సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 నేపథ్యంలో దివ్యాంగుల రక్షణ మరియు భద్రత కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసిన దివ్యాంగుల సాధికారిత విభాగం (DEPwD)

Posted On: 27 MAR 2020 1:43PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం (DEPwDకోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో దివ్యాంగుల రక్షణ మరియు భద్రత కోసం భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు దివ్యాంగ సమగ్ర సంఘటిత మార్గదర్శకాలను జారీ చేసింది.  కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచమంతా వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల దృష్ట్యా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజారోగ్యం మరింత ప్రమాదంలో పడింది. పరిస్థితులు మెరుగు పడాలంటే కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరుఫున అత్యవసర చర్యలు అవసరం. కోవిడ్ -19 ద్వారా ఉత్పన్నమౌతున్న పరిస్థితులను జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం -2005 ప్రకారం అవసరమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజలతో పాటు ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా వెబ్ సైట్ (www.mohfw.gov.in) లో ఈ క్రింది అంశాలు అందుబాటులో ఉన్నాయి.

·        దేశ పౌరులు మరియు ఆరోగ్య కార్యకర్తల కోసం హిందీ మరియు ఇంగ్లీషులో అవగాహన మెటీరియల్

·        సామూహిక సమావేశాలు మరియు సామాజిక దూరంపై సలహా.

·        వ్యాధి బారిన పడ్డవారి సంరక్షణ కోసం టెలి మెడిసిన్ పద్ధతులతో సహా ఆసుపత్రులు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మరియు విధానాలు.

·        సహాయం అందించే ఫోన్ నంబర్లు 1075, 011-23978046, 9013151515

·        తరచూ అడిగే ప్రశ్నలు.

జనాభా మొత్తం మీద కోవిడ్ -19 ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్న నేపథ్యంలో దివ్యాంగుల శారీరక, స్పందన మరియు అభిజ్ఞా పరిమితుల కారణంగా ఈ వ్యాధి వల్ల ఎక్కువ ప్రతికూల ప్రభావానికి గురౌతారు. అందుకే దివ్యాంగుల నిర్ధిష్ట అవసరాలు, రోజువారీ కార్యకలాపాలను అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అంతే కాకుండా ప్రమాదకర పరిస్థితుల్లో వారికి రక్షణ మరియు భద్రత ఎంత మేరకు ఉందనే అంశాన్ని గుర్తించి, ఈ రెండింటి కోసం సకాలంలో చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

దివ్యాంగుల హక్కుల చట్టు -2016లోని సెక్షన్ – 8 ప్రతికూల పరిస్థితుల్లో దివ్యాంగుల సమాన రక్షణ మరియు భద్రత కోసం హామీ ఇస్తోంది. విపత్తు నిర్వహణ కార్యకలాపాల్లో దివ్యాంగుల రక్షణను కూడా చేర్చడానికి, వారి గురించి తగిన సమాచారం ఇవ్వడానికి జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణ అధికారులను ఆదేశించింది. విపత్తు నిర్వహణ సమయంలో, ఈ కార్యక్రమాల్లో దివ్యాంగుల కోసం సంబధిత రాష్ట్రాల కమిషనర్ స్థాయి అధికారులు పాల్గొనడం తప్పనిసరి. పైన పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా 2019 సెప్టెంబర్ లో, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మరియు కేంద్ర దేశీయ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ దివ్యాంగులకు విపత్తు ప్రమాద తగ్గింపు (డి.డి.ఆర్.ఆర్)పై జాతీయ విపత్తు నిర్వహణ మార్గదర్శకాలను జారీ చేసింది. అంతే కాకుండా ఇటీవల అనగా 2020 మార్చి 24న, 2020 మార్చి 25 నుమచి 21 రోజుల వ్యవధిలో దివ్యాంగుల్లో కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వివిధ సంబంధిత శాఖల అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది.

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు పౌరులందరికీ వర్తిస్తాయి. అయితే ప్రత్యేకించి ఈ క్రింది చర్యలను దివ్యాంగ వ్యక్తుల రక్షణ మరియు భద్రత పై దృష్టి సారించడానికి వివిధ రాష్ట్ర మరియు జిల్లా అధికారులు తీసుకోవలసిన అవసరం ఉందని సూచించారు.

 

సాధారణ చర్యలకు సంబంధించిన అంశాలు

·        కోవిడ్ -19 కోసం అందించే సేవలు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన మొత్తం సమాచారం సాధారణ మరియు స్థానిక భాషలో అందుబాటులో ఉండే ఫార్మాట్లలో సిద్ధంగా ఉండాలి. అనగా దృష్టి లోపం గల వ్యక్తుల కోసం బ్రెయిల్ లిపి మరియు ఆడియో టేపులలో, ఉపశీర్షికలతో వీడియో – గ్రాఫిక్ మెటీరియల్ మరియు వినికిడి లోపం ఉన్న వారికి సంకేత బాషా వివరణ రూపంలో వారికి చేరే విధంగా వెబ్ సైట్ల ద్వారా అందుబాటులో ఉండాలి.

·        అత్యవసర మరియు ఆరోగ్య అంశాల్లో పని చేసే సంకేత బాషా వ్యాఖ్యాతలకు కోవిడ్ -19 కోసం పని చేస్తున్న ఇతర ఆరోగ్య సంరక్షణ కార్మికుల మాదిరిగానే ఆరోగ్య మరియు భద్రతా రక్షణను అందజేయాలి.

·        అత్యవసర సేవలను  అందించేందుకు కేటాయించిన వ్యక్తులందరికీ దివ్యాంగుల హక్కుల గురించి శిక్షణ ఇవ్వాలి. అంతే కాకుండా నిర్థిష్ట లోపాలు ఉన్న వారికి, అదనపు సమస్యలతో ఇబ్బంది పడే వారికి ప్రత్యేకంగా ఎదురయ్యే ప్రమాదాల గురించి శిక్షణ ఇవ్వాలి.

·        వైకల్యం ఉన్న వారికి సహకారం అందించడం గురించిన సంబంధిత సమాచారం అన్ని అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఉండాలి.

స్వీయ నిర్బంధం సమయంలో అవసరమైన సహాయక సేవలు, వ్యక్తిగత సహాయం మరియు భౌతికంగా వారికి సమాచారం అందజేయడానికి అవకాశం ఉండేలా చూడాలి. చూపు లేని వారు, మానసిక వైకల్యం ఉన్నవారు ఇతరుల సహాయం మీద ఆధారపడి ఉంటారు. అదే విధంగా దివ్యాంగులు వీల్ చైర్ సహా ఇతర సహాయక పరికరాల్లో లోపాలను సరిదిద్దేందుకు సహాయం కోరవచ్చు.

·        లాక్ డౌన్ సమయంలో పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వడం ద్వారా లేదా ప్రాధాన్యతపై సరళీకృత పద్ధతిలో పాస్ లను అందిచడం ద్వారా దివ్యాంగుల సంరక్షకులకు చేరుకునే అనుమతి త్వరితం చేయాలి.

·        మానవ సేవలు అవసరమైన దివ్యాంగుల కోసం సహాయక సేవలు కొనసాగించడాన్ని నిర్ధారించడానికి, సంరక్షకుల వ్యక్తిగత రక్షణ పరికరాలను నిర్థారించడానికి తగిన ప్రచారం ఇవ్వాలి.

·        నివాస సంక్షేమ సంఘాలు దివ్యాంగుల అవసరాల విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాలి. తద్వారా సంరక్షకులు, ఇతర సహాయకులు సరైన వ్యక్తిగత పరిశుభ్రత విధానాన్ని అనుసరించిన తర్వాతనే దివ్యాంగుల వద్దకు వారిని అనుమతించవచ్చు.

·        దివ్యాంగులకు అవసరమైన ఆహారం, నీరు, ఔషధాలు మరియు అవసరమైన అన్ని రకాల వస్తువులను వారు స్వీయ నిర్భంధంలో ఉన్న ప్రదేశంలో అందుబాటులో ఉంచాలి.

·        ప్రత్యేకించి పెద్దలు మరియు దివ్యాంగుల రోజు వారీ అవసరాలకు సంబంధించిన వస్తువులను తెచ్చుకునేందుకు సూపర్ మార్కెట్లు సహా రిటైల్ ప్రొవిజన్ స్టోర్లలో నిర్థిష్ట ప్రారంభ సమయాలను కేటాయించడం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కనీస బాధ్యతగా గుర్తించాలి.

·        పి.డబ్ల్యూ.డి ల కోసం నిర్బంధ సమయంలో సహకారాన్ని సులభతరం చేయడానిరి పీర్ సపోర్ట్ నెట్ వర్క్ లు ఏర్పాటు కావాలి.

·        దివ్యాంగుల బలహీనతల ఆధారంగా అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలి. వారికి అత్యవసర కాలంలో ప్రయాణించడానికి పాస్ లాంటివి అందజేయాలి. వారి వ్యక్తిగత భద్రత మరియు రక్షణ విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాలి.

·        దివ్యాంగులకు చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలు, దివ్యాంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

·        ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో అంధత్వం మరియు ఇతర తీవ్రమైన వైకల్యం ఉన్న ఉద్యోగులను ఈ కాలంలో అవసరమైన సేవల పనుల నుంచి మినహాయించాలి. ఎందుకంటే వారికి సులభంగా ఈ వైరస్ సోకవచ్చు.

·        స్వీయ నిర్బంధ వ్యవధిని ఎదుర్కోవడానికి దివ్యాంగులతో పాటు వారి కుటుంబాలకు ఆన్ లైన్ కౌన్సిలింగ్ విధానాన్ని అభివృద్ధి చేయాలి.

·        దివ్యాంగుల కోసం రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ భాషా వివరణ మరియు వీడియో కాలింగ్ సౌకర్యాలతో 24 గంటలు పని చేసే ప్రత్యేక సహాయ ఫోన్ నంబర్ ను ఏర్పాటు చేయాలి.

·        కోవిడ్ -19 గురించి దివ్యాంగులకు అందజేసేందు ప్రత్యేక సమాచార సామగ్రిని తయారు చేయడం మరియు అందజేయడంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వచ్ఛంద సంస్థల సేవలను పరిగణలోకి తీసుకోవాలి.

ఈ కాలంలో దివ్యాంగులు నిర్ధిష్ట సమస్యలను పరిష్కరించే విధానం

(ఎ) పిడబ్ల్యుడిల రాష్ట్ర కమిషనర్ ల కోసం

·        పిడబ్ల్యూడిల కోసం రాష్ట్ర కమిషనల్ లను దివ్యాంగుల విషయంలో రాష్ట్ర నోడల్ అధికారిగా ప్రకటించాలి.

·        ఈ సంక్షోభ సమయంలో దివ్యాంగులు నిర్థిష్ట సమస్యలను పరిష్కరించేందుకు వారు పూర్తిస్థాయి ఇంఛార్జ్ గా వ్యవహరించాలి.

·        రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం, ఆరోగ్యం, పోలీసు మరియు ఇతర విభాగాలతో పాటు జిల్లా కలెక్టర్లు మరియు దివ్యాంగుల వ్యవహారాలు చూసే జిల్లా స్థాయి అధికారులతో వీరే సమన్వయం చేయవలసి ఉంటుంది.

·        కోవిడ్ -19 ప్రజా పరిమితి ప్రణాళికలు, అందించే సేవల గురించి మొత్తం సమాచారం స్థానిక భాషలో అవసరమైన ఫార్మాట్లలో అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది.

 

(బి) పిడబ్ల్యుడిల సాధికారతకు సంబంధించిన జిల్లా అధికారి

పిడ

·        పిడబ్ల్యుడిల సాధికారతకు సంబంధించిన జిల్లా అధికారిని దివ్యాంగుల వ్యవహారాల జిల్లా నోడల్ అధికారిగా ప్రకటించాలి మరియు పరిగణించాలి.

·        జిల్లాలో పిడబ్య్లూడిల జాబితాను ఆ అధికారి కలిగి ఉండాలి. మరియు వారి అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. తీవ్రమైన వైకల్యాలు ఉన్న వ్యక్తులకు సంబంధించిన ప్రత్యేక జాబితాను కలిగి ఉండాలి.

·        అందుబాటులో ఉన్న వనరులతో సమస్యలను పరిష్కరించేందుకు ఆ అధికారి బాధ్యత వహిస్తాడు. అవసరమైతే ప్రభుత్వేతర సంస్థలు మరియు సివిల్ సొసైటీ సంస్థలు సహా నివాస సంక్షేమ సంఘాల సహాయాన్ని వారు తీసుకోవచ్చు.

 


(Release ID: 1608609) Visitor Counter : 162