శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నేపథ్యంలో అంకుర సంస్థల ద్వారా టెక్నాలజీ మ్యాపింగ్ కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్న డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) డయాగ్నస్టిక్స్, పరీక్షలు, హెల్త్ కేర్ డెలివరీ సొల్యూషన్స్, ఎక్విప్ మెంట్ సప్లై వంటి రంగాల్లో సిద్ధంగా ఉన్న సేవల కోసం నిధులు
Posted On:
26 MAR 2020 4:21PM by PIB Hyderabad
కోవిడ్ – 19 కు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించే దిశగా భారతదేశంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి, తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం (డి.ఎస్.టి) సరికొత్త ఆవిష్కరణలను సమన్వయం చేయనుంది. అదే విధంగా కోవిడ్ -19 మహమ్మారి నుంచి ఉత్పన్నం అవుతున్న అత్యవసర పరిస్థితుల్లో దేశాన్ని సిద్ధం చేసేందుకు నూతన మరియు అభివృద్ధి చెందుతున్న పరిష్కారాల కోసం అన్వేషిస్తోంది.
డయాగ్నస్టిక్స్, టెస్టింగ్, హెల్త్ కేర్ డెలివరీ సొల్యూషన్స్, ఎక్విప్ మెంట్ సప్లైస్ వంటి రంగాల్లో ఆర్ అండ్ డి ల్యాబ్ లు, విద్యా సంస్థలు, అంకుర సంస్థలు, ఎం.ఎస్. ఎం.ఈ.ల నుంచి టెక్నాలజీ మ్యాపింగ్ కోసం, దాదాపు సిద్ధంగా ఉన్న సేవలు మరియు పరిష్కారాలకు నిధులు సమకూర్చేందుకు డి.ఎస్.టి. విభాగం కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. మాస్కులు, ఇతర ఆరోగ్య రక్షణ సామగ్రి, శానిటైజర్స్, స్క్రీనింగ్ కోసం తక్కువ ధరలో వస్తు సామగ్రి, వెంటిలేటర్లు, ఆక్సిజనేటర్లతో పాటు AI మరియు IOT ఆధారిత పరిష్కారాల ద్వారా వ్యాప్తి చెందడాన్ని ట్రాక్ చేయడం, పర్యవేక్షించడం మరియు నియంత్రించడానికి డేటా విశ్లేషణలు లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డి.ఎస్.టి), డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (డి.బి.టి), ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం.ఈ.ఐ.టి.వై), కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్), అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎ.ఐ.ఎం), సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.ఎం.ఈ), స్టార్టప్ ఇండియా మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఈ) లకు చెందిన ప్రతినిధులు ఈ సమర్థమైన మ్యాపింగ్ గ్రూపులో ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ అత్యంత ఆశాజనకరమైన అంకుర సంస్థలను గుర్తించడంతో పాటు వాటికి అవసరమైన ఆర్థిక మరియు ఇతర సహాయాలను వేగంగా చేసి, త్వరిత గతిన పరిష్కారాలు కనుగొనడం, పూర్తి చేయడం సాధ్యమౌతుంది.
కోవిడ్ – 19 కి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన అంశానికి సాంకేతిక పరిష్కారాలను చూపించే అంకుర సంస్థలను వాటికి మద్ధతు అందించే ఇతర సంస్థల సమాచారాన్ని పొందే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధింత మంత్రిత్వ శాఖలు మరియు ఆయా విభాగాల నోడల్ అధికారులను స్వయంగా అభ్యర్థించడం జరిగింది.
సంబంధిత సాంకేతిక అంశాల వేగవంతమైన అభివృద్ధి, తయారీ మరియు విస్తరణ కోసం ఉపయోగపడే యంత్రాల్లో భాగంగా, డి.ఎస్.టి ఇప్పటికే రెండు వేరు వేరు ప్రతిపాదనల ద్వారా ఆహ్వానం పలుకుతోంది. సైన్స్ అండ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్.ఈ.ఆర్.బి) మరియు టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డ్ (టి.డి.బి) ద్వారా నూతన మరియు ఇప్పటికే అందబాటులో ఉన్న పరిష్కారాల అభివృద్ధి విషయంలో శాస్త్రీయ పరిష్కారాల తయారీ వాణిజ్యానికి మద్ధతు అందించనుంది.
*****
(Release ID: 1608385)
Visitor Counter : 152