిట్లు సాఫ్టెక్స్ ఫార‌మును కూడా దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. దీనికి తోడు వార్షిక ప‌నితీరు నివేదిక‌లు (ఏపీఆర్‌) కూడా స‌ర్కారుకు నివేదించాల్సిన అవ‌స‌రం లేదు. దీనికి తోడు సెజ్‌ల‌ను అభివృద్ధి చేసే మరియు అమ‌లు చేసే ప్ర్రక్రియ‌లో ఉన్న డెవ‌ప‌ర్లు, స‌హ‌-డెవ‌ల‌ప‌ర్లు వివిధ విష‌యాల నిమిత్తం, యూనిట్ల ప్రారంభం కోసం తీసుకున్న లెట‌ర్ ఆఫ్ అప్రూవ‌ల్స్ (ఎల్‌వోఏ) గ‌డువు ముగుస్తున్న‌ప్ప‌టికీ.. పాత వాటి రెన్యూవ‌ల్స్ గానీ లేదా కొత్త‌వాటికి వెనువెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌స‌రం లేకుండా త‌మ‌త‌మ కార్య‌క‌లాపాల‌ను సెజ్‌లు నిర్విరామంగా నిర్వ‌ర్తించుకొనేలా కేంద్ర ప్ర‌భుత్వం తాజా ఉత్త‌ర్వుల‌లో వెసులుబాటును క‌ల్పించింది. దేశంలో నెల‌కొన్న అసాధార‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సెజ్ యూనిట్ల వారికి, సెజ్ అభివృద్ధిక‌ర్త‌లు, స‌హ‌-అభివృద్ధిక‌ర్త‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌గ‌కుండా అన్ని అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల్సిందిగా సెజ్‌ల అభివృద్ధి క‌మిష‌న‌ర్లకు స‌ర్కారు ఆదేశాలు అందాయి. ఈ కాలంలో ఏదైనా అనుమ‌తులకు స‌మ్మ‌తులు నెర‌వేర్చ‌ని సంద‌ర్భంలో సంబంధితుల‌పై ఎలాంటి శిక్షాత్మ‌క చ‌ర్య‌లను అమ‌లుప‌ర‌చ‌వ‌ద్దంటూ క‌మిన‌ర్ల‌ను ఆదేశించింది. దీనికి తోడు సాధ్య‌మైనంత వ‌ర‌కు ఎల్‌వోఏలు ఇత‌ర స‌మ్మ‌తులు పొడిగింపుల‌ను ఎలక్ర్టానిక్ రూపంలో స‌మ‌యానుసారంగా అందుబాటులో ఉంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా క‌మిష‌న‌ర్ల‌కు ఆదేశాలు అందాయి. ఎలక్ర్టానిక్ విధానంలో పొడిగింపులు మంజూరు చేయ‌డం సాధ్యంకాని సందర్భాల్లోను, అనుమ‌తుల నిమిత్తం భౌతిక స‌మావేశం త‌ప్ప‌ని స‌రిగా అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో సెజ్ డెవ‌ల‌ప‌ర్లు, స‌హ‌-డెవ‌ల‌ప‌ర్ల‌కు యూనిట్ల‌కు గ‌డువు ముగియ‌డం వ‌ల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర‌వ‌కుండా చూసుకోవాల‌ని స‌ర్కారు డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిష‌న‌ర్ల‌ను స‌ర్కారు కోరింది. వివిధ తాత్కాలిక అనుమ‌తుల‌ను 30.06.2020 గ‌డువు తేదీతో గానీ దీనికి సంబంధించి స‌ర్కారు నుంచి జారీ అయ్యే త‌దుప‌రి నిబంధ‌న మేర‌కు మంజూరు చేయాల‌ని స‌ర్కారు సూచించింది.


(Release ID: 1609298) Visitor Counter : 202