మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆన్ లైనులో అధ్యయనం చేయడం ద్వారా తమ సమయాన్ని అర్ధవంతంగా వినియోగించాలని విద్యార్ధులు మరియు అధ్యాపకులను కోరిన యు జి సి

Posted On: 25 MAR 2020 9:11PM by PIB Hyderabad

కోవిడ్ -19 ఎదుర్కోవడానికి నిరోధక, ముందుజాగ్రత చర్యల ద్వారా అందరం ఉమ్మడి పోరాటం చేస్తున్న ఈ తరుణంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్ళలో / వసతి గృహాలలో ఉంటూ ఆన్ లైనులో అధ్యయనం చేయడం ద్వారా తమ సమయాన్ని అర్ధవంతంగా వినియోగించాలని విద్యార్ధులు మరియు అధ్యాపకులకు రాసిన లేఖలో యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం (యు జి సి) కోరింది. ఇందుకోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమాచార సాంకేతిక సందేశాల(ఐసిటి)ను ప్రోత్సహించే చర్యల ద్వారా  యు జి సి మరియు దాని అంతర్ యూనివర్సిటీ కేంద్రాలు  - సమాచార మరియు గ్రంధాలయ యంత్రాంగం (INFLIBNET) మరియు విద్యా సందేశాలు అందించే బృందం డిజిటల్ వేదికల ద్వారా సమాచారాన్ని, పరిశోధనా గ్రంధాలను అందిస్తున్నాయి. అవి యూనివర్సిటీలు, కాలేజీలలోని  అధ్యాపకులకు, విద్యార్దులకు, పరిశోధకులకు వారి అధ్యయన పరిధిని విస్తరించేందుకు తోడ్పడుతున్నాయి. ఐసిటి వినియోగ చర్యలకు ఉపక్రమించేందుకు ప్రవేశ సౌలభ్యం కల్పించే లింకుల జాబితాను దిగువ ఇచ్చారు.

  1. స్వయం ఆన్ లైను కోర్సులు: https://storage.googleapis.com/uniquecourses/online.html

ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా స్వయం ప్లాట్ ఫాం ద్వారా ఉచితంగా ఉత్తమమైన వనరులను పొందవచ్చు. జనవరి 2020 సెమెస్టర్ లో స్వయంలో swayam.gov.in నమోదైన వారు కూడా దానిని ఉపయోగించుకోవచ్చు.

  1. UG/PG  MOOCs: http://ugcmoocs.inflibnet.ac.in/ugcmoocs/moocs_courses.php

సాంకేతికేతర కోర్సుల అధ్యయనం చేస్తున్న యుజి మరియు పిజి విద్యార్ధులకు ఇది ఉపయుక్తం.

  1. e-PG Pathshala epgp.inflibnet.ac.in 70కి పైగా పి జి కోర్సులకు అవసరమైన పాఠ్యాంశాలతో నాణ్యమైన  ఈ-టెక్స్ట్ మరియు వీడియోలు అందుబాటులో ఉంటాయి.
  2. e-Content courseware in UG subjects : 87 యుజి కోర్సులకు అవసరమైన ఈ-కంటెంట్ http://cec.nic.in/ వెబ్ సైట్ లో లభ్యమవుతుంది.
  3. SWAYAMPRABHA: https://www.swayamprabha.gov.in/

32 డి టి హెచ్ చానల్స్ ద్వారా నాణ్యమైన విద్యావిషయక సమాచారాన్ని,  పాఠ్యాంశాలను పొందవచ్చు. వివిధ శాస్త్రాలు, విభాగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. కళలు, విజ్ఞానశాస్త్రం, వాణిజ్యశాస్త్రం, అభినయ కళలు, సామాజిక శాస్త్రాలు, మానవ విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన విషయాలు , ఇంజనీరింగ్, టెక్నాలజీ, న్యాయశాస్త్రం, వైద్య శాస్త్రం, వ్యవసాయం మొదలగునవి అధ్యాపకులు, విద్యార్దులు, పౌరులకు తమ జీవితాంతం వరకు చదువుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఈ చానల్స్ అన్నీ ఉచితం. మీ కేబుల్ ఆపరేటర్ ద్వారా పొందవచ్చు.

  1. CEC-UGC YouTube channel: https://www.youtube.com/user/cecedusat అపరిమితంగా పాఠ్యాంశాల లెక్చర్స్ లభించే ఉచిత ఛానల్. 

ఇవి కాకుండా నేషనల్ డిజిటల్ లైబ్రరీ https://ndl.iitkgp.ac.in/ , ఎలక్ట్రానికి రంగానికి చెందిన 2,60,000 పరిశోధనా వ్యాసాల నిధి Shodhganga https://shodhganga.inflibnet.ac.in/ , వివిధ పత్రికల సమీక్షల దత్తాంశాల   ఈ-శోద్ సింధు https://ess.inflibnet.ac.in/ , విద్వాన్  https: //vidwan.inflibnet.ac.in/ . ఇది వివిధ విషయాలలో నిపుణులకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది.  వివిధ సంస్థలలో పనిచేసే అధ్యాపకులు దీనిలో నమోదు చేసుకోవాలని కోరడమైనది.

నిపుణులు తయారు చేసి ఈ లింకుల ద్వారా అందుబాటులోకి వచ్చిన పాఠ్యాంశాలు అందరికీ మంచి అభ్యాసాన్ని, అనుభూతిని మిగల్చగలవని ఆశిస్తున్నారు.

ఏవైనా సందేహాలు లేక వివరణల కోసం యు జి సి,  సమాచార మరియు గ్రంధాలయ యంత్రాంగం INFLIBNET మరియు CEC లను సంప్రదించవచ్చు. వారి మెయిల్ ఐ డి లు వరుసగా eresource.ugc[at]gmail[dot]com, eresource.inflibnet[at]gmail[dot]com and eresource.cec[at]gmail[dot]com


(Release ID: 1608354) Visitor Counter : 181