ఆర్థిక మంత్రిత్వ శాఖ

స్టాండ్-అప్ ఇండియా స్కీము లో 81 శాతాని కి పైగా ఖాతాదారులు మ‌హిళ‌లు

ముద్ర లో మొత్తం రుణ‌ స్వీక‌ర్త‌ల లో 70 శాతం మంది మ‌హిళ‌లు పిఎంజెడివై లో మొత్తం 38.13 కోట్ల మంది ల‌బ్ధిదారుల లో 20.33 కోట్ల మంది ల‌బ్ధిదారులుమ‌హిళ‌లు ఎపివై లో మొత్తం దాదాపు గా 2.15 కోట్ల స‌బ్‌స్క్రైబ‌ర్ ల‌లో 93 ల‌క్ష‌ల కు పైగాస‌బ్‌స్క్రైబ‌ర్ లు మ‌హిళ‌లు పిఎంజెజెబివై లోను, పిఎంఎస్‌బివై లోను స‌భ్యులు గా న‌మోదు అయిన‌ వారిలో 40 శాతాని కి పైగామ‌హిళ‌లు

Posted On: 03 MAR 2020 9:48AM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ గ‌డ‌చిన ఆరు సంవ‌త్స‌రాల కాలం లో వివిధ ప‌థ‌కాల ను ప్రారంభించింది. ఈ ప‌థ‌కాల లో మ‌హిళ‌ల సాధికారిత కు సంబంధించిన ప్ర‌త్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ప‌థ‌కాలు ఒక ఉత్త‌మ‌మైన జీవ‌నాన్ని గ‌డిపే విధం గా మ‌హిళ‌ల కు ఆర్థిక సాధికారిత ను సంత‌రించాయి. అలాగే ఒక న‌వ పారిశ్రామిక‌వేత్త‌ గా త‌యారు కావాల‌న్న వారి యొక్క క‌ల‌ల ను నెర‌వేర్చుకోవ‌డానికి అవ‌కాశాన్ని ఇచ్చాయి.

 

మ‌నం 2020వ సంవ‌త్స‌రం మార్చి నెల 8వ తేదీ నాడు అంత‌ర్జాతీయ మ‌హిళల దినాన్ని జ‌రుపుకోనున్న సంద‌ర్భం లో భార‌త‌దేశం లో మ‌హిళ‌ల కు ల‌బ్ధి ని చేకూర్చ‌డానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరంభించిన వివిధ ప‌థ‌కాల ను గురించి తెలుసుకొందాము.

 

స్టాండ్-అప్ ఇండియా స్కీమ్ - స్టాండ్ అప్ ఇండియా స్కీము ను ఉద్యోగ క‌ల్ప‌న మ‌రియు అట్ట‌డుగు స్థాయి లో ఆర్థిక సాధికారిత కు ఉద్దేశించిన‌ న‌వ పారిశ్రామిక‌త్వాన్ని ప్రోత్స‌హించేందుకు 2016వ సంవ‌త్స‌రం ఏప్రిల్ 5వ తేదీ న ప్రారంభించడ‌మైంది. ఈ ప‌థ‌కం సంస్థాగ‌త ప‌ర‌ప‌తి యంత్రాంగాన్ని షెడ్యూల్డు కులం, షెడ్యూల్డు తెగ మ‌రియు మ‌హిళా న‌వ‌పారిశ్రామిక‌వేత్త‌ ల వ‌ద్ద‌కు అందుబాటులోకి తీసుకు పోయి, త‌ద్వారా వారు దేశ ఆర్థిక వృద్ధి లో పాలుపంచుకొనేందుకు మార్గాన్ని సుగ‌మం చేయ‌డానికి ఉద్దేశించినటువంటిది.

 

క‌నీసం ఒక షెడ్యూల్డు కులం (ఎస్‌ సి) లేదా షెడ్యూల్డు తెగ (ఎస్ టి) రుణ‌ స్వీకర్త కు, అలాగే ఎస్‌సిబి ల తాలూకు ఒక్కొక్క శాఖ నుండి క‌నీసం ఒక మ‌హిళా రుణ‌ స్వీకర్త కు ఒక నూత‌న వ్యాపార సంస్థ ను ఏర్పాటు చేయ‌డం కోసం 10 ల‌క్ష‌ల రూపాయ‌ల నుండి ఒక కోటి రూపాయ‌ల మ‌ధ్య విలువైన బ్యాంకు రుణాల కు వీలును క‌ల్పించ‌డం ఈ ప‌థ‌కం యొక్క లక్ష్యం గా ఉంది.

 

2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ నాటికి స్టాండ్-అప్ ఇండియా స్కీము లో భాగం గా ఉన్న‌టువంటి ఖాతాదారుల లో 81 శాతానికి పైగా ఖాతాదారులు గా మ‌హిళలు ఉన్నారు. మ‌హిళ‌ల కోసం 73,155 ఖాతాల ను తెర‌వ‌డ‌మైంది. మ‌హిళా ఖాతాదారుల కు 16712.72 కోట్ల రూపాయ‌లు మంజూరు చేయ‌డ‌మైంది. అదే విధంగా, మ‌హిళా ఖాతాదారుల కు 9106.13 కోట్లు ఇవ్వ‌డ‌మైంది.

 

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న (పిఎమ్ఎమ్ వై) - కార్పొరేట్ రంగాని కి చెంద‌ని, వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించని, చిన్న‌/సూక్ష్మ వ్యాపార సంస్థ‌ల కు 10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ ను అందించ‌డం కోసం 2015వ సంవ‌త్స‌రం ఏప్రిల్ 8వ తేదీ న పిఎమ్ఎమ్ వై ని ప్రారంభించ‌డ‌మైంది. ఈ రుణాల ను పిఎమ్ఎమ్ వై లో భాగం గా ముద్ర రుణాలు గా వ‌ర్గీక‌రించ‌డ‌మైంది. ఈ రుణాల ను వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్‌బి లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎమ్ఎఫ్ఐ లు మ‌రియు ఎన్‌బిఎఫ్‌సి లు ఇచ్చాయి.

 

పిఎమ్ఎమ్ వై ఆధ్వ‌ర్యం లో ముద్ర మూడు ప్రోడ‌క్టుల కు రూప‌క‌ల్ప‌న జరిగింది. అవే. ‘శిశు’, కిశోర్‌’, ఇంకా ‘త‌రుణ్’ ప్రోడ‌క్టు లు. ఈ ప్రోడ‌క్టు లు ల‌బ్ధిదారు తాలూకు సూక్ష్మ యూనిట్‌/న‌వ‌పారిశ్రామిక‌వేత్త యొక్క నిధి సంబంధ అవ‌స‌రాల‌ను తీర్చ‌డం మ‌రియు వృద్ధి/అభివృద్ధి తాలూకు ద‌శ కు ప్రాముఖ్యాన్ని ఇచ్చి, గ్రాడ్యుయేష‌న్‌/వృద్ధి తాలూకు త‌దుప‌రి ద‌శ‌కై ఒక రెఫర‌న్స్ పాయింట్ ను స‌మ‌కూర్చ‌డం కోసం ఉద్దేశించినవి.

 

ముద్ర స్కీము యొక్క ఆశ‌యం ఏమిటంటే వ్య‌వ‌స్థ లో అట్ట‌డుగు భాగాన ఉన్న వారు సంపూర్ణ‌మైన ఆర్థిక అభివృద్ధి ని మ‌రియు సామాజిక అభివృద్ధి ని సాధించేట‌ట్లు గా వారికి ప్ర‌పంచ శ్రేణి ఉత్త‌మ అభ్యాసాలతోను, ఉత్తమ ప్ర‌మాణాల తోను తుల‌తూగే శ్రేష్ఠ‌మైనటువంటి ఆర్థిక సేవలను మ‌రియు సమ‌ర్ధ‌న పూర్వ‌క‌మైన సేవ‌ల ను ఒక్క‌చోటే స‌మ‌కూర్చాలి’ అనేదే.

 

2020 వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 31వ తేదీ నాటికి మొత్తం రుణ‌ స్వీక‌ర్త‌ల లో 70 శాతం మంది మ‌హిళ‌లు.

 

ప్ర‌ధాన మంత్రి జ‌న్‌-ధ‌న్ యోజ‌న (పిఎమ్ జెడివై) - పిఎమ్ జెడివై ని 2014వ సంవ‌త్స‌రం ఆగ‌స్టు 28వ తేదీ న ప్రారంభించ‌డ‌మైంది. 2018వ సంవ‌త్స‌రం ఆగ‌స్టు 14వ తేదీ నుండి వ‌ర్తించే విధం గా స‌వ‌రించిన‌టువంటి మ‌రియు విస్త‌రించిన‌టువంటి ఈ యొక్క ప‌థ‌కం లో భాగం గా వ‌యోజ‌నుల లో ప్ర‌తి ఒక్క‌రికీ క‌నీసం ఒక ప్రాథ‌మిక బ్యాంకింగ్ ఖాతా, ఆర్థిక విష‌యాల పట్ల అవగాహన, ప‌ర‌ప‌తి ల‌భ్య‌త‌, బీమా, ఇంకా పింఛ‌న్ ల‌ను క‌లుగజేయ‌డం వంటివి లక్ష్యాలు గా ఉన్నాయి.

 

2020 ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ నాటికి మొత్తం 38.13 కోట్ల మంది ల‌బ్ధిదారుల లో 20.33 కోట్ల మంది ల‌బ్ధిదారులు అంటే 53 శాతం మంది ల‌బ్ధిదారులుగా మ‌హిళ‌లు ఉన్నారు.

 

 

అట‌ల్ పెన్షన్ యోజ‌న (ఎపివై) - ఎపివై ని 2015వ సంవ‌త్స‌రం మే నెల 9వ తేదీన ప్రారంభించ‌డ‌మైంది. భార‌త‌దేశం లో అంద‌రికీ, ప్ర‌త్యేకించి పేద‌లు మ‌రియు ఆద‌ర‌ణ కు నోచుకోని వ‌ర్గాల వారికి 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే స‌రికి నెల‌వారీ క‌నీసం 1000 రూపాయ‌ల నుండి 5000 రూపాయ‌ల వ‌ర‌కు పింఛ‌ను కు హామీ ని ఇచ్చే ఒక సార్వ‌జ‌నిక సామాజిక భ‌ద్ర‌త వ్య‌వ‌స్థ ను ఏర్ప‌ర‌చాల‌నేది దీని లక్ష్యం గా ఉంది.

 

ఈ ప‌థ‌కం లో త‌పాలా కార్యాల‌యాల ద్వారా మ‌రియు బ్యాంకుల ద్వారా ప్ర‌స్తుతం చేరేందుకు అవ‌కాశం ఉంది. 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ నాటికి ఎపివై లో చేరిన మొత్తం దాదాపు 2.15 కోట్ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్ ల‌లో 93 ల‌క్ష‌ల మందికి పైగా స‌బ్‌స్క్రైబ‌ర్ లుగా మ‌హిళ‌లు ఉన్నారు. ఈ లెక్కన ఎపివై లో 43 శాతం మంది మ‌హిళా స‌బ్‌స్క్రైబ‌ర్ లు ఉన్నట్లు అర్థం అవుతోంది.

 

2016వ సంవత్సరం డిసెంబ‌ర్ లో 37 శాతం గా ఉన్న ఎపివై మ‌హిళా స‌బ్‌స్క్రైబ‌ర్ ల న‌మోదు లు 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి క‌ల్లా 43 శాతానికి చేరుకోవ‌డాన్ని పట్టి చూసిన‌ప్పుడు వృద్ధాప్య ద‌శ లో ఆదాయ ప‌రం గా భ‌ద్ర‌త క‌ల్ప‌న లో ఎక్కువ‌ గా మ‌హిళ‌ల కు ప్రాధాన్యం ద‌క్కుతున్నద‌ని అర్థం అవుతోంది. శ్రామిక వ‌ర్గాల ప్రాతినిధ్యం రేటు లు త‌క్కువ‌గా మ‌రియు పురుషులు, మ‌హిళ ల యొక్క వేత‌నాల లో అంత‌రం అధికంగా ఉన్న‌ప్ప‌టికీ కూడాను వార్ధ‌క్యం లో ఆదాయ భ‌ద్ర‌త ను దృష్టి లో పెట్టుకొని పొదుపు చేయ‌డం కోసం మ‌హిళ‌లు ముందు వ‌రుస‌ లో నిలుస్తున్నారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో పురుషుల క‌న్నా మ‌హిళ‌ల ప్రాతినిధ్యం అధికం గా ఉంటున్న‌ది. ఇది సిక్కిమ్ లో 73 శాతం గా, త‌మిళ నాడు లోను, కేర‌ళ లోను 56 శాతంగా, ఆంధ్ర ప్ర‌దేశ్ లో 55 శాతంగా, పాండిచ్చేరి, మేఘాల‌య‌, ఝార్‌ఖండ్ ల‌లో 54 శాతం గా, బిహార్ లో 52 శాతం గా ఉంది.

 

ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న (పిఎమ్ జెజెబివై) – పిఎమ్ జెజెబివై ని 2015వ సంవ‌త్సరం మే నెల 9వ తేదీన ప్రారంభించ‌డ‌మైంది. 18-50 ఏళ్ళ వ‌య‌స్సు క‌లిగిన వారిలో పేద‌ల కోసం మ‌రియు ఆద‌ర‌ణ కు నోచ‌ని వ‌ర్గాల వారి కోసం ఒక సామాజిక భద్ర‌త వ్య‌వ‌స్థ ను ఏర్ప‌ర‌చాల‌నేది ఈ ప‌థ‌కం యొక్క లక్ష్యం గా ఉంది. దీనిలో భాగం గా కేవ‌లం 330 రూపాయ‌ల ప్రీమియ‌మ్ చెల్లింపు తో 2 ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు పున‌ర్ న‌వీక‌రించుకోవ‌డానికి వీలు ఉండేట‌టువంటి జీవిత బీమా ర‌క్ష‌ణ ను క‌ల్పించ‌డం జ‌రుగుతుంది.

 

పిఎమ్ జెజెబివై లో న‌మోదు అయిన వారిలో 40.70 శాతం న‌మోదులు మ‌హిళా స‌భ్యుల‌వే. అలాగే, 58.21 శాతం క్లెయిము ల‌ను స్వీక‌రించిన లాభితులు కూడా మ‌హిళ‌లే (ఈ సంఖ్య‌ లు 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 31వ తేదీ నాటివి).

 

మొత్తం 4,71,71,568 న‌మోదుల లో 1,91,96,805 మంది మ‌హిళ‌లు న‌మోదు అయ్యారు. 2020 వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 31వ తేదీ నాటికి చెల్లింపు జ‌రిగిన మొత్తం 1,69,216 క్లెయిము ల‌లో 95,508 క్లెయిము ల‌ను మ‌హిళా ల‌బ్ధిదారుల కు చెల్లించ‌డ‌మైంది.

 

ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (పిఎమ్ఎస్‌బివై) – పిఎమ్ఎస్‌బివై ని 2015వ సంవ‌త్స‌రం మే 9వ తేదీన ప్రారంభించ‌డ‌మైంది. 18 ఏళ్ళు మొద‌లుకొని 70 ఏళ్ళ వ‌య‌స్సు క‌లిగిన వారిలో పేద‌ల కోసం మ‌రియు ఆదర‌ణ కు నోచుకోని వార్గాల వారి కోసం అతి త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన‌టువంటి ఒక బీమా ప‌థ‌కాన్ని అందించాలనేది ఈ ప‌థ‌కం యొక్క లక్ష్యం గా ఉంది. ఒక బ్యాంకు ఖాతా లో ఒక్క సంవ‌త్స‌రానికి 12 రూపాయ‌ల ప్రీమియ‌మ్ చెల్లిస్తే, ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిన సంద‌ర్భం లో మ‌రియు పూర్తి శారీరిక వైఫల్యం త‌లెత్తిన సంద‌ర్భం లో 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు రిస్క్ క‌వ‌రేజి మ‌రియు పాక్షిక శారీరిక వైఫ‌ల్యానికి గాను ఒక ల‌క్ష రూపాయ‌ల రిస్క్ క‌వరేజి ఉంటాయి.

 

పిఎమ్ఎస్‌బివై లో 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 31వ తేదీ నాటికి మ‌హిళా స‌భ్యుల న‌మోదు లు 41.50 శాతం గా ఉండగా, క్లెయిమ్ స్వీక‌ర్త‌ల లో 61.29 శాతం గా మ‌హిళ‌ లు ఉన్నారు.

 

మొత్తం 15,12,54,678 మంది దీనిలో పేర్ల ను న‌మోదు చేసుకొన్నారు. వారిలో 6,27,76,282 మంది మహిళలు. మొత్తం 38,988 క్లెయిము ల‌ను చెల్లించ‌గా, అందులో 23,894 క్లెయిము ల‌ను మ‌హిళా ల‌బ్ధిదారుల‌ కు చెల్లించ‌డ‌మైంది.

 

**

 


(Release ID: 1605023) Visitor Counter : 296