ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఏర్పాటు : కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి
నిత్యవసర ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి మరియు పంపిణీ అంతరాయం లేకుండా జరగాలని రాష్ట్రాలకు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి లేఖ
Posted On:
26 MAR 2020 5:01PM by PIB Hyderabad
· కోవిడ్-19 లాక్ డౌన్ సందర్బంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల వారు ఎదుర్కొనే సమస్యలకు సత్వరమే పరిష్కరించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్ సూచించారు. ఇందు కోసం కేంద్ర మంత్రిత్వ శాఖలో ఒక సమస్యల పరిష్కార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆమె ఈ రోజు ట్వీట్ చేశారు.
· పరిశ్రమకు చెందిన వారు ఏదైనా సమస్యలను ఎదుర్కొంటే
covidgrievance-mofpi[at]gov[dot]in మెయిల్ కి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని కేంద్ర మంత్రి ప్రకటించారు.
· వ్యవసాయ ఆహారోత్పత్తుల పరిశ్రమల కార్యకలాపాలు సజావుగా సాగేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని, పెట్టుబడి దారులకు రియల్ టైం సహాయం అందిస్తామని ఆమె అన్నారు.
· అంతకు ముందు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా కార్యదర్శి శ్రీమతి పుష్ప సుబ్రహ్మణ్యం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాస్తూ, ఆహార పరిశ్రమ కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిత్యావసర, అత్యవసర ఆహార ఉత్పత్తులు, వాటి వివరాల జాబితాను ఈ లేఖతో పాటు జత చేసారు.
· సరఫరా గొలుసు కొనసాగడానికి, నిర్వహణకు ఈ ఆహార ఉత్పత్తుల నిరంతరాయ తయారీ కీలకం అని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ముడి సరుకు, ప్యాకేజింగ్ వస్తువులు, ట్రక్కుల రవాణా, గిడ్డంగుల నిర్వహణ, విధులు నిర్వహించే వారి హాజరు తదితర అంశాలన్నిటినీ ప్రముఖంగా ప్రస్తావించారు.
· జిల్లాల్లో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, ఆ ఉత్పత్తుల రవాణా, ముడి సరకు, సిబ్బంది అందుబాటు అంశాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులకు తగు సూచనలు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర కార్యదర్శి తన లేఖ లో స్పష్టం చేశారు. ఇది చాల కీలకమైనదని అన్నారు.
లేఖతో జతచేయబడిన ఆహార ఉత్పత్తుల జాబితా:
తయారీ, రవాణా, పంపిణీ & రిటైల్...
పండ్లు & కూరగాయలు
బియ్యం, గోధుమ పిండి, ఇతర తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు
చక్కెర మరియు ఉప్పు, సుగంధ ద్రవ్యాలు & మసాలాలు
బేకరీ & పాల (పాల & పాలు ఉత్పత్తులు)
టీ మరియు కాఫీ
కోడిగుడ్లు, మాంసం మరియు చేపలు
ఆహార దినుసులు, నూనె, మసాలా మరియు ఆహార పదార్థాలు
ప్యాక్ చేసిన ఆహారం & పానీయాలు
ఆరోగ్య పదార్ధాలు, పోషక ఆహార పదార్థాలు, స్పెషల్ మెడికల్ పర్పస్ (ఎఫ్‌ఎస్‌ఎంపి)
పసిపిల్లల ఆహరం
అనిమల్ ఫీడ్ / పెంపుడు జంతువుల ఆహారం (ఎఫ్‌ఎస్‌డియు) మరియు ఎఫ్ఎస్ఎంపి
పైన పేర్కొన్న ఉత్పత్తుల కోసం ఫుడ్ డెలివరీ సేవలు & ఇ-కామర్స్
కోల్డ్-స్టోరేజ్ / ఆహార ఉత్పత్తుల గిడ్డంగి
బొగ్గు, బియ్యం ఊక, డీజిల్ / ఫర్నెన్స్ ఆయిల్ మరియు మొక్కలు / కర్మాగారాల నిర్వహణ / తయారీని నిర్ధారించడానికి అవసరమైనవి.
అన్ని ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ ఉత్పత్తులు :
ప్యాకేజీ చేసిన ఆహారం & పానీయాలు
ప్రిజర్వేటివ్స్, ప్రోటీన్ కాన్సన్ట్రేట్ ; ముఖ్యమైన అమైనో ఆమ్లాలు; అయోడైజ్డ్ ఉప్పు; కనోల నూనె; తినదగిన కూరగాయల నూనెలు ;
పాల పొడి; సుక్రోజ్, డెక్స్ట్రోస్, డెక్స్ట్రిన్, మాల్టోస్ డెక్స్ట్రిన్, లాక్టోస్, తేనె, మొక్కజొన్న సిరప్ వంటి వివిధ కార్బోహైడ్రేట్లు; మాల్ట్, లిక్విడ్ గ్లూకోజ్
****
(Release ID: 1608437)
Visitor Counter : 184