సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

దూరదర్శన్ నేషనల్ లో ప్రఖ్యాత రామాయణం సీరియల్ పునఃప్రసారం

Posted On: 27 MAR 2020 6:27PM by PIB Hyderabad

దేశంలో ప్రస్తుతం చోటు చేసుకున్న కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, 21 రోజుల పాటు లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ళకు పరిమితమైన ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి 2020 మార్చి 28 శనివారం నుంచి దూరదర్శన్ నేషనల్ లో రామానంద సాగర్ యొక్క రామాయణాన్ని ప్రసారం చేయాలని నిర్ణయించాయి.

ఈ ప్రకటన చేస్తూ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ రామాయణాన్ని తిరిగి ప్రసారం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకూ మరియు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకూ రెండు సమయాల్లో ఇది ప్రసారం అవుతుంది, సాయంత్రం ప్రసారం చేసిన భాగాన్ని తర్వాత రోజు ఉదయం ప్రసారం చేయడం జరుగుతుందని వివరించారు.

ఈ ధారావాహిక పట్ల ప్రజల అపారమైన ఆసక్తిని మరియు దీని పునఃప్రసారం కోసం ప్రజల్లో ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ధారావాహిక పునఃప్రసారం కోసం యుద్ధ ప్రాతిపదికన పని చేసిన దూరదర్శన్ బృందాన్ని ప్రసార భారతి సి.ఈ.వో. శ్రీ శశిశేఖర్ వెంపటి అభినందించారు. దూరదర్శన్ లో ఈ ధారావాహికను అందుబాటులోకి తీసుకొచ్చిన సాగర్ కుటుంబానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కోవిడ్ -19 పై అవగాహన కల్పించేందుకు ప్రసార భారతి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. నూతన ప్రసారాల విభాగం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకూ హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యేక బులెటిన్లను ప్రసారం చేస్తోంది. అదే విధంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలను డి.డి.న్యూస్ మరియు డి.డి.ఇండియా కూడా ప్రసారం చేస్తున్నాయి. 

 


(Release ID: 1608656) Visitor Counter : 132