ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ వి. పుతిన్ కు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ
Posted On:
25 MAR 2020 10:54PM by PIB Hyderabad
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ వి పుతిన్‌తో ,ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మాట్లాడారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఇరువురు నాయకులు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను చర్చించారు.
రష్యాలో కోవిడ్ మహమ్మారితో బాధపడుతున్న వారంతా త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వంలో తీసుకుంటున్న చర్యలు విజయవంతం కాగలవని అన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ,కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు ఇండియా చేపట్టిన చర్యలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఆరోగ్యం, ఔషధాలు, శాస్త్రీయ పరిశోధన, మానవతా విషయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలతో సహా అంతర్జాతీయ సంక్షోభం కారణంగా ప్రస్తుత అన్ని సవాళ్లను తగిన విధంగా ఎదుర్కోవడంలో మరింత సహకారం అందించుకునేందుకు, సంప్రదింపులు జరిపేందుకు ఇరువురు నాయకులు అంగీకరించారు. జి-20 ఫ్రేమ్ వర్క్ పరిధిలో కోవిడ్ -19 పై ఐక్యంగా పోరాడటానికి అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు.
రష్యాలో భారతీయ విద్యార్థుల క్షేమంగా ఉండేలా చూసేందుకు రష్యా అధికారుల సహకారాన్ని ప్రధాని ప్రశంసించారు ఇక ముందుకూడా అది కొనసాగగలదని ప్రధాని ఆకాంక్షించారు. ఈ విషయంలో అన్ని రకాలుగాసహాయం అందిస్తామని రష్యా అద్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు.
రష్యా పౌరుల శ్రేయస్సును కాపాడతామని, తగిన సమయంలో వారిని తిప్పి పంపేందుకు సంబంధిత భారత అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తారని అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఇరు దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి , సౌహార్ద్ర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవడానికి , సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి ఇరువురు నాయకులూ అంగీకరించారు.
ఈసంవత్సరంలో వ్యక్తిగతంగా కలుసుకునేందుకు గల మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టు వారు పునరుద్ఘాటించారు.
(Release ID: 1608258)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam