మంత్రిమండలి

భార‌త‌దేశాని కి మ‌రియు శ్రీ లంక కు మ‌ధ్య అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల ను ఆరంభించ‌డాని కి వీలు గా ఎలాయ‌న్స్ ఎయర్ విభజన కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 05 FEB 2020 1:45PM by PIB Hyderabad

భార‌త‌దేశాని కి మ‌రియు శ్రీ లంక కు మ‌ధ్య ఇంట‌ర్ నేశ‌న‌ల్ సెక్టార్స్ లో విమానాల రాక‌పోక‌ల కు గాను మెస్స‌ర్స్ ఎలాయ‌న్స్ ఎయ‌ర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో డిస్‌పెన్సేశ‌న్‌ కు తన ఆమోదాన్ని తెలిపింది.  మెసర్స్ ఎలాయ‌న్స్ ఎయ‌ర్ అనేది ఎయ‌ర్ ఇండియా యొక్క పూర్తి స్థాయి అనుబంధ సంస్థ‌ గా ఉన్నది.  మెసర్స్ ఎలాయ‌న్స్ ఎయ‌ర్ అతి తక్కువ లో అయితే 20 విమానాలు గాని, లేదా మొత్తం సామ‌ర్ధ్యం లో 20 శాతం విమానాలను గాని దేశీయ కార్యకలాపాల కోసం ఏది అధికం గా ఉంటే నియోగించేటంత వరకు, మ‌ధ్యంత‌ర కాలాని కి గాను ఒక విశేష విభజన కు అనుమ‌తించ‌డమైంది.

 

శ్రీ లంక తో భార‌త‌దేశం స‌న్నిహిత ద్వైపాక్షిక సంబంధాల ను క‌లిగివుంది.  అంతేకాక సంధానాన్ని పెంచ‌డంతో పాటు రెండు దేశాల ప్ర‌జ‌ల మధ్య సంబంధాల ను విస్త‌రించినట్లయితే దాని ద్వారా మ‌న కు మేలు ఒనగూరుతుంది.  ఈ ఆమోదాని క‌న్నా ముందు, బ‌ట్టిక‌లోవా మ‌రియు పాలాలీ విమానాశ్ర‌యాల నుండి ఎటువంటి వాణిజ్య త‌ర‌హా కార్య‌క‌లాపాలు చోటు చేసుకోలేదు.

**



(Release ID: 1602133) Visitor Counter : 170