ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చ కు లోక్ సభ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానం

Posted On: 06 FEB 2020 7:55PM by PIB Hyderabad

గౌర‌వ‌నీయులైన స్పీక‌ర్ స‌ర్‌, రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం లో భాగం గా నా యొక్క కృత‌జ్ఞత ను వ్య‌క్తం చేయడానికి నేను ఇక్క‌డ నిల‌బ‌డ్డాను. మాన‌నీయ రాష్ట్ర‌ప‌తి త‌న యొక్క ప్ర‌సంగం లో న్యూ ఇండియాతాలూకు దార్శ‌నిక‌త ను వెల్ల‌డి చేశారు. 21వ శ‌తాబ్దం లో మూడో ద‌శాబ్ది లో మాన‌నీయ రాష్ట్రప‌తి చేసిన‌టువంటి ఈ ప్ర‌క‌ట‌న ఈ ద‌శాబ్దం లో మ‌నకు అంద‌రి కి దిశ‌ ను ఇచ్చేట‌టువంటి, దేశాని కి చెందిన కోట్లాది పౌరుల లో విశ్వాసాన్ని ఏర్ప‌ర‌చి, మ‌రి వారికి ప్రేర‌ణ ను ఇచ్చేటటువంటి ఒక ప్ర‌సంగం. ఈ చ‌ర్చ‌ లో స‌భ లో అనుభ‌వజ్ఞ‌ులు అయినటువంటి గౌర‌వ‌నీయ స‌భ్యులు అంద‌రూ వారి వారి అభిప్రాయాల ను చాలా ప్ర‌భావ‌వంత‌మైన‌ రీతి లో వెలిబుచ్చారు. అలాగే, వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయాల ను కూడా స‌భ లో వ్యక్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రు వారిదైన శైలి లో చ‌ర్చ ను ప‌రిపుష్టం చేయడానికి ప్ర‌య‌త్నించారు. శ్రీ‌మాన్ అధీర్ రంజ‌న్ చౌధరీ గారు, డాక్ట‌ర్ శ‌శి థ‌రూర్ గారు, శ్రీ‌మాన్ ఒవైసీ గారు, రాంప్ర‌తాప్ యాద‌వ్ గారు, ప్రీతి చౌధరీ గారు, మిశ్రా గారు, అఖిలేశ్ యాద‌వ్ జీ, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. నేను గ‌నుక ప్ర‌తి ఒక్క‌ పేరు ను చెప్పాలి అంటే అందుకు కాలాతీతం అవుతుంది. అయినప్పటికి నేను ఏమ‌ని అంటానంటే ప్ర‌తి ఒక్క‌రు వారి ఆలోచ‌న‌ల ను వారిదైన త‌ర‌హా లో స‌భ లో తెలియ‌జేశారు అని. కానీ, ఈ ప‌నుల‌న్నింటి విష‌యం లో ప్ర‌భుత్వం అంత హ‌డావుడి ప‌డుతోంది ఎందుకు? అనేట‌టువంటి ఒక ప్ర‌శ్న ఉదయించింది. అన్ని ప‌నుల‌ ను ఒకేమారు ఎందుకు చేస్తున్న‌ట్లు?

 

నేను ఆరంభం లో శ్రీ‌మాన్ స‌ర్వేశ్వ‌ర్ ద‌యాళ్ గారి యొక్క ఒక క‌విత ను గురించి ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించ‌ద‌ల‌చాను. మ‌రి అది బ‌హుశా మా ప్ర‌భుత్వం యొక్క స్వ‌భావాన్ని, అలాగే, మా సంస్కృతి ని కూడా సూచించ‌వ‌చ్చును. మేము రొడ్డ‌కొట్టుడు పంథా నుండి దూరం గా జ‌రిగి, ఒక వేగ‌వంత‌మైన రీతి లో ముందుకు పోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాం.

 

స‌ర్వేశ్వ‌ర్ ద‌యాళ్ గారు త‌నక‌విత లో...

 

లీక్ ప‌ర్ వే చ‌లేన్ జీన్ కే

చ‌ర‌ణ్ దుర్బల్ ఔర్ హారే హై,

హ‌మే తో జో హమారీ యాత్రా సే బ‌నే

ఐసే అనిర్మిత్ పంథ్ హీ ప్యారే హై .. అని.

 

గౌర‌వ‌నీయులైన అధ్యక్షా,

 

ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు కేవలం ప్ర‌భుత్వాన్ని మార్చారు అనేది కాదు ప్ర‌సక్తి. వారి యొక్క ఆసక్తుల ను కూడా మారాలని కోరుకున్నారనిపిస్తున్నది. ఒక క్రొత్త దార్శ‌నిక‌త తో ప‌ని చేయాల‌న్న అపేక్ష కార‌ణం గా మేము ఇక్క‌డ‌ కు వ‌చ్చేటటువంటి మ‌రియు సేవ చేసేట‌టువంటి ఒక అవ‌కాశాన్ని ద‌క్కించుకొన్నాము. అయితే, మేము కూడా అదే దారిన న‌డ‌చిన ప‌క్షం లో అటువంట‌ప్పుడు మీరు న‌డ‌చేందుకు అల‌వాటు ప‌డిన‌, మీకు అల‌వాటైన మార్గం లో సాగాం అంటే గ‌నక, అప్పుడు బ‌హుశా 70 సంవ‌త్స‌రాలు గ‌డ‌చిపోయిన తరువాత కూడాను 370 అధిక‌ర‌ణాన్ని ఈ దేశం లో ర‌ద్దు చేయ‌డం అనేది జ‌రిగి ఉండేది కాదు. మీరు గ‌నక, అదే దారిలో వెళ్ళిన ప‌క్షం లో అటువంట‌ప్పుడు ముమ్మారు త‌లాక్అనే క‌త్తి, ఇప్పటికీ ముస్లిమ్ సోద‌రీమ‌ణుల‌ ను ఇంకా భ‌య‌పెడుతూనే ఉంటుంది. మేము గ‌నక మీదైన‌ త్రోవ‌ న వెళ్తే, అటువంట‌ప్పుడు ఒక యుక్త వ‌య‌స్కురాలు కాన‌టువంటి బాలిక పైన అత్యాచారం జ‌రిగిన సంద‌ర్భం లో అపరాధుల కు మ‌ర‌ణ‌ శిక్ష ను విధించాల‌న్న నిబంధ‌న చోటు చేసుకొని ఉండేదే కాదు. మేము మీ యొక్క ఆలోచ‌న‌ ల స‌ర‌ళి ని అనుస‌రించిన ప‌క్షం లో, అటువంట‌ప్పుడు రామ జ‌న్మ భూమి ఈ రోజు కు కూడాను వివాదం గానే మిగిలి ఉండేది. మీదైన విధానామే కొన‌సాగి ఉంటే, క‌ర్ తార్‌ కారిడోర్ ఎన్న‌టికీ నిర్మాణం అయి ఉండేది కాదు.

 

మీ యొక్క విధానం, మీ యొక్క ప‌ద్ధ‌తులు మాత్ర‌మే అమ‌లైన ప‌క్షం లో బాంగ్లాదేశ్ స‌రిహ‌ద్దు వివాదాన్ని భార‌త‌దేశం ఏనాటికీ ప‌రిష్క‌రించుకొనేది కాదు.

 

గౌర‌వ‌నీయులైన స్పీక‌ర్‌,

 

నేను గౌర‌వ‌నీయులైన స్పీక‌ర్ ను చూసి, మ‌రియు వారి మాట‌ల ను వింటూ వున్న‌ప్పుడు, అన్నిటి క‌న్నా ముందుగా కిర‌ణ్ రిజిజు గారి ని నేను అభినందిస్తున్నాను. దీనికి కార‌ణం, ఆయ‌న నిర్వ‌హించిన‌టువంటి ఫిట్ ఇండియా మూవ్‌మంట్‌’. ఫిట్ ఇండియా మూవ్‌మంట్ ను ఆయ‌న చాలా ఘనమైనటువంటి రీతి లో ప్రోత్స‌హిస్తున్నారు. ఆయ‌న ఉప‌న్యాసాలు ఇస్తారు; అంతేకాక‌, ఆ ఉప‌న్యాసాల తో పాటు, జిమ్ లో ఆయ‌న క‌స‌ర‌త్తులు చేస్తారు. ఎందుకంటే, ఇది ఫిట్ ఇండియాను బ‌లోపేతం చేస్తుంది. దీని ని వ్యాప్తి లోకి తీసుకు వ‌స్తున్నందుకు గౌర‌వనీయ స‌భ్యుల కు నేను ధ‌న్య‌వాదాలు ప‌లుకుతున్నాను.

 

గౌర‌వనీయులైన స్పీక‌ర్‌,

 

స‌వాళ్ళ ను ఎదుర్కోవ‌డం కోసం దేశం ప్ర‌తిక్ష‌ణం ప్ర‌య‌త్నం చేస్తోంది అన్న మాట‌ల ను ఎవ్వ‌రూ కూడాను త్రోసిపుచ్చజాల‌రు. కొన్ని కొన్ని సంద‌ర్భాల లో స‌వాళ్ళ‌కేసి దృష్టి ని సారించకూడ‌ద‌నే అల‌వాటు ను కూడా ఈ దేశం గ‌మ‌నించింది. స‌వాళ్ళ ను ఎంచుకొనే స‌త్తా లేన‌టువంటి కొంతమంది మ‌నుషుల ను కూడా మ‌న‌ము చూశాము. అయితే, భార‌త‌దేశం నుండి ప్ర‌స్తుతం ప్ర‌పంచం ఆశిస్తోంది ఏమిటి అంటే మ‌నం గ‌నక స‌వాళ్ళను స‌వాలు చేయ‌క‌పోయిన‌ట్ల‌యితే, మ‌నం గనక ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌క‌పోయిన‌ట్ల‌యితే, మ‌రి మ‌నం ప్ర‌తి ఒక్క‌రి ని వెంట క‌లుపుకొని పోయే వేగాన్ని పెంచ‌క‌పోయిన‌ట్ల‌యితే, అటువంట‌ప్పుడు బ‌హుశా దేశం లెక్క‌లేన‌న్ని స‌మ‌స్య‌ల తో దీర్ఘకాలం పాటు పోరాటం చేయ‌వ‌ల‌సివుంటుంది.

 

మ‌రి, దీని త‌రువాత గౌర‌వ‌నీయులైన స్పీక‌ర్, మేము గ‌నుక కాంగ్రెస్ అనుస‌రించిన మార్గాల లో వెళ్ళ‌వ‌ల‌సి వ‌స్తే, అటువంట‌ప్పుడు యాభై సంవ‌త్స‌రాలు అయిన త‌రువాత సైతం శ‌త్రు ఆస్తుల విష‌యం లో చ‌ట్టం చేయ‌డం కోసం దేశం వేచి ఉండ‌వ‌ల‌సి వ‌చ్చేది. 35 సంవ‌త్స‌రాలు అయిన త‌రువాత కూడా, దేశం త‌దుప‌రి త‌రం యుద్ధ విమానం కోసం నిరీక్షించ‌వ‌ల‌సి వ‌చ్చేది. 28 సంవ‌త్సరాలు గ‌డిచాక కూడాను బేనామీ సంప‌త్తి చ‌ట్టం అమ‌లు లోకి వ‌చ్చి ఉండేది కాదు. 20 సంవ‌త్స‌రాల అనంత‌రం కూడాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామ‌కం జ‌రిగి ఉండేది కాదు.

 

గౌర‌వనీయులైన అధ్యక్షా,

 

మా ప్ర‌భుత్వం త్వ‌రిత‌ గ‌తి ని క‌లిగి ఉన్నందువ‌ల్ల‌ను, చ‌క్ర‌పు జాడ నుండి ఆవ‌ల‌ కు తొల‌గి ఒక నూత‌నమైనటువంటి మార్గాన్ని అనుస‌రించాల‌న్నది మా యొక్క ఉద్దేశ్యం గా ఉన్నది. ఈ కార‌ణం గానే మేము స్వాతంత్య్రం స‌మ‌కూరి 70 సంవ‌త్స‌రాలు గ‌డ‌చిన త‌రువాత కూడా దీర్ఘకాలం పాటు ఎదురు చూడ‌టానికి దేశం సిద్ధం గా లేద‌ని, మ‌రి అలా వేచి ఉండ‌కూడ‌ద‌ని బాగా అర్థం చేసుకొన్నాము. అంతేకాకుండా, వేగం తో పాటు ప‌రిమాణం కూడా పెర‌గాల‌న్న‌దే మా యొక్క ప్ర‌య‌త్నం గా ఉంది. నిర్ణ‌యానికి తోడు గా దృఢ దీక్ష కూడా ఉండాలి. సూక్ష్మ‌గ్రాహ్య‌త తో పాటు, ప‌రిష్కారం కూడా ఉండాలి. మేము శ‌ర‌వేగం గా కృషి చేశాము. మ‌రి అంత వేగం గా చేస్తున్న కృషి యొక్క ఫ‌లితం గానే దేశ ప్ర‌జ‌లు అయిదు సంవ‌త్స‌రాల లోను గ‌మ‌నించి, త‌ద‌నంత‌రం అదే వేగంతోను, మ‌రింత శ‌క్తి తోను ప‌య‌నాన్ని కొన‌సాగించ‌డానికి మాకు మళ్లీ నిలబడేందుకు అవ‌కాశాన్ని ఇచ్చారు.

 

ఒకవేళ ఇది ఒక వేగ‌వంత‌మైన క‌ద‌లిక కాక‌పోయివున్నట్ల‌యితే, 37 కోట్ల ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతా లు అంత త‌క్కువ కాలం లో తెర‌వ‌బ‌డేవే కావు. ఈ వేగం త్వ‌రిత‌గతినిఅందుకోక‌పోయి ఉంటే గ‌నుక టాయిలెట్ తాలూకుప‌ని 11 కోట్ల మంది ప్ర‌జ‌ల యొక్క ఇళ్ళ లో పూర్తి అయ్యేదే కాదు. ఈ వేగం పుంజుకోక‌ పోయిన ప‌క్షం లో, 13 కోట్ల కుటుంబాల గృహాల లో గ్యాస్ స్ట‌వ్ లు వెలిగి వుండేవి కావు. ఈ వేగం పుంజుకోక‌పోయి ఉంటే, పేద ప్ర‌జానీకం కోసం 2 కోట్ల నూత‌న గృహాలు నిర్మాణం అయ్యేవే కాదు. ఈ వేగం శ‌ర‌వేగాన్ని సంత‌రించుకోక‌పోయి వుంటే గ‌నక ఢిల్లీ చాలా కాలం పాటు 1700కు పైగా అన‌ధీకృత గృహ స‌ముదాయాలు, 4 మిలియ‌న్ కు పైగా ప్ర‌జ‌ల జీవితాలు- ఏవైతే ఒక ఆధారం లేక అల్లాడిపోతున్నాయో- వాటితోనే స‌రిపెట్టుకోవ‌ల‌సివ‌చ్చేది. ఆ ప‌ని ఇంకా అసంపూర్తిగానే ఉండేది. ఇవాళ వారికి వారి ఇంటి యొక్క హ‌క్కు సైతం లభించింది.

 

గౌర‌వ‌నీయులైన అధ్య‌క్షా,

 

ఈశాన్య ప్రాంతాన్నిగురించి కూడా ఇక్కడ చ‌ర్చించ‌డం జ‌రిగింది. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల లో మార్పును తెచ్చే సామ‌ర్ధ్యాన్ని సంత‌రించుకోవ‌డానికి ఈశాన్య ప్రాంతాలు ఎన్నో ద‌శాబ్దుల పాటు వేచి ఉండ‌వ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అక్క‌డ ఇటువంటి ప‌రిస్థితి లేదు. మ‌రి ఈ కార‌ణం గా ఆ ప్రాంతం రాజ‌కీయ కొల‌బ‌ద్ద‌ల ను బ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకొన్న‌ప్పుడల్లా ప‌క్క‌కు నెట్టివేయ‌బ‌డుతూ వ‌చ్చింది. మా దృష్టి లో ఈశాన్య ప్రాంతం వోటు త‌రాజు ల ద్వారా తూనిక వేసేట‌టువంటి ఒక ప్రాంతం కాదు. భార‌త‌దేశ పౌరుల కు భార‌త‌దేశ ఏక‌త మ‌రియు అఖండ‌త‌ల అండ‌ తో ఒక సుదూర ప్రాంతం లో కూర్చొన్న వారికి మ‌రియు వారి యొక్క స‌త్తా ను భార‌త‌దేశం అభివృద్ధి కోసం స‌రి అయిన విధం గా ఉప‌యోగించుకోవ‌డం, దేశాన్ని ముందుకు తీసుకు పోవ‌డం కోసం కృషి చేస్తున్న‌టువంటి శ‌క్తుల ను త‌గిన ఆద‌ర‌ణ భావం తో వినియోగించుకోవ‌ల‌సి ఉంది. అక్క‌డ నివ‌సిస్తున్న పౌరులంద‌రి మీదా గొప్ప న‌మ్మ‌కం తో ముందంజ వేయాల‌న్న‌ది మా ప్ర‌య‌త్నం గా ఉంటూ వ‌చ్చింది.

 

మ‌రి ఈ కార‌ణం గా గ‌త అయిదు సంవ‌త్స‌రాల కాలంలో ఈశాన్య ప్రాంతం దేనికైతే ఢిల్లీ ఎంతో దూరం గా ఉంది అనిపించేదో, ఈ రోజు న వారి యొక్కగుమ్మం ముందుకు వెళ్ళి ఢిల్లీ నిల‌బ‌డింది. మంత్రి కార్యాల‌యాన్ని క్రమం తప్పకుండా సంద‌ర్శించ‌డాన్ని కొన‌సాగించారు. రెండో అంచె, మూడో అంచె ల‌ చిన్న ప‌ట్ట‌ణాల లో రాత్రి పూట మ‌కాం పెట్టి ప్ర‌జ‌ల తో మ‌మేకం అయ్యి వారి యొక్క విశ్వాసాన్ని సంపాయించారు. మ‌రి మేము 21వ శ‌తాబ్ద‌పు అభివృద్ధి తాలూకు అవ‌స‌రాల‌ను, అది విద్యుత్తు అయినా, రైలు మార్గం అయినా, విమానాశ్ర‌యం అయినా, లేదా మొబైల్ క‌నెక్టివిటీ అయినా కావ‌చ్చు.. నెర‌వేర్చ‌డానికి ప్ర‌య‌త్నం చేశాము. మ‌రి, ఆ విశ్వాసం ఏ ర‌క‌మైన ఫ‌లితాల ను ఇవ్వ‌గ‌లుగుతుందో ఈ ప్ర‌భుత్వం యొక్క ప‌ద‌వీ కాలం లో చూడ‌వ‌చ్చును. బోడోల‌ ను గురించిన చ‌ర్చ ఇక్క‌డ జ‌రిగింది. మ‌రి ఇది మొట్ట‌మొద‌టిసారి గా చోటు చేసుకొంద‌ని ప్ర‌స్తావన కు వ‌చ్చింది. ఇలా మొద‌టి సారి జ‌రిగింద‌ని మేము ఏమీ అన‌లేదు. అనేక ప్ర‌యోగాలు జ‌రిగాయ‌ని, అంతేకాక‌ అటువంటి ప్ర‌యోగాలుఇంకా జ‌రుగుతూనే ఉన్నాయ‌ని మేము అంటున్నాము. కానీ, జ‌రిగింది అంతా జ‌రిగిపోయింది. అది రాజ‌కీయ కొల‌మానాల లో తూకం వేసి చేయ‌డం అయింది. ఏమి చేసిన‌ప్ప‌టికీ కూడా, అర్థ మ‌న‌స్కం గా చేయ‌డ‌మైంది. ఏది జ‌రిగినప్పటికిని అది కేవ‌లం ఒక లాంఛ‌నం. మ‌రి ఈ కార‌ణం గా ఒప్పందాలు కేవ‌లం కాగితం మీద జ‌రిగాయి; ఫోటో అచ్చు అయింది, మ‌రి క‌ర‌తాళ ధ్వ‌నులు ల‌భించాయి. ఆ విష‌యాన్ని కూడా ఈ రోజు న గొప్ప గ‌ర్వం తో మాట్లాడుకోవ‌డం జ‌రుగుతోంది.

 

కానీ, కాగితం మీది ఒప్పందం బోడో యొక్క స‌మ‌స్య‌ల ను అనేక సంవ‌త్స‌రాలైన త‌రువాత కూడా తీర్చ‌నే లేదు. 4 వేల మందికి పైగా అమాయ‌క ప్ర‌జానీకాన్ని మృత్యు కుహరం లోకి నెట్టివేయ‌డ‌ం జరిగింది. సామాజిక జీవ‌నాన్ని అపాయం లో ప‌డ‌వేసేట‌టువంటి అనేక విధాలైన వ్యాధులు తలలు ఎత్తుతూనే ఉన్నాయి. ఈసారి కుదిరిన ఒప్పందం సైతంఈశాన్య ప్రాంతానికి ఒక సందేశం. అలాగే, దేశం లోని సామాన్య మాన‌వుడి కి న్యాయాన్ని అందించేవారికి కూడా ఇది ఒక సందేశం. అంతేగాక‌, మా యొక్క కార్యాలు ప‌దేప‌దే ప్ర‌చారానికి నోచుకోవు. ఎల్ల‌ెడలావ్యాప్తి లోకి రావు. కానీ, మేము క‌ష్టించి ప‌నిచేస్తాము, మా వంతు ప్ర‌య‌త్నాలను కొన‌సాగిస్తుంటాము.

 

అయితే, ఈ ప‌ర్యాయం జ‌రిగిన ఒప్పందం ఒక విశేషాన్ని క‌లిగివుంది. సాయుధ స‌మూహాలు అన్నీ కూడాను ఒక తాటి మీద‌కు వ‌చ్చాయి. అన్ని అస్త్రాలు మ‌రియు అజ్ఞాతం లోకి వెళ్ళిన‌ వారు అంద‌రు లొంగిపోయారు. మ‌రి శాంతి ఒడంబ‌డిక లోని రెండో భాగం ఏమ‌ని చెబుతోంది అంటే ఇక దీని త‌రువాత బోడో సమ‌స్య కు సంబంధించిన‌ అటువంటి ఏ ఒక్క డిమాండు ఉండ‌దు అని. ఈశాన్య ప్రాంతం లో తొలిసారి గా ఉద‌యించిన ర‌వి గా మేము ఉన్నాము. అయితే ఉషోద‌యం మాత్రం రానే లేదు. సూర్యుడు వ‌స్తున్నా, చీక‌ట్లు చెల్లాచెదురు అవ‌లేదు. ఈ రోజు న నేను ఏమని అంటాను అంటే ఇవాళ ఒక క్రొత్త ఉద‌యం సైతం వ‌చ్చింది. ఒక న‌వీన‌మైన ప్రభాతం కూడా విచ్చేసింది. ఒక న‌వ జ్యోతి సైతం చేరుకొంది. మ‌రి ఆ కాంతి మీరు మీ యొక్క కంటి అద్దాల ను మార్చుకొన్న‌ప్పుడు మీకు క‌న‌బ‌డుతుంది.

 

నా సంభాష‌ణ ను మ‌ధ్య లో కాసేపు విర‌మించేందుకు నాకు వీలు క‌ల్పించినందుకుగాను మీకు నేను ధ‌న్య‌వాదాలను పలుకుతున్నాను.

 

నిన్న‌టి రోజు న స్వామి వివేకానందుల వారి యొక్క భుజ‌ం మీది నుండి తుపాకి కాల్పులను జ‌ర‌ప‌డ‌మైంది. అయితే, నాకు ఒక చిన్న పాత‌న క‌థ‌ గుర్తు కు వస్తున్నది. ఒక‌సారి కొంత మంది ఒక రైలు లో ప్ర‌యాణం చేస్తూ వున్నారు. మ‌రి మ‌నం రైలు లో ప్ర‌యాణించేట‌ప్పుడు ఆ రైలు వేగాన్ని అందుకొన్న‌ప్పుడు, ప‌ట్టాల మీద నుండి శ‌బ్దం వ‌స్తుంద‌నేది ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిన విష‌య‌మే. అక్క‌డ కూర్చొని ఉన్న ఒక సాధు పుంగ‌వుడు చూడండి.. ప‌ట్టాల మీద నుండి ఎటువంటి శ‌బ్దం వ‌స్తోందో.. అది ప్రాణం లేన‌టువంటి ప‌ట్టాలు మ‌న‌కు - ప్ర‌భు క‌ర్ దే బేడా పార్ (ఓ దైవ‌మా, మేము మా యొక్క గ‌మ్య‌స్థానాన్ని చేరుకోవ‌డం లో మాకు స‌హాయం చేయండి).. అని మ‌నతో చెప్తున్న‌ట్లుగా లేదూ.. అని అన్నారు. అయితే, మ‌రొక్క స‌ంన్యాసి అన్నారు కదా - కాదు, ప్ర‌భు తేరీ లీలా అప‌ర‌ం పార్ .. (ఈ మాటల కు- ఓ ప్ర‌భూ మీ యొక్క సృష్టి ప‌రిపూర్ణ‌మైన‌దిగా ఉంది- అని భావం) అని అన్న‌ట్లు గా నాకు విన‌ప‌డుతోంది అని. అక్క‌డ ఒక మౌల్వీ కూడా కూర్చొని ఉన్నారు. ఆయ‌న నాకు మ‌రేదో వినపడుతోంది అని అన్నారు. మీరు ఏమి ఆల‌కించారు చెప్పండి అంటూ సాధువులు ఆయ‌న ను అడిగారు. దానికి ఆయ‌న- నేను యా అల్లాహ్ తేరి ర‌హ‌మ‌త్‌.. అనే మాట‌ల‌ ను విన్న‌ానంటూ బ‌దులిచ్చారు. ఈ మాట‌ల‌ కు ఓ దైవ‌మా ఇదంతా నీ యొక్క దయ అని భావం. అక్క‌డ ఒక మ‌ల్లయోధుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ పహల్ వాన్ అన్నాడు క‌దా, తాను- ఖా రబ్ డీ క‌ర్ క‌స‌ర‌త్ .. అని. (దీని అర్థం ర‌బ్ డీ ని తిని క‌స‌ర‌త్తు చేయి అని).

 

నిన్న‌టి రోజున వివేకానందుల వారి పేరిట చెప్ప‌బ‌డిన సంగ‌తి ఏమిటంటే, మ‌స్తిష్కం లో ఏదైతే ఉందో అది నోటి వెంబ‌డి వ‌చ్చే మాట‌ల లో ప్ర‌తిబింబిస్తుంది.. మీరు దానిని చూడాలంటే అంత దూరం వెళ్ళ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. అది చాలా ద‌గ్గ‌ర‌లోనే ఉంది.

 

 

గౌరవనీయులైన అధ్యక్షా,

 రైతుల గురించి నేను చర్చల్లో పాల్గొన్నాను. అనేక ముఖ్యమైన పనులు... అనేక కొత్త మార్గాల్లో, సరికొత్త ఆలోచన విధానంతో గతంలోనూ పూర్తిచేయబడ్డాయి. గౌరవనీయులైన రాష్ట్రపతి కూడా వీటిని తన ప్రసంగంలో ప్రస్తావించారు. కానీ, ఇక్కడ వాటిగురించి చర్చించడానికి ఒక ప్రయత్నం జరిగింది... అది తెలియక జరిగిందో, ఉద్దేశపూర్వకంగా జరిగిందో నాకైతే తెలియదు. ఎందుకంటే... కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయి- మనకు తెలిసి ఉంటే బహుశా అలా చేయలేమేమో! పంటలకు కనీస మద్దతు ధర ఒకటిన్నర రెట్లుగా ఉండాలన్నది ప్రత్యేకమైన అంశమని మనందరికీ తెలుసు. అలాగే దానిపై నిర్ణయంలో సుదీర్ఘ ప్రతిష్టంభన గురించి కూడా తెలుసు. అది మా ప్రభుత్వ హయాం కాదు... మునుపటి ప్రభుత్వ కాలంనాటిది. అయినప్పటికీ దీన్ని రైతులపట్ల మా బాధ్యతగా స్వీకరించి మేం నెరవేర్చాం. నీటిపారుదల పథకాల పనులు 80-90 శాతం పూర్తయ్యాక కూడా ఇరవయ్యేసి సంవత్సరాలుగా అదే దశలో ఆగిపోయి ఉన్నట్లు తెలిసి నేను ఆశ్చర్యపోయాను. దీన్ని గురించి ప్రశ్నించే వారెవరూ లేరు. ఒక ఫోటో పంపి, అయిపోయిందనిపించారు. ఇలాంటి 99 అసంపూర్తి పథకాల బాధ్యతను మేం స్వీకరించి, దాదాపు లక్ష కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేయడంద్వారా వాటిని తార్కికంగా పూర్తిచేశాం. ఈ పథకాలద్వారా నేడు రైతులు ప్రయోజనం పొందడం మొదలైంది.

   క ప్రధానమంత్రి పంటల బీమా పథకం... దీన్ని దేశంలోని రైతులంతా నిరంతరం విశ్వసిస్తున్నారు. ఈ పథకం కింద సుమారు 13 వేల కోట్ల రూపాయల మేర రైతులు పంట బీమా రుసుము కింద చెల్లించారు. అయితే, ప్రకృతి విపత్తులు సంభవించిన నేపథ్యంలో ఈ బీమా పథకం కింద రమారమి 56 వేల కోట్ల రూపాయలదాకా రైతులు పరిహారం పొందారు. అలాగే రైతుల ఆదాయం పెరిగింది... ఇవన్నీ మా ప్రాథమ్యాలు. అలాగే సాగు వ్యయం తగ్గించాలన్నది కూడా మా ప్రాధాన్యాల్లో మరొకటి. ఇక కనీస మద్దతు ధర పేరిట లోగడ జరిగిందేమిటి? దేశంలో పప్పు దినుసులు, నూనెగింజల కొనుగోలు 7 లక్షల టన్నులు కాగా, ఇప్పుడది 100 లక్షల టన్నులకు పెరిగింది. ఈ-నామ్‌ పథకం ఇప్పుడు మన డిజిటల్‌ ప్రపంచంలో ఒకటైంది. ప్రపంచ స్థాయిలో ధరలు ఎలా ఉన్నాయో మన రైతులు ఇప్పుడు తమ మొబైల్‌ ఫోన్లద్వారా తెలుసుకుని అర్థం చేసుకుంటున్నారు. ఆ మేరకు ఈ-నామ్‌ పథకం ద్వారా తమ మార్కెట్లో వారు పంట ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ వ్యవస్థలో 1.75 కోట్ల మంది రైతులు భాగస్వాములు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అదేవిధంగా ఈ-నామ్‌ పథకం కింద రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడంద్వారా లక్ష కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేశారు. అంతేకాదు... కిసాన్‌ క్రెడిట్‌ కార్డుకూ మేం ప్రాచుర్యం తెచ్చాం. పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించాం. అలాగే సౌరశక్తి దిశగా సాగేందుకు కృషి చేయాల్సి ఉంది. కాబట్టి సౌర పంపుల గురించి మాట్లాడుకుందాం... ఈ విధంగా అనేక కొత్త అంశాలు వ్యవస్థలో భాగమవుతూ వస్తున్నాయి. కాబట్టే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల్లో నేడు పెను మార్పులు కనిపిస్తున్నాయి.

   మేము 2014లో అధికారానికి వచ్చేముందు వ్యవసాయ శాఖ బడ్జెట్‌ 27వేల కోట్ల రూపాయలుకాగా- ఇప్పుడు దాన్ని మేము 5 రెట్లకుపైగా పెంచి, దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాం. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం కింద లబ్ధి నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరుతోంది. ఆ మేరకు ఇప్పటిదాకా 45వేల కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి. దీనివల్ల దళారులతోపాటు ఫైళ్ల జంఝాటం కూడా మాయమైంది... ఒక్క క్లిక్‌తో డబ్బు ఖాతాలోకి వెళ్లిపోతోంది. అయితే, మనం రాజకీయాలు కూడా చేయాల్సి ఉందని నేనిప్పుడు ప్రజా ప్రతినిధులందరికీ కచ్చితంగా సూచిస్తున్నాను. మీకున్న ఇబ్బందులేమిటో నాకు తెలుసు... కానీ, మనం రైతుల ప్రయోజనాలతో రాజకీయం నెరపుదామా? ఆ మేరకు రైతుల పేరిట తమతమ రాష్ట్రాల్లో గొంతెత్తే వారెవరో గమనించాల్సిందిగా గౌరవనీయ సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నాను. అదే సమయంలో వారి రాష్ట్రంలోని రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ప్రయోజనం అందుతున్నదో.. లేదో కూడా వారు చూడాలి.

   మేరకు ఆయా ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని రైతుల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? ఈ పథకంలో సదరు రాష్ట్రాలు ఎందుకు చేరడం లేదు? దీనివల్ల హాని ఎవరికి... నష్టపోతున్నదెవరు? ఆయా రాష్ట్రాల రైతులు మాత్రమే. కొన్నిచోట్ల సంభవిస్తున్న ఇలాంటి పరిణామాల గురించి తెలిసీ, బాహాటంగా మాట్లాడలేని స్థితిలోగల గౌరవనీయులైన సభ్యులెవరైనా ఉంటే- తెలుసుకోగోరుతున్నాను. అదేవిధంగా ఎంతో మాట్లాడిన సదరు గౌరవనీయ సభ్యులతోనూ నేను మాట్లాడతానని వారికి తెలుసు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్భాటంగా గొప్ప వాగ్దానాలు చేసి, ఓట్లు దండుకుని, అధికారంలోకి వచ్చినా రైతులకు తామిచ్చిన హామీలను నెరవేర్చని రాష్ట్రాలను ఒకసారి చూడండి. రైతుల ఓట్లతో పదవీ ప్రమాణ స్వీకారం చేసి, అధికార పగ్గాలు చేపట్టినా వారికిచ్చిన వాగ్దానాలను మాత్రం నెరవేర్చిన ఉదాహరణల్లేవు. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని అలాంటి రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఇక్కడ కూర్చుని ఉన్న గౌరవనీయ సభ్యులు అక్కడి ప్రభుత్వాలకు కనీసం ఒక మాటగానైనా చెప్పాలని కోరుతున్నాను.

గౌరవనీయులైన అధ్యక్షా!

   ఖిలపక్ష సమావేశం జరిగినప్పుడల్లా- నేను ఈ మేరకు నా దృక్పథాన్ని సమగ్రంగా వివరిస్తూ విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను. అటుపైన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మీడియా ప్రతినిధులతో నేను మాట్లాడినప్పుడు కూడా మనమంతా దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలపై చర్చకు మన పూర్తి సమయాన్ని కేటాయించాలని నేను చెప్పాను. అవగాహన, సామర్థ్యం, ప్రతిభల సమ్మేళనాన్ని మేం ఉభయసభల ముందుంచాం.  ఎందుకంటే- జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులద్వారా ప్రయోజనం పొందే దిశగా మన దేశం అనుసరించాల్సిన దశ-దిశలను సూచించడం కోసమే. ఈ సమావేశం కొనసాగినంత సేపు... విరామానంతరం తిరిగి సమావేశమయ్యాక కూడా అందుబాటులోగల అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందడుగు వేసే సరికొత్త సూచనలతో మనమంతా సమగ్రంగా చర్చిద్దామని సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ మేరకు మీకిదే నా ఆహ్వానం!

అవును! ముఖ్యమైన ఆర్థిక అంశాల పై ఉమ్మడి బాధ్యత ఉంటుందని నేను అంగీకరిస్తాను. ఈ రోజు న ఏ పరిస్థితి లో ఉన్నామో తెలుసుకోవాలంటే గతం ఏమిటన్నది కూడా మనకు తెలియాలి. గతం లో మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఇది వాస్తవం. అయితే మన గౌరవనీయులైన సభ్యులు అది ఎందుకు జరగలేదని, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందో అని అంటున్నారు. కొంతమంది మీరు విమర్శిస్తారని భావిస్తారు, కానీ మీ విమర్శ ను నేను అంగీకరించను. మీరు నన్ను అర్థం చేసుకొన్నందుకు సంతోషం. ఏదైనా జరగాలి అంటే.. అతను చేస్తారు.. అన్న నమ్మకం మీకు ఉంది. అందుకే నేను దాని ని విమర్శ గా పరిగణించను. నేను మార్గదర్శకాన్ని, స్ఫూర్తి ని నమ్మేవాడి ని. ఈ సలహాలు అన్నిటి ని ఆహ్వానిస్తున్నాను. వాటి ని అంగీకరించడానికి ప్రయత్నిస్తాను. మంచి అంశాలు ఉంటే అవి ఎందుకు జరుగలేదు?, ఒకవేళ జరిగి వుంటే, అవి ఎలా జరిగాయి? అని ఆలోచిస్తాను. ఈ దేశాన్ని గురించి మనం అందరం ఆలోచించాలి.

గతాన్ని వదలిపెట్టి వర్తమానాన్ని అవగాహన చేసుకోవడం కష్టం. గతం ఏమిటి అన్నది మనకు అందరి కి తెలుసును. పత్రిక ల పతాక శీర్షికల లో 'అవినీతి' ప్రముఖ స్థానాన్ని ఆక్రమించేది. సభ లో కూడా అవినీతి పై ఆగ్రహపూరితమైన వాదోపవాదాలు జరిగేవి. వృత్తి నైపుణ్యం లేని అసమర్థ బ్యాంకింగు ను ఎవరు మరచిపోగలరు ? బలహీనమైన మౌలిక విధానాన్ని ఎవరు మరచిపోగలరు ? మేము యోజనాబద్ధమైన చర్యల ను తీసుకోవడం, సరైన దిశ లో వెళ్లడం ద్వారా సమస్యల కు తగు పరిష్కారాల ను సాధించగలిగాము. దీనికి దీర్ఘకాలిక లక్ష్యాల ను పెట్టుకొన్నాము. ఈ చర్యల ఫలితం వల్లే నేడు ద్రవ్య లోటు ను, ద్రవ్యోల్బణాన్ని అదుపు లో ఉంచగలిగామని, సూక్ష్మ ఆర్ధిక సుస్థిరత ను సాధించగలిగామని నేను నమ్ముతున్నాను.

మీరు నా యందు మీ యొక్క విశ్వాసాన్ని దృఢపరచినందుకు నేను మీ పట్ల కృతజ్ఞుడి నై ఉన్నాను. మేము చేసి చూపెడతాము. కానీ, ఆఁ.. మేము ఒక విషయాన్ని మాత్రం చేయబోము.. మరి దానిని జరుగనివ్వము. అది ఏమిటి అంటే మేము మీ యొక్క నిరుద్యోగాన్ని అంతం చేయము.

జిఎస్ టి పై ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకొన్నాము. ఆర్థిక పరిస్థితి ని పటిష్టంగా ఉంచడానికి దీర్ఘకాల చర్యలన్నిటి ని మా ప్రభుత్వం తీసుకొంటున్నది. వాటిలో కార్పొరేట్ పన్ను తగ్గింపు, దివాలా కు సంబంధించిన చట్టం ఐబిసి ని ప్రవేశపెట్టడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళీకరణ, బ్యాంకుల కు నిధుల తో ఉద్దీపనానికి సంబంధించి బ్యాంకుల రీకేపిటలైజేశన్ ల వంటి చర్య లు దీనిలో భాగమే. ఈ చర్య ల వల్ల అనేక లాభాలు కనిపిస్తున్నాయి. మీ ప్రభుత్వం ఉన్నపుడు నిపుణులు, ఆర్థికవేత్తలు సవివరం గా చర్చించిన సంస్కరణల ను మీరు అమలు చేయలేదు. మేము వాటిని అమలుపరుస్తున్నాము. మదుపరుల లో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆర్ధిక రంగాన్ని పరిపుష్టం చేయడానికి అనేక ముఖ్య నిర్ణయాలను తీసుకొన్నాము.

జిఎస్ టి ఆదాయం 2019వ సంవత్సరం జనవరి నుండి 2020వ సంవత్సరం జనవరి మధ్య ఒక లక్షన్నర కోట్ల రూపాయలు దాదాపు ఆరు రెట్లు రికార్డు అయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) చూస్తే 2018వ సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబర్ ల మధ్య కాలం లో 22 బిలియన్ డాలర్లు గా నమోదు అయింది. నేడు అదే కాలపరిధి లో ఎఫ్ డిఐ 26 బిలియన్ డాలర్లు మించింది. దేశ ఆర్థిక పరిస్థితి పట్ల విదేశీ పెట్టుబడిదారుల కు ఉన్న నమ్మకాని కి ఇది ఒక రుజువు. ఆర్థిక రంగం లో అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ఇదీ విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం. అందువల్ల వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వదంతుల ను ప్రచారం లోకి తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావడం పెద్ద విజయం.

మరింత పెద్ద మొత్తం లో పెట్టుబడులు రాబట్టాలి. ఉత్తమమైన మౌలిక అభివృద్ధి జరగాలి. అదనపు విలువ జతపడాలి. గరిష్ఠ స్థాయి లో ఉద్యోగ కల్పన జరగాలి అన్నదే మా యొక్క దార్శనికత గా ఉన్నది.

రైతుల నుండి నేను చాలా నేర్చుకొన్నాను. దుక్కు దున్నిన తరువాత రైతు మండుటెండల లో మళ్ళీ చేనులోకి అడుగుపెడతాడు. అప్పటి వరకు విత్తనాలు వేయడు. సరైన సమయం లో విత్తు నాటుతాడు. ఇపుడు గత పది నిమిషాల నుండి ఇక్కడ జరుగుతుంది చుస్తే.. నేను పంట కోసం దుక్కు ను దున్నుతున్నాను. మీరు ఇప్పుడు సిద్ధం గా ఉన్నారు. నేను ఇక ఒక్కటొక్కటి గా విత్తనాన్ని నాటుతాను.

గౌరవనీయులైన అధ్యక్షా,

ముద్ర, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా ల వంటి పథకాలు స్వతంత్రోపాధి కి ఎంతో దోహదపడ్డాయి. అంతే కాదు, ముద్ర పథకాన్ని వినియోగించుకొని కోట్ల మంది మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. దీనితో పాటు కనీసం మరో ఇద్దరి కో, ముగ్గురి కో ఉపాధి ని కూడా కల్పిస్తున్నారు. ముద్ర పథకం కింది వివిధ బ్యాంకుల నుండి ఆర్ధిక సహాయాన్ని పొందిన వారిలో 70 శాతం మంది మన తల్లులు, సోదరీమణులే ఉన్నారు. ఆర్థికం గా పెద్దగా చురుకు గా లేని వారు కూడా దేశ ఆర్ధిక అభివృద్ధి లో భాగస్తులు అవుతున్నారు. 28,000 స్టార్ట్-అప్ లు గుర్తింపు ను పొందాయి, అవి కూడా 2వ అంచె, 3వ అంచె నగరాల్లోనే ఏర్పాటయ్యాయి. దీనిని బట్టి యువత కొత్త సంకల్పం తో ముందుకు దూసుకుపోతున్నట్లు స్పష్టం అవుతుంది. 22 కోట్ల రుణాలు ఆమోదించబడ్డాయి. కోట్ల మంది కి ఉపాధి అవకాశాలు లభించాయి.

నవ పారిశ్రామికవేత్త ల జాబితా లో భారతదేశం మూడో స్థానాన్ని ఆక్రమించింది. 2017వ సంవత్సరం సెప్టెంబర్ - 2019వ సంవత్సరం నవంబర్ ల మధ్య కొత్త గా 1.49 కోట్ల మంది ఖాతాదారులు ఇపిఎఫ్ ఒ నికర జాబితా లో నమోదయ్యారు. ఎటువంటి ఉద్యోగం లేకుండా డబ్బు ను జమ చేయరు కదా.

నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడి ప్రసంగాన్ని విన్నాను.. మోదీ ని ప్రజలు ఆరు నెలల్లో కర్రలతో కొడతారట.. అవును ఇప్పుడు కష్టమే, కాబట్టి వారికి మరో 6 నెలలు కావాలి. ఆరు నెలలు మంచిదే. నేను నిర్ణయించుకొన్నాను, వచ్చే ఆరు నెలల్లో నేను సూర్య నమస్కారం చేసే సమయాన్ని పెంచుకుందాం అనుకుంటున్నాను. ఇటువంటి తిట్లు 20 సంవత్సరాలు గా చూస్తున్నాను. చూసి చూసి నేను నిందల కు అలవాటు పడిపోయాను. సూర్య నమస్కారాలు నిత్యం చేయడం ద్వారా నేను నా వెన్ను ను మరింత దృఢం గా చేసుకొన్నాను. దీని వల్ల నన్ను కర్రల తో కొట్టినా తట్టుకొనేటట్టు చేసుకొన్నాను. ధన్యవాదాలు, ఆయన ముందుగానే ఈ విషయం చెప్పాడు.. వచ్చే ఆరు నెలలు నా శారీరక కసరత్తు ను పెంచుకోడానికి తగిన సమయం లభించింది.

గౌరవనీయులైన అధ్యక్షా,

ఇండస్ట్రీ 4.0 మరియు డిజిటల్ ఇకోనమి కోట్లాది ఉద్యోగాల కల్పన కు ఉపకరించే అవకాశం ఉంది. నైపుణ్య అభివృద్ధి కి సభ లో ప్రతిపాదన చేశాము. దీని ద్వారా నిపుణులైన ఉద్యోగుల ను తయారు చేయడమే కాకుండా కార్మిక సంస్కరణ లు కూడా జరుగుతాయి. ఇంకా కొన్ని ఇతర ప్రతిపాదన లు కూడా ఉన్నాయి. ఈ సభ వాటి ని పరిగణన లోకి తీసుకొని ఆమోదిస్తే దేశం లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి ఉన్న అడ్డంకుల ను అధిగమించవచ్చును. గౌరవనీయులైనటువంటి సభ్యులందరి ని కోరుతున్నాను.. కార్మిక సంస్కరణల కు సభ్యులంతా సహకరిస్తే ఉద్యోగ కల్పన కు కొత్త అవకాశాలు లభిస్తాయి. సులభతర వ్యాపారం, సులభతర జీవనం ద్వారా 5 ట్రిలియన్ విలువైన ఆర్ధిక వ్యవస్థ ను భారతదేశం లో ఆవిష్కరించగలమనే విశ్వాసం నాకుంది.

గౌరవనీయులైన అధ్యక్షా,

ఇది వాస్తవం... రాబోయే రోజుల్లో 16 కోట్ల మౌలిక రంగ కార్యక్రమాల మిశన్ సాకారం కాబోతోంది. గత నా పదవీ కాలం లో ఆర్ధిక రంగానికి మౌలిక రంగం ఎంత పరిపుష్టి ని కలిగించిందో మీరు గమనించి ఉంటారు. మౌలిక రంగం పై ప్రత్యేక దృష్టి పెడితే ఆర్ధిక రంగాని కి ఊతం ఇవ్వడమే కాకుండా, ఉద్యోగ కల్పన కూడా జోరు అందుకొంటుంది. కొత్త పరిశ్రమ లు నెలకొల్పబడతాయి. అందువల్ల మౌలిక రంగాన్ని ఇంకా ముందుకు తీసుకు పోవాలని నిర్ణయించాం. మౌలిక రంగం అంటే గతం లో కోన్ క్రీట్ సిమెంట్ వరకే పరిమితం అయ్యేది. టెండర్ లు, దళారుల మాటలే వినబడేవి. మౌలిక రంగాన్ని గురించి మాట్లాడితే ప్రజలు దీనిలో ఏదో వ్యవహారం ఉంది అని గుసగుసలాడుకొనే పరిస్థితి ఉండేది.

కానీ నేడు మౌలిక రంగం అంటే.. 21 వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించగలుగుతున్నాము. మౌలిక రంగం అంటే కేవలం కోన్ క్రీట్ సిమెంట్ కాదు, కొత్త భవిష్యత్తు కు ఒక మార్గం అని నేను దృఢం గా విశ్వసిస్తున్నాను. మౌలిక రంగమే కర్ గిల్ నుండి కన్యాకుమారి ని, కచ్ఛ్ నుండి కోహిమా ను కలిపే శక్తి ని కలిగివుంది. ఆకాంక్ష ను విజయాన్ని మౌలిక రంగం ఏకీకృతం చేస్తుంది.

ప్రజల ఆశల కు, కలల కు రెక్కల ను తొడిగేది ఏమైనా ఉందీ అంటే అది మౌలిక రంగమే. సృజనాత్మకత వినియోగదారుల తో అనుసంధానం అవుతుందీ అంటే అది మౌలిక రంగం వల్ల మాత్రమే. చిన్నారి పాఠశాల తో సంధానం కావడం చిన్న విషయమే అయినప్పటికి, అది మౌలిక రంగం వల్లే సాధ్యం అవుతుంది. వ్యాపారవేత్త ను వినియోగదారు తో అనుసంధానం చేసేది మౌలిక రంగమే. అది ప్రజలందరి ని అనుసంధానిస్తుంది. గర్భిణి ని ఆస్పత్రి తో అనుసంధానించేది మౌలిక రంగమే. అందువల్లే సాగునీటి రంగం నుండి పరిశ్రమల వరకు, సామాజిక మౌలిక రంగం నుండి గ్రామీణ మౌలికం వరకు, రహదారుల నుండి ఓడ రేవుల వరకు, విమానయానం నుండి జల మార్గం వరకు మేము అనేక చర్యల ను చేపట్టాము. గత ఐదు సంవత్సరాల ల్లో వీటన్నిటి ని దేశం ముందు సాక్షాత్కరింపజేశాము. ప్రజలు దీనిని గుర్తించారు కాబట్టే మమ్మల్ని ఈ స్థానం లో కూర్చోబెట్టారు. ఇదీ మౌలికరంగానికి ఉన్న బలం.

గౌరవనీయులైన అధ్యక్షా,

మౌలిక రంగం లో పరిణామాలు ఎలా చోటు చేసుకొన్నాయో ఉదాహారణలతో సహా వివరిస్తాను. ఢిల్లీ ద్వారా వెళ్లే వేలాది ట్రక్కులు ఒకానొకప్పుడు తీవ్ర ట్రాఫిక్ సమస్య కు, వాతావరణ కాలుష్యాని కి కారణమయ్యేవి. 2009వ సంవత్సరం లో యుపిఎ ప్రభుత్వం ఢిల్లీ పొలిమేర ల నుండి ఎక్స్ ప్రెస్ హైవే ను నిర్మించాలని ప్రతిపాదించింది. 2014వ సంవత్సరం లో మేము అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ ప్రతిపాదన కేవలం కాగితాలకే పరిమితం అయి ఉంది. వెంటనే మేము చొరవ తీసుకొని ఒక ఉద్యమం తరహా లో పనులను మొదలుపెట్టాము. ఇప్పుడు ఎక్స్ ప్రెస్ వే పూర్తి అయింది. 40,000కి పైగా ట్రక్కు లు ఢిల్లీ లోకి రాకుండానే బయట నుండి వెళ్తున్నాయి. ఈ ప్రయత్నం తో ఢిల్లీ ని కాలుష్యం బారి నుండి కాపాడగలిగాము. కాబట్టి మౌలిక అభివృద్ధి ఆవశ్యకత ఏమిటి ? 2009వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం మధ్య కాలం లో కేవలం ఒక కాగితం ముక్క కు పరిమితం అయింది. ఇదీ వ్యత్యాసం. ఇది అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది.

గౌరవనీయులైన అధ్యక్షా,

కొన్ని అంశాల లో నేను స్పష్టత ను ఇవ్వదలుచుకొన్నాను. థరూర్ గారు, క్షమించాలి. రాజ్యాంగ పరిరక్షణ ను గురించి ఇక్కడ కొందరు మాట్లాడారు. నేను కూడా నమ్ముతున్నాను, కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ కోసం 100 సార్లు మాట్లాడాలి. ఇది ఒక మంత్రం లా వంద సార్లు రాజ్యాంగాన్ని కాపాడాలి అంటూ మాట్లాడాలి. దీని ద్వారా రాజ్యాంగం వల్ల ఏమి జరుగుతుందో అందరి కి అర్థం అవుతుంది. ఈ విషయం మీకు బోధపడి ఉంటుంది. ఎప్పుడు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడినా మీ తప్పు లు ఏమిటో తెలుసుకోవచ్చు. అలాగే రాజ్యాంగం యొక్క శక్తి ఏమిటో కూడా అర్థం అవుతుంది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

ఈ విషయాన్ని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం. ఎమర్జెన్సీ రోజుల్లో రాజ్యాంగ పరిరక్షణ ను ఎందుకు పరిగణన లోకి తీసుకోలేదు ?. వీళ్లా రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేది. న్యాయ వ్యవస్థ కు ఉన్న హక్కుల ను కాలరాసిన వీళ్లా రాజ్యాంగాన్ని గురించి చెప్పేది.

జీవించే హక్కు ను కాలరాసిన ఈ మనుషులు రాజ్యాంగాన్ని చదవాలి. అత్యధికం గా సవరణ ల ప్రతిపాదన లు తెచ్చి తూట్లు పొడిచిన వీరికి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదు. డజను కు పైగా సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాల ను కూల్చివేశారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాల ను రద్దు చేశారు.

మంత్రిమండలి తీర్మానించింది. ప్రజాస్వామ్యబద్ధ, రాజ్యాంగబద్ధ మంత్రిమండలి చేసిన తీర్మానాల కాగితాల ను ప్రెస్ కాన్ఫరెన్స్ లో చింపివేసిన ఘటన ను చూశాము. రాజ్యాంగ పరిరక్షణ మంత్ర జపం చేసే వారి చర్య లు ఇవి. ప్రధాన మంత్రి కి, ప్రధాన మంత్రి కార్యాలయాని కి అతీతం గా జాతీయ సలహా మండలి అనే ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ తో నడిపిన వీరు ముందు గా రాజ్యాంగాన్ని గురించి అర్థం చేసుకోవాలి.

గౌరవనీయులైన అధ్యక్షా,

రాజ్యాంగ పరిరక్షణ పేరు తో ఢిల్లీ లో ఏమి జరుగుతోందో దేశమంతా చూస్తోంది. అర్థం చేసుకొంది. నిశ్శబ్దం ఏమిటో ఏదో ఒక రోజు వెల్లడి అవుతుంది.

రాజ్యాంగం లో సర్వోన్నత న్యాయస్థానం ఒక ముఖ్యమైన అంగం. అటువంటి సుప్రీం కోర్టే నిరసన ప్రదర్శన లు ప్రజల కు ఇబ్బందులు గా మారకూడదు, ఉద్యమాలు హింసాత్మకం గా మారకూడదు అని స్పష్టం చేసింది. అలాంటిది రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న వ్యక్తులు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు వోట్ బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల ను రెచ్చగొడుతున్నారు.

గౌరవనీయులైన అధ్యక్షా,

ఒక కవి అంటాడు..

‘‘ఖూబ్ పర్దా హై, కి చిల్ మన్ సే లగే బైఠే హై.
ఖూబ్ పర్దా హై, కి చిల్ మన్ సే లగే బైఠే హై.
సాఫ్ ఛుప్ తే భీ నహీ, సామ్నే ఆతే భీ నహీ". . అని.

ప్రజలు అన్నీ ఎరుగుదురు, ప్రతిదీ అర్థం చేసుకోగలరు.

గౌరవనీయులైన అధ్యక్షా,

గత కాలం లో సభ లో కొందరు సభ్యులు మాట్లాడిన భాష ఆక్షేపణీయం గా ఉంది. ఇక్కడ కూర్చున్న కొందరు సభ్యులు పశ్చిమ బెంగాల్ లో ఎన్నో బాధల ను అనుభవించారు. దాదా, అక్కడ ఏమి జరుగుతుందో వారు చెబితే ఎంత బాధ పడుతున్నారో మీకు అర్థం అవుతుంది. అక్కడ అమాయకులు ఎలా హత్యల కు గురవుతున్నారో వారు ఎంతో బాగా ఎరుగుదురు.

గౌరవనీయులైన అధ్యక్షా,

వారి ని అడగదలుచుకున్నాను కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగం పరిస్థితి ఏమిటి, ప్రజల హక్కుల స్థితి ఏమిటి ? రాజ్యాంగం అంత ముఖ్యమని వారు భావిస్తే, మనందరం ఒప్పుకొంటాం, మీరు అంగీకరిస్తే జమ్ము & కశ్మీర్ లో భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేయడాన్ని ఎవరు అడ్డుకొన్నారు ? జమ్ము & కశ్మీర్ కు చెందిన నా సోదర సోదరీమణుల హక్కుల ను కాలరాసిన పాపం ఎవరిది ? శశి గారు, మీరు జమ్ము & కశ్మీర్ అల్లుడు కదా, మీరు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్నారే, ఆ కశ్మీర్ ఆడబిడ్డ ను గురించి కూడా ఆలోచించాలి కదా. గౌరవనీయులైన అధ్యక్షా, ఒక సభ్యుడు మాట్లాడుతారు కశ్మీర్ అస్తిత్వం కోల్పోయిందని, మరో సభ్యుడు మాట్లాడుతారు కశ్మీర్ కేవలం ఒక చిన్న పాటి భూభాగం అని.

గౌరవనీయులైన అధ్యక్షా,

కశ్మీర్ ను కేవలం ఒక చిన్న ముక్క గా మాట్లాడే వారికి ఈ దేశాన్ని గురించి ఏమీ తెలియదు. వారి మేధో దారిద్య్రాన్ని సూచిస్తుంది. కశ్మీర్ అనేది భారతదేశానికి కిరీట ఆభరణం.

గౌరవనీయులైన అధ్యక్షా,

కశ్మీర్ ను బాంబుల కు, వేర్పాటువాదాని కి ప్రతీక గా చేశారు. కశ్మీర్ గురించి మాట్లాడిన వారు, కశ్మీర్ గుర్తింపు ను 1990వ సంవత్సరం జనవరి 19వ తేదీ న ఖననం చేసేశారు. కశ్మీర్ గుర్తింపు అంటే సూఫీ సంప్రదాయం. లాల్ దేడ్, నంద్ రుషి, సయ్యద్ బుల్ బుల్ శాహ్, మీర్ సయ్యద్ అలీ హమ్దానీ... వీరు కశ్మీర్ కు ప్రతీక లు.

గౌరవనీయులైన అధ్యక్షా,

370
వ అధికరణను తొలగిస్తే కశ్మీర్ లో మంటలు రగులుకొంటాయని కొందరు అన్నారు. ఏమిటి అటువంటి వారి ఆలోచన విధానం? నేను ప్రజల కు చెప్పదలచుకున్నాను, 370 అధికరణ తొలగిస్తే కశ్మీర్ మండిపోతుంది అన్నారు, కొందరు జైల్ లో ఉన్నారు. సభ్యుల కు మనోపూర్వకం గా చెబుతున్నాను.. రాజ్యాంగాన్ని ఈ సభ కాపాడుకొంటుంది.

గౌరవనీయులైన అధ్యక్షా,

ఆగస్ట్ 5వ తేదీ న మెహబూబా ముఫ్తీ గారు ఏమన్నారు- రాజ్యాంగం పట్ల విధేయులైన సభ్యులారా కాస్త శ్రద్ధ తో వినండి. ఆమె చేసినవి చాలా తీవ్రమైన వ్యాఖ్య లు.. కశ్మీర్ ను భారతదేశం మోసం చేసింది అని ఆమె అన్నారు. మనం కలసి జీవించాలని అనుకొన్న దేశమే మనకు ద్రోహం చేసిందని ఆమె అనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే 1947వ సంవత్సరం లో మనం చేసుకొన్న ఎంపిక తప్పు అని అనడమే కదా ! రాజ్యాంగ పరిరక్షకులమని చెప్పుకొంటున్న వారు ఈ భాష ను అంగీకరిస్తారా ? అటువంటి వారి తరఫు న మీరు వకాల్తా పుచ్చుకుంటున్నారే ! అదే విధం గా ఉమర్ అబ్దుల్లా గారు అన్నారు.. 370 వ అధికరణాన్ని రద్దు చేస్తే భూకంపం వస్తుంది, కశ్మీర్ భారత్ నుండి వేరవుతుంది అని.

గౌరవనీయులైన అధ్యక్షా,

370
వ అధికరణాన్ని తొలగిస్తే కశ్మీర్ ప్రజల స్వాతంత్య్రానికి పరిస్థితులు దారి తీస్తాయని, జాతీయ జెండ ఎగురవేసే వారే ఉండరు అని ఫారూఖ్ అబ్దుల్లా గారు అంటారు. ఇటువంటి భావాలు ఉన్న వారి ని రాజ్యాంగం పై నమ్మకం ఉన్నవారు ఎవరైనా సమర్థించగలరా? ఇటువంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

గౌరవనీయులైన అధ్యక్షా,

కశ్మీర్ ప్రజల పై విశ్వాసం లేని వారే ఇటువంటి మాట లు మాట్లాడుతారు. మాకు కశ్మీర్ ప్రజల పై పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. వారి పై నమ్మకం ఉంచాము కాబట్టి 370 వ అధికరణాన్ని తొలగించాము. నేడు వేగవంతం గా అభివృద్ధి జరిగేలా చర్యల ను తీసుకొన్నాము. కశ్మీర్ కానివ్వండి, ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి, కేరళ కానివ్వండి.. దేశం లో ఏ ప్రాంతం లో కూడా పరిస్థితి క్షీణించడానికి ఆస్కారాన్ని ఇవ్వబోము. మా మంత్రులు కూడా నిరంతరం కశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ప్రజల తో మాట్లాడుతున్నారు. అక్కడి సమస్యల ను ప్రజల తో నిరంతరం మాట్లాడుతూ పరిష్కరిస్తున్నాము.

గౌరవనీయులైన అధ్యక్షా,

ఈ సభాప్రాంగణం నుండి, ఈ రోజు న నేను జమ్ము & కశ్మీర్ ప్రజల ఆకాంక్షల ను మరియు అంచనాల ను నెరవేర్చడానికి, జమ్ము & కశ్మీర్ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కు మరియు జమ్ము & కశ్మీర్ అభివృద్ది కి మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నాను. మేము రాజ్యాంగాని కి అంకితభావం తో ఉన్నాము మరియు అందరమూ కట్టుబడి ఉన్నాము. అయితే అదే కాలం లో నేను లద్దాఖ్ ను గురించి కూడా కొంత మాట్లాడాలనుకొంటున్నాను.

గౌరవనీయులైన అధ్యక్షా,

సిక్కిమ్ మన దేశంలో ఒక సేంద్రీయ రాష్ట్రం గా స్థిరపడిన రాష్ట్రం. ఒక విధంగా, సిక్కిమ్ వంటి చిన్న రాష్ట్రాలు దేశంలోని అనేక రాష్ట్రాల కు స్ఫూర్తి ని ఇచ్చాయి. సిక్కిమ్ రైతులు, సిక్కిమ్ పౌరులు ఈ ప్రశంసల కు అర్హులు. లద్దాఖ్- నా మనస్సు లో లద్దాఖ్ ముఖచిత్రం చాలా స్పష్టం గా ఉన్నదని నేను నమ్ముతున్నాను. మరి ఈ కారణం గా మన పొరుగు దేశం భూటాన్ పర్యావరణం విషయం లో ఏ విధం గా ప్రశంసలు పొందిందో, కార్బన్ న్యూట్రల్ కంట్రీ గా ప్రపంచం లో గుర్తింపు ను తెచ్చుకొందో, ఆ విధం గా లద్దాఖ్ ఉండాలని కోరుకుంటున్నాము. ఈ దేశ ప్రజలమైన మనము ఒక సంకల్పం చేసుకుంటాము మరియు లద్దాఖ్ ను కార్బన్ న్యూట్రల్ ఎన్ టిటి గా కూడా అభివృద్ధి చేస్తామని మనమందరం సంకల్పించుకోవాలి. ఇది దేశాని కి ఒక హాల్ మార్క్ ను సృష్టిస్తుంది. అలాగే ఇది ఒక మాడల్‌ గా భవిష్యత్ తరాల కు ప్రయోజనాన్ని చేకూర్చుతుందని నేను ఖచ్చితం గా అనుకొంటున్నాను. నేను లద్దాఖ్ కు వెళ్ళినప్పుడు, వారితో ఉన్నప్పుడు; దీని విషయం లో ఒక డిజైన్ ను తయారు చేసే దిశ గా ముందుకు సాగుతున్నాను.

గౌరవనీయులైన అధ్యక్షా,

ఇక్కడ ఈ సభ ఆమోదించిన చట్టం, ఉభయ సభల లోను సదరు సవరణ రెండు సభల లో ఆమోదించబడింది, దేనిని అయితే నోటిపై కూడా చేయడం జరిగిందో, ఆ విషయం లో కూడా ఎంతో కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి సిఎఎ ను తీసుకు రావడానికి. కొంతమంది అంటున్నారు సిఎఎ ను తీసుకు రావడానికి ఏమిటి ఆ ఆతురత అని. గౌరవనీయులైన సభ్యులు కొందరు ఈ ప్రభుత్వం వివక్ష ను చూపుతోందని, ఈ ప్రభుత్వం హిందువులు మరియు ముస్లిములు అనే దానిని తీసుకు వస్తోందని అన్నారు. కొంతమంది అయితే మేము దేశాన్ని విభజించాలనుకుంటున్నామని, ఇంకా ఎన్నో మాటలు ఆడారు. మరి ఇక్కడ నుండి కూడా చాలా మాట్లాడారు. ఊహాత్మక భయాన్ని సృష్టించడానికి సంపూర్ణ శక్తి ఉపయోగించబడింది. ఈ మాటలు అనే వారే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకొనే వారి ప్రక్క న నిలబడి ఛాయాచిత్రాలు తీసుకొంటారు. పాకిస్తాన్ దశాబ్దాలు గా ఒకే భాష ను మాట్లాడుతున్నది, పాకిస్తాన్ అదే విషయాన్ని చెప్తూ వస్తోంది.

భారతదేశ ముస్లిముల ను రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ఏ అవకాశాన్ని వదలిపెట్టలేదు. భారతదేశ ముస్లిముల ను తప్పుదారి పట్టించడానికి, పాకిస్తాన్ ప్రతి ఆట ను ఆడింది, ప్రతి రంగు ను చూపించింది. ప్రజలు అధికారాని కి దూరం గా ఉంచి ఇంటి కి పంపించిన అటువంటి వారు దేశం ఎన్నడూ ఊహించనైనా ఊహించనటువంటి పని ని ఈ రోజు న చేస్తుండటాన్ని చూసి నేను హైరానా పడుతున్నాను. భారతదేశం యొక్క నినాదాన్ని మరియు జయ్ హింద్ నినాదాన్ని ఇచ్చింది మన ముస్లిములే అని మాకు గుర్తు చేస్తున్నారు. సమస్య ఏమిటంటే కాంగ్రెస్ మరియు దాని దృష్టి లో ఈ మనుషులు ఎప్పటికీ కేవలం ముస్లిములు, ఆఁ .. వట్టి ముస్లిములే. మాకు, మా దృష్టి లో వారు భారతీయులు, హిందుస్తానీలు. ఖాన్ అబ్దుల్ గఫ్పార్ ఖాన్ అయినా కావచ్చు.

గౌరవనీయులైన అధ్యక్షా,

ఒక బాలుని గా ఉన్నప్పుడు ఖాన్ అబ్దుల్ గఫ్పార్ ఖాన్ గారి చరణాల ను స్పర్శించే అవకాశం నాకు దొరికింది. దీనిని నేను నా యొక్క గర్వం గా భావించుకొంటున్నాను.

గౌరవనీయులైన అధ్యక్షా,

ఖాన్ అబ్దుల్ గఫ్పార్ ఖాన్ అయినా, అశ్ ఫాక్- ఉల్లా ఖాం అయినా, బేగమ్ హజ్ రత్ మహల్ అయినా, వీర్ శహీద్ అబ్దుల్ కరీమ్ అయినా లేదా పూర్వ రాష్ట్రపతి శ్రీమాన్ ఎపిజె అబ్దుల్ కలామ్ అయినా, అందరూ మా యొక్క దృష్టి లో భారతీయులే.

గౌరవనీయులైన అధ్యక్షా,

కాంగ్రెస్ మరియు దాని లాంటి పక్షాలు భారతదేశం యొక్క కళ్ళ నుండి భారతదేశాన్ని చూడటం ప్రారంభించిన రోజు న, వాటి యొక్క తప్పు ను గ్రహిస్తాయి, గ్రహిస్తాయి, గ్రహిస్తాయి. సర్, పౌరసత్వ సవరణ చట్టం పై వారు ఒక గలాభా ను సృష్టించినందుకు కాంగ్రెస్ కు మరియు వారి ఇకోసిస్టమ్ కు నేను చాలా కృతజ్ఞుడినై వున్నాను. వారు వ్యతిరేకించకపోతే, వారు దానిపై అంతగా శబ్దం చేయకపోతే, బహుశా ఈ దేశం వారి నిజమైన స్వభావాన్ని తెలుసుకొని ఉండేది కాదు. పార్టీ కోసం ఎవరు, దేశం కోసం ఎవరు ఉన్నారని ఈ దేశం చూసింది. మరి నేను కోరుకొంటున్నాను జబ్ చర్చా నికల్ పడీ హై తో బాత్ దూర్ తక్ చలీ జాయెగీఅని (ఈ మాటల కు.. చర్చ అనేది మొదలైందీ అంటే విషయం చాలా దూరం వరకు వెళ్తుంది అని భావం).

గౌరవనీయులైన అధ్యక్షా,

ప్రధాన మంత్రి అవ్వాలని ఎవరైనా కోరుకోవచ్చును అందులో తప్పు ఏమీ లేదు. కానీ ఒకరు ప్రధాని కావడానికి, హిందుస్తాన్ పై ఒక గీత గీయబడి దేశం విభజించబడింది. విభజన తరువాత, పాకిస్తాన్ లోని హిందువులు, సిఖ్ఖులు మరియు ఇతర అల్పసంఖ్యాక వర్గాల పైన దారుణాలు ఎలా జరిగాయో, హింస మరియు దౌర్జన్యం లను గురించి ఊహించలేము. మీరు ఎప్పుడైనా భూపేంద్ర కుమార్ దత్త్ పేరు ను విన్నారా ? అని నేను కాంగ్రెస్ సహచరుల ను అడగాలనుకొంటున్నాను. ఈ విషయాన్ని కాంగ్రెస్ తెలుసుకోవడం చాలా ముఖ్యం; ఇక్కడ లేని వారు కూడా తెలుసుకోవాలి.

భూపేంద్ర కుమార్ దత్త్ ఒకానొక సమయం లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ లో ఉన్నారు. ఆయన అందులో ఒక సభ్యుడు కూడాను. స్వాతంత్ర్య పోరాటం లో 23 సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపారు. ఆయన న్యాయం కోసం జైలు లోపల 78 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇది కూడా ఆయన పేరిట ఒక రికార్డు గా ఉన్నది. విభజన అనంతరం, భూపేంద్ర కుమార్ దత్త్ పాకిస్తాన్ లోనే ఉండిపోయారు. అక్కడి రాజ్యాంగ పరిషత్తు లో కూడా సభ్యుని గా ఉన్నారు. రాజ్యాంగం యొక్క పనులు జరుగుతున్నప్పుడు, రాజ్యాంగం యొక్క పని ఇంకా పురోగతి లో ఉన్నప్పుడు- అది ప్రారంభం మాత్రమే- ఆ కాలం లో అదే రాజ్యాంగ పరిషత్తు లో భూపేంద్ర కుమార్ దత్త్ ఆడిన మాటల ను నేను మరో మారు ప్రస్తావించదలచాను. ఎందుకంటే మా పై ఆరోపణల ను రుద్దుతున్న వారు దీని ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.

భూపేంద్ర కుమార్ దత్త్ అన్నారు- So for as this side of Pakistan is concerned, the minorities are practically liquidated. Those of us who are here to live represent near a crore of people still left in East Bengal, live under a total sense of frustration అని. విభజన జరిగిన వెనువెంటనే రాజ్యాంగ పరిషత్తు లో భూపేంద్ర కుమార్ దత్త్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కూడా, అల్పసంఖ్యాక వర్గాల మరియు అక్కడి అల్పసంఖ్యాక ప్రజల పరిస్థితి ఇది. ఆ తరువాత, పాకిస్తాన్ లో పరిస్థితి చాలా ఘోరం గా దిగజారింది. భూపేంద్ర దత్త్ భారతదేశాని కి వచ్చి ఆశ్రయం పొందవలసి వచ్చింది. తరువాత ఆయన కూడా ఈ భారత మాత ఒడి లో తుది శ్వాస ను వదలారు.

గౌరవనీయులైన అధ్యక్షా,

ఆనాటి మరొక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు ఆ రోజుల్లో పాకిస్తాన్ లోనే ఉండిపోయారు. ఆయనే జోగేంద్ర నాథ్ మండల్. ఆయన చాలా అణచివేత బారిన పడ్డ, దోపిడి కి గురి అయిన మరియు అణగారిన అటువంటి సమాజాని కి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ను పాకిస్తాన్ యొక్క మొదటి న్యాయ మంత్రి గా చేశారు. 1950వ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ న స్వాతంత్ర్యం వచ్చిన మరియు విభజన జరిగిన రెండు- మూడు సంవత్సరాలయ్యాయి. ఆయన 1950వ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ న రాజీనామా చేశారు. రాజీనామా లేఖ లో రాసిన ఆయన రాజీనామా యొక్క పేరా ను నేను ఉట్టంకించదలచాను. ఆయన - I must say that the policy of driving out Hindus from Pakistan has succeeded completely in West Pakistan and is nearing completion in East Pakistan” అని వ్రాశారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే - Pakistan has not given the Muslim League entire satisfaction and a full sense of security. They now want to get rid of the Hindu intelligentsia so that the political economic and social life of Pakistan may not in anyway influenced by them అని. ఈ విషయాన్ని మండల్ గారు తన రాజీనామా లేఖ లో వ్రాశారు. ఆయన కూడా చివరకు భారతదేశాని కి రావలసి వచ్చింది. మరి ఆయనా భారత మాత ఒడి లోనే కన్నుమూశారు. చాలా దశాబ్దాలు గడచిపోయినప్పటికి కూడా పాకిస్తాన్ ఆలోచన మారలేదు. అల్పసంఖ్యాక వర్గాలు నేడు సైతం హింసించబడుతున్నారు. నంకనా సాహెబ్‌కు ఏమి జరిగిందో - దేశం మరియు ప్రపంచం మొత్తం చూసింది. ఇది హిందువులు మరియు సిక్కులకు మాత్రమే జరుగుతుందని కాదు, ఇతర అల్పసంఖ్యాక వర్గాల విషయం లోనూ అదే జరుగుతుంది. క్రైస్తవులు కూడా ఇలాంటి బాధల ను ఎదుర్కోవలసి ఉంటుంది.

సభ లో చర్చ సందర్భం గా గాంధీజీ ప్రకటన పై వ్యాఖ్యలు చేశారు. సిఎఎ పై ప్రభుత్వం చెబుతున్నది గాంధీజీ సెంటిమెంట్ కాదని అన్నారు.

ఏదేమైనా, కాంగ్రెస్ వంటి పక్షాలు దశాబ్దాల క్రితమే గాంధీజీ బోధల ను వదలిపెట్టాయి. మీరు గాంధీజీ ని విడచిపెట్టారు. అందువల్ల నేను గానీ ఈ దేశం గానీ మీ నుండి ఏమీ ఆశించవు. అయితే కాంగ్రెస్ మనుగడ లో ఉండడానికి ఏది మూలాధారమో వారి ని గురించి నేను ఈ రోజు న మాట్లాడదలుస్తున్నాను.

1950 లో నెహ్రూ-లియాకత్ ఒప్పందం కుదుర్చుకోబడింది. భారతదేశం మరియు పాకిస్తాన్ లలో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గాల రక్షణ పై ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్‌ లో మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల పట్ల వివక్ష తో వ్యవహరించడం ఉండకూడదు అన్నది ఒప్పందం యొక్క ప్రాతిపదిక. పాకిస్తాన్ లో ఉన్న మనం మాట్లాడుతున్న మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల కు సంబంధించి నెహ్రూ మరియు లియాకత్ ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సివుంది. నెహ్రూ లాంటి గొప్ప లౌకిక వాది, నెహ్రూ లాంటి గొప్ప ఆలోచనాపరుడు, ఇంత పెద్ద దార్శనికుడు మరి మీకు ఆయనే అన్నీ. ఆ కాలం లో అల్పసంఖ్యాక వర్గాల కు బదులు గా 'పౌరులందరూ' అనే పదాన్ని ఆయన ఎందుకు ఉపయోగించలేదు ? ఆయన చాలా గొప్పవారు అయితే, చాలా ఉదారం గా ఉంటే, అప్పుడు ఆయన ఎందుకు చేయలేదు. ఏదో కారణం ఉండి వుండాలి. కానీ, ఈ సత్యాన్ని మీరు ఎంత కాలం పాటు ఖండిస్తారు ?

సోదరులు మరియు సోదరీమణులు, గౌరవనీయులైన అధ్యక్షా మరియు గౌరవనీయులైన సభ్యులారా,

ఇది ఆ కాలం నాటి విషయం. నేను ఆ కాలాన్ని గురించి మాట్లాడుతున్నాను. నెహ్రూ గారు ఒప్పందం లో పాకిస్తాన్ యొక్క అల్పసంఖ్యాక వర్గాలు, ఈ మాట కు ఎలా ఒప్పుకొన్నాయి, తప్పక ఏదో ఒక కారణం ఉండి వుంటుంది. ఈ రోజు న మేము ఏ మాట ను అయితే పలుకుతున్నామో, అదే మాట ను ఆ కాలం లో నెహ్రూ గారు చెప్పారు.

గౌరవనీయులైన అధ్యక్షా,

నెహ్రూ అల్పసంఖ్యాక వర్గాలు మాట ను ఎందుకు ఉపయోగించారు ?, ఇది మీరు చెప్పరు ఎందుకు అంటే మీకు ఇబ్బంది ఉంది. కానీ నెహ్రూ స్వయం గా దీనికి సమాధానం ఇచ్చారు. నెహ్రూ-లియాకత్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఒక సంవత్సరం ముందు అసమ్ లో తత్కాలీన ముఖ్యమంత్రి శ్రీమాన్ గోపీనాథ్ జీ కి ఒక లేఖ ను వ్రాశారు. మరి గోపీనాథ్ గారి కి వ్రాసినటువంటి ఉత్తరం లో వ్రాసింది ఏమిటో దానిని నేను ఉట్టంకించదలుస్తున్నాను.

నెహ్రూజీ ఇలా వ్రాశారు - మీరు హిందూ శరణార్థులు మరియు ముస్లిమ్ వలసదారుల మధ్య తేడా ను గుర్తించవలసి వుంటుంది. ఈ శరణార్థుల బాధ్యత ను దేశం తీసుకోవలసి వుంటుంది. ఈ లేఖ ను అప్పటి భారతదేశ ప్రధాని పండిత్ నెహ్రూ గారు అప్పటి అసమ్ యొక్క ముఖ్యమంత్రి కి వ్రాశారు. నెహ్రూ-లియాకత్ ఒప్పందం కుదిరిన కొద్ది నెలల్లో, 1950వ సంవత్సరం నవంబర్ 5వ తేదీ న నెహ్రూ గారు ఈ పార్లమెంటు ప్రాంగణం లో మాట్లాడుతూ, భారతదేశం లో స్థిరపడటానికి వచ్చిన బాధిత ప్రజలు, వారికి పౌరసత్వం లభిస్తుందనడం లో సందేహం లేదు. మరి చట్టం దీని కి అనుకూలం గా లేకపోతే చట్టాన్ని మార్చాలి అని అన్నారు.

1963వ సంవత్సరం లో లోక్ సభ లో సావధాన తీర్మానం జరిగింది. ఆ కాలం లో ఈ సభ లో ప్రధాన మంత్రి నెహ్రూ యే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పదవి బాధ్యతల ను కూడా నిర్వహిస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమాన్ దినేశ్ గారు ఈ తీర్మానాని కి సమాధానం ఇస్తున్నప్పుడు చివర లో ప్రధాన మంత్రి నెహ్రూ గారు ఆయన ను మధ్య లో ఆపి చెప్పిన మాటల ను నేను ఉట్టంకిస్తున్నాను- తూర్పు పాకిస్తాన్‌ లో అక్కడ ఉన్న అధికార వర్గం హిందువుల పై తీవ్ర ఒత్తిడి ని తీసుకు వస్తోందన్నారు. ఇది పండిత్ గారి యొక్క ప్రకటన. పాకిస్తాన్ లోని పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని, గాంధీ గారు మాత్రమే కాదు, ఇది నెహ్రూ గారి యొక్క భావన గా కూడా ఉండింది. చాలా పత్రాలు, లేఖ లు, స్థాయీ సంఘం నివేదిక లు ఉన్నాయి. అన్నీ కూడాను ఇటువంటి చట్టాని కి వత్తాసు పలుకుతూ సాగాయి.

ఈ సభ లోని వాస్తవాల ఆధారం గా, నేను ప్రత్యేకం గా కాంగ్రెస్‌ ను అడగాలనుకుంటున్నాను. మరి వారి ఇకోసిస్టమ్ కూడా ఈ నా యొక్క ప్రశ్నల ను అర్థం చేసుకొంటుందనుకుంటాను. నేను చెప్పిన ఈ విషయాల తో పండిత్ నెహ్రూ మతతత్వవాది యా? నేను కాస్త తెలుసుకోవాలి అని అనుకొంటున్నాను. పండిత్ నెహ్రూ హిందవులు, ముస్లిముల మధ్య భేదం పాటించారా ? పండిత్ నెహ్రూ హిందూ దేశం నిర్మించాలనుకొన్నారా ?

గౌరవనీయులైన అధ్యక్షా,

ఇది కాంగ్రెస్ తో ఇదే సమస్య. అది విషయాల ను సృస్టిస్తుంది, తప్పుడు వాగ్దానాలు చేస్తున్నది మరియు దశాబ్దాలు గా వాగ్దానాల ను వాయిదా వేస్తూంది. ప్రస్తుతం మా ప్రభుత్వం మా దేశ నిర్మాత ల మనోభావాల ఆధారం గా నిర్ణయాల ను తీసుకొంటూ ఉన్నప్పుడు, కాంగ్రెస్ సమస్యల ను ఎదుర్కొంటోంది. ఈ సభ ద్వారా, ఈ దేశం లోని 130 కోట్ల మంది పౌరుల కు, రాజ్యాంగ గౌరవాన్ని గురించి చాలా బాధ్యత తోను, అవగాహన తోను నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. రాజ్యాంగాన్ని పూర్తి గా గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. నేను 130 కోట్ల మంది పౌరుల కు చెప్పాలనుకుంటున్నాను - సిఎఎ.. ఈ చట్టం వల్ల హిందుస్తాన్ లోని ఏ పౌరుల మీద ఎటువంటి ప్రభావం ఉండదు. అది హిందువు, ముస్లిము, సిఖ్ఖు, క్రిస్టియన్ అయినా ఎవరి ని కూడా ప్రభావితం చేయదు. ఇది భారతదేశ మైనారిటీల కు హాని ని కలిగించదు. ఇంకా దేశ ప్రజల చేత తిరస్కరించబడిన వారు వోట్ బ్యాంకు రాజకీయాలు చేయడానికి ఈ ఆటల ను ఆడుతున్నారు.

నేను అడగాలనుకొంటున్నాను- మైనారిటీ ల పేరిట తమ రాజకీయ అజెండ ను మరింత గా పెంచుకొంటున్న వారి ని, ప్రత్యేకం గా కాంగ్రెస్ వారి ని- నేను అడగాలనుకుంటున్నాను. 84 యొక్క ఢిల్లీ అల్లర్ల ను కాంగ్రెస్ గుర్తు పెట్టుకొందా, అది మైనారిటీ ల మీద కాదా ? మీరు వారి యొక్క, మన సిఖ్ఖు సోదరుల యొక్క మెడ లలో టైరుల ను వేసి మరీ సజీవ దహనం చేశారు కదా. ఇది మాత్రమే కాదు, సిఖ్ఖు వ్యతిరేక అల్లర్ల లో నిందితుల ను జైలు కు పంపించడానికి మీరు ఏమీ చేయలేదు. అంతే కాక, ఈ రోజు న నిందితులు గా ఉన్న వారు, సిఖ్ఖు వ్యతిరేక అల్లర్ల ను ప్రేరేపించారని ఆరోపించ బడిన వారి ని, మీరు ప్రస్తుతం ముఖ్యమంత్రులు గా చేస్తున్నారు. సిఖ్ఖు వ్యతిరేక అల్లర్ల లో నిందితుల కు శిక్ష పడేందుకు మా వితంతు మాతృ మూర్తులు న్యాయం కోసం మూడు దశాబ్దాలు వేచి వుండవలసి వచ్చింది. వారు మైనారిటీ లు కాదా ? మైనారిటీ కి రెండు త్రాసు లు ఉంటాయా ? ఏం, ఇవే మీ మార్గాలు అవుతాయా ?

గౌరవనీయులైన అధ్యక్షా,

ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, నేడు దేశం యొక్క అంచనాల కు అనుగుణం గా బాధ్యతాయుతమైన ప్రతిపక్షం గా పని చేయవలసిన పక్షం ఈ రోజు తప్పు మార్గం లో పయనించడం దేశం యొక్క దురదృష్టం. ఈ మార్గం మీకు కూడా ఇబ్బంది కలిగించబోతోంది, అలాగే ఇది దేశాన్ని కూడా ఇబ్బందుల లోకి నెట్టబోతోంది. నేను ఈ హెచ్చరిక ను చేస్తున్నాను.. ఎందుకంటే మనం అందరం దేశాన్ని గురించి ఆలోచించాలి. మన దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు ను గురించి ఆలోచించాలి.

మీరు దాని ని గురించి ఆలోచిస్తే, రాజస్థాన్ విధాన సభ ఏదైనా నిర్ణయాన్ని తీసుకొని, ఒక వ్యవస్థ ను రూపొందిస్తే, దానిని రాజస్థాన్‌ లో ఎవరూ పాటించడాని కి సిద్ధపడకుండా, ఊరేగింపు లు చేపట్టి, హింస కు పాల్పడి, కాల్పులు జరిపితే, అక్కడ మీ ప్రభుత్వం ఉంది- పరిస్థితి ఎలా ఉంటుంది ? మధ్య ప్రదేశ్- అక్కడ మీరు అధికారం లో ఉన్నారు. మధ్య ప్రదేశ్ విధాన సభ ఒక నిర్ణయాన్ని తీసుకొంటుంది. మరి ఆ నిర్ణయాని కి వ్యతిరేకం గా ప్రజలు వీధుల్లోకి వస్తారు. ఇలాగ దేశాన్ని నడిపించగలమా?

మీరు ఇంత తప్పు చేశారు. ఈ కారణం గానే అక్కడ కూర్చోవలసి వచ్చింది. మీ యొక్క నిర్వాకాల ఫలితం గా ప్రజానీకం మిమ్ములను అక్కడ కూర్చోబెట్టింది. అందువల్ల ప్రజాస్వామిక పద్ధతి లో దేశం లో ప్రతి ఒక్కరి కి వారి అభిప్రాయాన్ని వెల్లడి చేసేందుకు హక్కు ఉంది. కానీ అబద్ధం, వదంతులు వ్యాప్తి చేయడం ద్వారా మనుషుల ను తప్పుదోవ పట్టించి మనం దేశాని కి ఏ మంచి ని చేయజాలము.

మరి అందుకే ఈ రోజు న రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే వారి కి ..

రండి- రాజ్యాంగాన్ని గౌరవించండి.

రండి - కలసి కూర్చొని దేశాన్ని నడుపుదాము.

రండి - దేశాన్ని ముందుకు తీసుకుపోదాము. 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ కోసం ఒక సంకల్పం తీసుకొని మనం సాగిపోదాము.

రండి - స్వచ్ఛమైన తాగునీరు లభించకుండా ఉన్నటువంటి దేశం లోని 15 కోట్ల కుటుంబాల కు, దాని ని అందుబాటు లోకి తీసుకుపోయే సంకల్పాన్ని చెప్పుకొందాము.

రండి- దేశం లోని ప్రతి పేద వ్యక్తి కి పక్కా గృహ‌ నిర్మాణ‌ం కోసం కలసి పని చేద్దాము; తద్వారా వారి కి పక్కా ఇల్లు లభిస్తుంది.

రండి- దేశ రైతులు, మత్స్యకారులు, పశువు ల సంరక్షకులు ఎవరైనా, వారి ఆదాయాన్ని విజయవంతం గా పెంచడానికి కలసి పని చేద్దాము.

ప్రతి పంచాయతీ కి బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ని ఇద్దాము.

రండి- ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ ను నిర్మించాలనే సంకల్పం తో మనం ముందుకు నడచివెళ్దాము.. అంటూ నేను ప్రత్యేకం గా మనవి చేస్తున్నాను.

గౌరవనీయులైన అధ్యక్షా,

భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం మనం కలసి కూర్చొని ముందంజ వేద్దాము. ఈ ఒక్క భావన తో నేను మాననీయ రాష్ట్రపతి గారి కి అనేకానేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా యొక్క ప్రసంగానికి విరామాన్ని ఇస్తున్నాను. మీ పట్ల సైతం నేను నా యొక్క విశేష కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.


**

 



(Release ID: 1606230) Visitor Counter : 380