ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ – 19 తాజా సమాచారం – సంసిద్ధత మరియు చర్యలు
Posted On:
12 MAR 2020 3:45PM by PIB Hyderabad
నావల్ కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్ -19) ఇప్పడు అధికారికంగా ప్రపంచ మహమ్మారిగా ప్రకటించబడింది. 114 దేశాల్లో 1,18,000 కు మించి కరోనా వైరస్ కేసులు ఉండడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించింది.
2019 డిసెంబర్ 31న చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కోవిడ్ -19 కేసు నమోదు అయిన నాటి నుంచి భారతదేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ కేంద్ర మంత్రింత్వ శాఖలు, విభాగాల అధికారులతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
2020 జనవరి 30న కోవిడ్ -19ను ప్రజారోగ్య అత్యయిక స్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడానికి ముందే అంటే 2020 జనవరి 8 నుంచే భారతదేశం తరుఫున చర్యలు ప్రారంభం అయ్యాయి. 2020 జనవరి 17న ఆరోగ్య రంగాల సంసిద్ధత కోసం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అదే రోజు పాయింట్ ఆఫ్ ఎంట్రీ నిఘా కూడా ప్రారంభం అయ్యింది.
కమ్యూనిటీ నిఘా, ఐసోలేషన్ సౌకర్యాలు, ఐసోలేషన్ వార్డులు, తగినంత పిపిఈలు, సుశిక్షితులైన ఆరోగ్య సేవకులు, కోవిడ్ -19 నిర్వహణ కోసం వేగవంతమైన ప్రతిస్పందన బృందాల పరంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ పరిధిలో వివిధ చర్యలు చేపట్టాయి. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా విమానాశ్రయాల్లో జనవరి 17 నుంచి నిఘా ప్రారంభమైంది. జనవరి 21న మరో 4 విమానాశ్రయాలు (చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, హైదరాబాద్)కు ఇది విస్తరించింది. తర్వాత 30 విమానాశ్రయాలకు విస్తరింపజేసి, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా 12 ప్రధాన ఓడరేవులు, 65 చిన్న ఓడల రేవుల్లో సైతం వైద్యపరీక్షలు ప్రారంభం అయ్యాయి.
విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. కోవిడ్ -19 ప్రభావిత దేశాల నుంచి ఫిబ్రవరి 1 నుంచి పౌరులను సకాలంలో తరలించే ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటి వరకూ మయన్మార్, బంగ్లాదేశ్, చైనా, అమెరికా, మడగాస్కర్, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా, పెరూ వంటి దేశాల్లోని 48 మంది విదేశీ పౌరులతో పాటు 900 మంది భారతీయ పౌరులను భారత ప్రభుత్వ తరలించింది.
అదనంగా నిన్న ఇటలీ నుంచి వచ్చిన 83 మందిని వైద్య పరీక్షల కోసం సురక్షిత ప్రదేశాల్లో ఉంచారు. ఆస్పత్రుల్లోని బాధితులందరూ చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
గౌరవ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు మరియు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు కోవిడ్ -19 నిర్వహణకు సంబంధించి చర్యలు చేపట్టడానికి ఉన్నత స్థాయి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉన్నత స్థాయి బృందం ఇప్పటి వరకూ 6 మార్లు సమావేశమైన పరిస్థిని పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ, మార్గ నిర్దేశం చేస్తోంది.
వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిన్న ఉన్నత స్థాయి బృందం సమావేశం జరిపింది. భాత పౌరుల ప్రయోజనార్థం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలపై ప్రభుత్వ చర్చించింది. కేబినెట్ కార్యదర్శుల సిఫారసుల ఆధారంగా, నిన్న సాయంత్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.
- ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలు ( దౌత్య, అధికారిక, అమెరికా సహా ఇతర అంతర్జాతీయ ఉపాధి ప్రాజెక్ట్ సంస్థల వీసాలు మినహా) 2020 ఏప్రిల్ 15 వరకూ నిలిపివేయబడ్డాయి. 2020 మార్చి 13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
- ఓసీఐ కార్డ్ హోల్డర్లకు మంజూరు చేసిన వీసా ఉచిత ప్రయాణ సౌకర్యం 2020 ఏప్రిల్ 15 వరకూ ఉంటుంది. ఇది 2020 మార్చి 13 నుంచి బయలు దేరే కేంద్రాల్లో అమల్లోకి వస్తుంది.
- ఇప్పటికే భారతదేశంలో ఉన్న ఓసీఐ కార్డు హోల్డర్లు తాము కోరినంత కాలం భారత దేశంలోనే ఉండవచ్చు.
- ఇప్పటికే భారతదేశంలో ఉన్న విదేశీయుల వీసాలు చెల్లుబాటులో ఉన్నాయి. వారు తమ వీసా పొడిగింపు లేదా మార్పిడి కోసం ఈ.-ఎఫ్.ఆర్.ఆర్.ఓ. మాడ్యూల్ ద్వారా సమీపంలో ఎఫ్.ఆర్.ఆర్.ఓ లేదా ఎఫ్.ఆర్.ఓ. ని సంప్రదించవచ్చు. లేదా వారు ఎంచుకుంటే కాన్సులర్ సేవలు పొందవచ్చు.
- అత్యవసర కారణాలతో భారత్ రావాలనుకుంటున్న విదేశీయులు సమీప భారతీయ మిషన్ ను సంప్రదించవచ్చు.
- ఇప్పటికే అమలులో ఉన్న వీసా పరిమితులతో పాటు ఇటలీ లేదా రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి ప్రయాణించిన లేదా ప్రయాణించే వారు భారదేశంలోకి ప్రవేశించాలి అనుకుంటే ఆయా దేశాల ఆరోగ్య అధికారుల ద్వారా కోవిడ్-19 లేదని, పరీక్షలు నిర్వహించినట్లు దృవీకరణ పత్రం పొందాల్సిన అవసరం ఉంది. ఇది తక్షణం అమలులోకి వచ్చింది. 2020 మార్చి 10 నుంచి కేసులు తగ్గే వరకూ ఇది తాత్కాలిక చర్య మాత్రమే.
- 2020 ఫిబ్రవరి 15 తర్వాత చైనా, ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన మరియు జర్మనీ నుంచి వచ్చిన వారు లేదా ఆయా దేశాలు సందర్శించి వచ్చిన భారతీయ పౌరులు కనీసం 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. ఇది అన్ని ప్రయాణ కేంద్రాల్లో 2020 మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుంది.
- భారతీయ పౌరులతో పాటు దేశానికి వచ్చిన ప్రయాణికులు అందరూ అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించడమైనది. అంతే కాకుండా వారు భారతదేశానికి వచ్చిన తర్వాత కనీసం 14 రోజులు పర్యవేక్షణలో ఉండాలని సూచించడమైనది.
- చైనా, ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ప్రాన్స్, స్పెయిన్ మరియు జర్మనీలకు వెళ్ళడం మానాలని భారతీయ పౌరులకు మరింత గట్టిగా సూచించడం జరుగుతోంది.
- భారతదేశానికి తిరిగి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులందరూ వారి ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. ప్రభుత్వం తెలియజేసిన నియమాలను పాటించాల్సి ఉంటుంది.
- అంతర్జాతీయ భూ సరిహద్ధుల వద్ద బలమైన స్క్రీనింగ్ సదుపాటాలతో నియమిత చెక్ పోస్ట్ ల వద్ద ఏర్పాట్లు జరిగాయి. వీటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖకు ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది.
- భారతదేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ ప్రయాణికులు ఆరోగ్య అధికారులు మరియు ఇమ్మిగ్రేషన్ అధికారులకు వ్యక్తిగత వివరాలు (అంటే ఫోన్ నంబర్ మరియు భారత్ లో వారి చిరునామా తదితరాలు) తెలియజేసే స్వీయ పత్రాన్ని అందజేయాలి. అదే విధంగా పర్యవేక్షణ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలి.
ప్రస్తుతం దేశంలో 73 కోవిడ్ – 19 కేసులు నిర్ధారించబడ్డాయి. వీటిలో కేరళకు చెందిన ముగ్గురు కోలుకున్నారు.
(Release ID: 1607053)
Visitor Counter : 249