సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ 66వ వార్షికోత్సవం :

లాక్ డౌన్ కారణంగా గ్యాలరీ లో శాశ్వత సేకరణల వీక్షణకు వర్చ్యువల్ టూర్

ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఈ వినూత్న సౌకర్యాన్ని తొలి సారి

అందుబాటులోకి తెచ్చిన నేషనల్ గ్యాలరీ

Posted On: 30 MAR 2020 1:09PM by PIB Hyderabad

కోవిడ్-19 వ్యాప్తికి విరుగుడుగా దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. ఈ కారణంగా కేంద్ర సాంస్కృతిక శాఖ కింద ఉన్న మ్యూజియంలు మరియు గ్రంథాలయాలను మూసివేసి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు  ప్రజల సందర్శనను నిలుపుదల చేసారు. . అందువల్ల ప్రతిష్టాత్మకమైన జాతీయ ఆధునిక కళల ప్రదర్శనశాల నేషనల్ గ్యాలరీ అఫ్ మోడరన్ ఆర్ట్ శాశ్వత సేకరణలు ఏవైతే ఉన్నాయో వాటిని తిలకించే అవకాశం ప్రస్తుతానికి  లేదు.    

మర్చి 29 వ తేదీ  గ్యాలరీ  66 వ్యవస్థాపక దినోత్సవం కాగా దానిని జరుపుకునే అవకాశం ప్రస్తుతం లేదు. అందువల్ల ప్రజలు ముఖ్యంగా కళా ప్రియులు ఈ వస్తు ప్రదర్శన శాల ను ప్రత్యక్షంగా చూడలేకపోయినాఆ అనుభవం కలిగించేలా వర్చ్యువల్ గా వీక్షించే అవకాశం కల్పించారు. ఇటువంటి సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం ఇది తొలిసారి అని నేషనల్  గ్యాలరీ   డైరెక్టర్ జనరల్ శ్రీ అద్వైత గడనాయక్ తెలిపారు.  

క్రియాశీలంప్రగతిశీలమైన తమ  సంస్థ ప్రస్థానంలో అనేక శాశ్వత కళలుకళాకృతులు సేకరణలను ఈ గ్యాలరీ ప్రతిబింబిస్తుంది. గ్యాలరీ వర్చ్యువల్ టూర్ లో ప్రదర్శనను వాస్తవంగా వీక్షించే అనుభవాన్ని కల్పించినట్టు శ్రీ గడనాయక్ చెప్పారు. 

విజువల్ టూర్‌లోని ప్రదర్శించే  శిల్పాలుపెయింటింగ్‌లుముద్రణలు  ఎంతోకాలంగా సేకరించి నిక్షిప్తం చేసినవి. ఈ ప్రదర్శన ప్రస్తుత ఆధునిక కళా నిపుణులకు ఇస్తున్న గౌరవం. ఇది సృజనాత్మక మాధ్యమంగా శిల్పాలుపెయింటింగ్‌లు మరియు ముద్రణల  వారసత్వం పట్ల ప్రజలలో ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుంది అని డైరెక్టర్ జనరల్ శ్రీ గడనాయక్ వివరించారు. ఈ కింది లింక్ ద్వారా వర్చ్యువల్ టూర్ చేయవచ్చు. 

 http://www.ngmaindia.gov.in/index.asp



(Release ID: 1609266) Visitor Counter : 108