ఆర్థిక మంత్రిత్వ శాఖ

పౌష్టికాహార పథకాల  కోసం రూ.35,600 కోట్ల కేటాయింపు

మహిళలు, శిశువులకు  పౌష్టికాహారం అందించేందుకు రూ.28,600 కోట్లు కేటాయింపు

 పాఠశాల స్థాయి ఉన్నత విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారు  

ఎస్సీలు, ఇతర వెనుకబడిన కులాలకు రూ.85 వేల కోట్లు కేటాయింపు

ఎస్టీల కోసం రూ.53, 700 కోట్లు కేటాయింపు

సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రూ.9,500 కోట్లు

ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయమై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

Posted On: 01 FEB 2020 2:27PM by PIB Hyderabad

సురక్షితమైన సమాజం ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ ,మహిళలు, శిశువులు, సంక్షేమం ప్రధానంగా  2020 -21 కేంద్ర బడ్జెట్ ని   కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  పార్లమెంటులో ప్రవేశపెట్టారు.


మహిళా, శిశు సంక్షేమం :

బేటీ బచావో బేటీ పఢావో గొప్ప విజయం సాధించిందని, ప్రాథమిక స్థాయి విద్యలో బాలుర(89. 28%) కంటే బాలికలే(94.32 %) ఐదు శాతం ఎక్కువ ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు.

2017 లో ప్రారంభమైన ''పోషణ్ అభియాన్ " గురించి ప్రస్తావిస్తూ   6 సంవత్సరాల లోపు పిల్లల పోషక స్థితి మెరుగుపరిచేందుకు పౌష్టికాహార పథకాల  కోసం రూ.35,600 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.

10 కోట్ల గృహాల పోషక స్థితిని తెలుసుకొనేందుకు ఆరు లక్షలమంది అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు అందించినట్లు తెలిపారు.

మహిళా సంక్షేమ పథకాలకు  రూ. 28,600 కోట్లు కేటాయింపు ,పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

ఎస్సీలు, ఇతర వెనుకబడిన కులాలకు రూ.85 వేల కోట్లు, ఎస్టీల కోసం రూ.53, 700 కోట్లు, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రూ.9,500 కోట్లు కేంద్ర బడ్జెట్ లో కేటాయించినట్లు మంత్రి తన ప్రసంగంలో తెలిపారు.

 

 

 

--



(Release ID: 1601623) Visitor Counter : 157