మంత్రిమండలి
డిపిఇ మార్గదర్శక సూత్రాలు ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపిజిఎల్)కు వర్తించకుండా మినహాయింపు ను ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
26 FEB 2020 3:43PM by PIB Hyderabad
రిజర్వేషన్ మరియు విజిలెన్స్ పాలిసీ లు మినహా డిపిఇ మార్గదర్శక సూత్రాల నుండి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపిజిఎల్)కు మినహాయింపు ను ఇచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఐపిజిఎల్ ను శిప్పింగ్ మంత్రిత్వ శాఖ తాలూకు పాలన పరమైన నియంత్రణ లో కంపెనీల చట్టం, 2013 పరిధి లో ఓ స్పెశల్ పర్పస్ వెహికిల్ గా స్థాపించడం జరిగింది. దీని ని జవాహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జెఎన్‌పిటి), దీన్ దయాళ్ పోర్ట్ ట్రస్ట్ (డిపిటి) [మునుపటి కాండ్లా పోర్ట్ (కెపిటి ) ]లు సంయుక్తం గా ప్రమోట్ చేశాయి. ఐపిజిఎల్ ను ఇరాన్ లోని చాబహార్ లో శాహిద్ బెహెశ్తీ పోర్టు యొక్క అభివృద్ధి, నిర్వహణ ల కోసం ఏర్పాటు చేయడమైంది.
జాయింట్ కోమ్ ప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జెసిపిఒఎ) నుండి యుఎస్ ఉపసంహరించుకొన్న దరిమిలా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2018వ సంవత్సరం అక్టోబరు 29వ తేదీ నాడు శిప్పింగ్ మంత్రిత్వ శాఖ కు యుఎస్ ఆంక్షల సంభావ్య ప్రభావం బారి నుండి జెన్‌పిటి ని మరియు డిపిటి ని తప్పించాలని సలహా ను ఇచ్చింది.
దీని ఆధారం గాను మరియు సాధికార సంఘం యొక్క అనుమతి తోను జెఎన్‌పిటి, ఇంకా డిపిటి ల శేర్ల ను 2018వ సంవత్సరం డిసెంబర్ 17వ తేదీ నాడు ‘‘సాగర్ మాల డివెలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్’’ (ఎస్‌డిసిఎల్) కొనుగోలు చేసింది. ఎస్‌డిసిఎల్ అనేది ఒక సిపిఎస్ఇ. ఈ కారణం గా ఎస్‌డిసిఎల్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఐపిజిఎల్ కూడాను ఒక సిపిఎస్ఇ గా అయిపోయింది. తత్ఫలితం గా, డిపిఇ యొక్క మార్గదర్శక సూత్రాలు సాంకేతికం గా ఐపిజిఎల్ కు వర్తిస్తాయి.
చాబహార్ ఓడ రేవు దేశాని కి చెందిన తొలి విదేశీ నౌకాశ్రయ పథకం గా ఉన్నది. ఇది వ్యూహాత్మక లక్ష్యాల తో కూడుకొన్నది. ఐపిజిఎల్ ను బోర్డు నిర్వహణ లోని ఒక కంపెనీ గా పని చేయడాన్ని కొనసాగించే విధం గా అనుమతించవలసిన తక్షణ ఆవశ్యకత ఏర్పడింది. దీనికిగాను డిపిఇ యొక్క మార్గదర్శక సూత్రాలు 5 సంవత్సరాల కాలం పాటు ఐపిజిఎల్ కు వర్తించకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు శిప్పింగ్ మంత్రిత్వ శాఖ ల ఆదేశాల ను పాటించవలసి ఉంది. తదనుగుణం గా, ఈ పథకం సాఫీ గా అమలు అయ్యేందుకు వీలు గా ఐపిజిఎల్ కు డిపిఇ మార్గదర్శకాల వర్తింపు నుండి మినహాయింపులు ఇవ్వాలంటూ శిప్పింగ్ మంత్రిత్వ శాఖ అభ్యర్ధించింది.
**
(Release ID: 1604470)
Visitor Counter : 187
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam