ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక సర్వేక్షణ 2019-20 లోని ముఖ్యాంశాలు

కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఆర్ధిక సర్వేక్షణ 2019-20 ని పార్లమెంటు కు ఈ రోజు న సమర్పించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం లోని ప్రధానమైన అంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

Posted On: 31 JAN 2020 1:27PM by PIB Hyderabad

సంపద సృష్టి: కనిపించని సహకారాని కి భరోసా యొక్క దన్ను దొరికింది

•        ఆర్థిక చరిత్ర లో నాలుగింట మూడు వంతుల కాలం లో ప్రపంచ ఆర్థిక శక్తి గా భారతదేశం యొక్క ఆధిపత్యం దీనిని చాటి చెప్తున్నది.

•        కౌటిల్యుని అర్థ శాస్త్రం లో ఏ ఆర్థిక వ్యవస్థ లో అయినా ధరల పాత్ర ను గురించి (స్పీగ్ లర్, 1971) సూచించడం జరిగింది.

•        చరిత్ర పరంగా చూసినప్పుడు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ భరోసా యొక్క దన్ను తో విపణి యొక్క కనిపించని సహకారం పట్ల విశ్వాసాన్ని పెట్టుకొంది:  

 విపణి తాలూకు అదృశ్య సహకారం ఆర్థిక లావాదేవీల బాహాటత్వం లో ప్రతిబింబించింది.

 భరోసా యొక్క దన్ను నైతిక మరియు తాత్విక పార్శ్వాల లో అగుపించింది.

·         సరళీకరణ అనంతరం భారతదేశం ఆర్థిక వ్యవస్థ మన సాంప్రదాయిక ఆలోచనల లో పీట ను వేసుకొన్న ఆర్థిక నమూనా తాలూకు స్తంభాలు రెండింటికి అవసరమైనటువంటి మద్దతు ను అందిస్తున్నది. 

·         ఈ సర్వేక్షణ మార్కెట్ యొక్క కనిపించని సహకారం యొక్క విస్తృత లాభాల ను గురించి వివరిస్తున్నది.

·         సరళీకరణ అనంతరం భారతదేశం యొక్క జిడిపి లోను, తలసరి జిడిపి లోను చెప్పుకోదగ్గ వృద్ధితో పాటు సంపద సృష్టి సైతం చోటు చేసుకొంటున్నది.

·         మూసివేత కు గురైన రంగాల తో పోల్చితే సరళీకరణ కు లోనైన లేదా తలుపులు తెరువబడినటువంటి రంగాల లో వృద్ధి అధికం గా ఉన్నట్లు సర్వేక్షణ లో సూచించడమైంది.

·         2011-13 మధ్య కాలం లో ఆర్థిక రంగం పనితీరు ను బట్టి చూస్తే, అదృశ్య సహకారానికి భరోసా యొక్క దన్నును అందించవలసిన అవసరం ఉన్నదని తెలుస్తున్నది.

·         5 ట్రిలియన్ డాలర్ విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థ గా ఆవిర్భవించాలన్న భారతదేశం యొక్క ఆకాంక్ష ఈ దిగువ న పేర్కొన్న అంశాల పై ముఖ్యం గా ఆధారపడి ఉంటుందని సర్వేక్షణ చెబుతున్నది:

 విపణి తాలూకు కనిపించని సహకారాన్ని బలోపేతం చేయడం.

·          కనిపించని సహకారాని కి భరోసా యొక్క తోడ్పాటు ను అందించడం.

·         వ్యాపార అనుకూల విధానాల ను ప్రోత్సహించడం ద్వారా అదృశ్య సహకారాన్ని బలపరచడం ద్వారా :

·         o        నూతన ఆగంతుకులకు సమాన అవకాశాల ను అందించడం.

·         o        న్యాయమైన పోటీ కి మరియు వ్యాపార సౌలభ్యాని కి వీలు ను కల్పించడం.

·         o        ప్రభుత్వ జోక్యం ద్వారా విపణి ని నిర్లక్ష్యం చేసే విధానాల ను సమాప్తం చేయడం.

·         o        ఉద్యోగాల కల్పనకై వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరచడం.

·         o        బ్యాంకింగ్ రంగాన్ని దక్షతపూర్వకమైన రీతి లో వర్ధిల్లజేయడం.

·         ప్రజలకు మంచి చేసేది గా విశ్వాసం అనే ఆలోచన ను పరిచయం చేసి, అది విస్తృత రీతిన ఉపయోగంలోకి వచ్చేటట్లు చూడటం.

·         డేటా ను మరియు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకొంటూ పారదర్శకత కు పెద్దపీట వేసి, విధానాలు సమర్ధంగా అమలయ్యేటట్లు చూడాలని సర్వేక్షణ సూచించింది.

 

అట్టడుగు స్థాయిలో నవ పారిశ్రామికత్వం మరియు సంపద యొక్క సృష్టి

·         ఉత్పాదకత వృద్ధి మరియు సంపద సృష్టి.. ఈ రెంటికీ ఉత్తేజాన్ని అందించే ఒక వ్యూహం గా నవపారిశ్రామికత్వం.

·         ప్రపంచ బ్యాంకు కథనం ప్రకారం నూతన సంస్థ ల సంఖ్య లో భారతదేశం మూడో స్థానం లో ఉంది.

·         2014వ సంవత్సరం నాటి నుండి భారతదేశం లో నూతన సంస్థ ల ఏర్పాటు నాటకీయమైన రీతి లో వృద్ధి చెందింది.

2006-2014 మధ్య కాలం లో ఫార్మల్ సెక్టర్ లో నూతన సంస్థ ల సంచిత వార్షిక వృద్ధి రేటు 3.8 శాతం గా ఉండగా, 2014-18 మధ్య కాలం లో ఇది 12.2 శాతం స్థాయి కి చేరింది.

2018వ సంవత్సరం లో దాదాపు 1.24 లక్షల నూతన సంస్థ లు ఏర్పాటు అయ్యాయి.  2014వ సంవత్సరం లో ఇటువంటి సంస్థ లు దాదాపు 70,000 గా ఉన్నాయి.  అంటే, దీనిలో 80 శాతం మేరకు పెరుగుదల ఉంది.

•        సర్వేక్షణ లో భారతదేశం లోని పాలన సంబంధిత పిరమిడ్ యొక్క అధోభాగం లో అంటే 500 కు పైగా జిల్లాల లో నవపారిశ్రామికత్వ కార్యకలాపాల చోదక శక్తుల ను పరిశీలించడమైంది.

•        సేవల రంగం లో నూతన సంస్థల స్థాపన అనేది తయారీ, మౌలిక సదుపాయాల కల్పన లేదా వ్యవసాయం రంగాల కన్నా, గణనీయ స్థాయి లో అధికం గా ఉన్నది.

•        అట్టడుగు స్థాయి లలో నవపారిశ్రామికత్వం అవసరాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే జరిగింది కాదని సర్వేక్షణ వెల్లడించింది.

•        ఏదైనా ఒక జిల్లా లో నూతన సంస్థ ల నమోదు లో 10 శాతం పెరుగుదల ఉంటే గనక స్థూల దేశీయ జిల్లా ఉత్పత్తి (జిడిడిపి)లో 1.8 శాతం వృద్ధి ఉంటుంది.

•        జిల్లా స్థాయి లో నవపారిశ్రామికత్వం అట్టడుగు స్థాయి లో సంపద కల్పన పై ఎనలేని ప్రభావాన్ని ప్రసరింప చేస్తుంది.

•        భారతదేశం లో నూతన సంస్థల అవతరణ విషమం గా ఉంది. ఇది వేరు వేరు జిల్లాల లో మరియు రంగాల లో విస్తరించివుంది.

•        ఒక జిల్లా లో సాక్షరత మరియు విద్య స్థానికం గా నవపారిశ్రామికత్వానికి ఎనలేని దన్ను ను అందిస్తాయి:

 అక్షరాస్యత 70 శాతాన్ని మించితే ఈ ప్రభావం విస్తృతం గా ఉంటుంది.

 భారతదేశం లోని తూర్పు ప్రాంతాల లో అక్షరాస్యత రేటు అత్యల్పం (2011 జన గణన ప్రకారం 59.6 శాతం) గా ఉన్నందువల్ల, నూతన సంస్థ ల ఏర్పాటు చాలా తక్కువ గా ఉంది.

•        ఏదైనా ఒక జిల్లా లో భౌతికమైన మౌలిక సదుపాయాల నాణ్యత అనేది నూతన సంస్థల స్థాపన ను గణనీయం గా ప్రభావితం చేస్తుంది.

•        కొత్త సంస్థ ఏర్పాటు కు మార్గాన్ని సుగమం చేయడం లో వ్యాపార నిర్వహణ తాలూకు సౌలభ్యం, మరియు సరళమైన శ్రామిక నిబంధనల ది ప్రముఖ పాత్ర. తయారీ రంగం లో అయితే ఇది మరీనూ.

•        వ్యాపార నిర్వహణ సంబంధిత సౌలభ్యాన్ని, అలాగే సరళతరమైన శ్రామిక చట్టాలను అమలుపరచడం వేగవంతం అయితే గనుక జిల్లాల లో తదనుగుణం గా రాష్ట్రాల లో గరిష్ట సంఖ్య లో ఉద్యోగాల ను కల్పించవచ్చు అంటూ సర్వేక్షణ సలహా ఇచ్చింది.

 

వ్యాపారానుకూలత మరియు విపణుల సానుకూలత

 

·         ఒక 5 ట్రిలియన్ డాలర్ విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థ గా అవతరించాలన్న భారతదేశం యొక్క ఆకాంక్ష ఈ క్రింద పేర్కొన్న అంశాల పై ఎంతోగానో ఆధారపడి ఉంటుందని సర్వేక్షణ పేర్కొంటోంది:

 ‘వ్యాపారనుకూల విధానాన్ని’ ప్రోత్సహిస్తే, అది సంపద ను సృష్టించడం కోసం స్పర్ధాత్మక విపణుల యొక్క శక్తి ని వెలికి తీస్తుంది.

 ‘ఆశ్రితుల కు అనుకూలం గా’ ఉండేటటువంటి విధానం నుండి దూరం గా మళ్ళడం.  దీని ద్వారా మరీ ముఖ్యం గా ప్రైవేటు స్వార్థాలను నెరవేర్చుకోవడానికి మద్దతు దొరికే ప్రమాదం పొంచి ఉంటుంది.

·         స్టాక్ మార్కెట్ దృష్టి తో చూసినప్పుడు సరళీకరణ అనంతర కాలం లో సృజనాత్మక వినాశం అనేది బాగా పెరిగింది: 

 సరళీకణ కు ముందు సెన్సెక్స్ లో భాగమైన ఏదైనా ఒక సంస్థ అందులో 60 సంవత్సరాల పాటు ఉండాలని ఆశపడగా అది సరళీకరణ అనంతరం కేవలం 12 సంవత్సరాలకు పరిమితం అయింది.

 ప్రతి అయిదు సంవత్సరాల కు సెన్సెక్స్ లో భాగమైన మూడింట ఒక వంతు సంస్థ లలో మార్పు చేర్పులు కానవచ్చాయి.  ఇది ఆర్థిక వ్యవస్థ లోకి నూతన సంస్థ లు, ఉత్పత్తులు మరియు సాంకేతికత ల నిరంతర ప్రవేశాని కి సూచిక గా ఉంది.

•        స్పర్ధాత్మక విపణుల కు చోటు కల్పించడం లో గొప్ప పురోగతి ఉన్నప్పటికీ, ఆశ్రిత వర్గాల కు అనుకూలమైన విధానాలు ఆర్థిక వ్యవస్థ యొక్క విలువ ను ధ్వంసం చేశాయి:

 సంధానిత సంస్థల ఎక్విటి ఇండెక్స్ 2007 నుండి 2010 మధ్యకాలం లో విపణి తో పోలిస్తే ఒక సంవత్సరానికి 7 శాతం మేరకు అధికం గా చక్కని పనితీరు ను కనబరచింది.  ఇది సామాన్య పౌరుల ప్రయోజనాల ను పణం గా పెట్టి అసామాన్య  లాభాలను ఆర్జించినట్లు సూచిస్తున్నది.

 దీనికి భిన్నం గా 2011 నుండి ఎక్విటీ ఇండెక్స్ ప్రదర్శన మార్కెట్ కన్నా 7.5 శాతం తక్కువ పనితీరు ను కనబరచింది.  ఇది అటువంటి సంస్థ ల దక్షత లేమి ని మరియు విలువ ను ధ్వంసం చేయడాన్ని ప్రతిబింబిస్తున్నది.

·                 2011 వరకు ప్రాకృతిక వనరుల ను విచక్షణ భరితం గా కేటాయించడం వంటి   ఆశ్రిత వర్గాల అనుకూల విధానాల వల్ల లబ్ధిదారులు కిరాయి ని కోరేందుకు దారి తీశాయి.  2014 అనంతర కాలం లో అవే వనరుల ను స్పర్ధాత్మక ప్రాతిపదిక న కేటాయించడం తో ఆ తరహా కిరాయి వసూళ్ళు ముగిశాయి.

·         అదే విధం గా ఆశ్రితుల కు రుణాల మంజూరు అనేది ఉద్దేశ్యపూరిత ఎగవేత కు దారితీసింది.  ప్రమోటర్లు బ్యాంకుల నుండి సంపద ను ఒక్కుమ్మడి గా ఊదేయడం జరిగింది.  ఇది గ్రామీణాభివృద్ధి కి ఉద్దేశించిన సబ్సిడీల ను చిన్నబుచ్చే స్థాయి లో నష్టాల కు దారి తీసింది.

విపణులను నిర్లక్ష్యం చేయడం:  ప్రభుత్వ జోక్యం సహాయం చేసేందుకు బదులు, మరింతగా గాయపరచిన సందర్భాలు

·         ప్రభుత్వ ప్రమేయం, అది సదుద్దేశ్యం తో కూడినదే అయినప్పటి కీ, తరచుగా విపణుల యొక్క సామర్ధ్యాన్ని బలహీన పరుస్తూ ఉంటుంది.  ఇది ఆశించిన పరిణామాల కు వ్యతిరేకమైనటువంటి పర్యవసానాల కు దారి తీస్తుంది.

·         కాలదోషం పట్టిన ప్రభుత్వ జోక్యాల కు సంబంధించి నాలుగు ఉదాహరణలు:

నిత్యావసర వస్తువుల చట్టం (ఇసిఎ), 1955:

ఇసిఎ పరిధి లో సరకుల పై తరచుగా మరియు ఊహకు అందని రీతి న ఒక్కుమ్మడి స్టాక్ పరిమితుల ను విధించడం వక్రత కు తావు ఇస్తుంది:

•  ప్రయివేటు రంగం ద్వారా నిల్వ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన కు ప్రోత్సాహకాలు.

 

• వ్యవసాయ విలువ శృంఖలం లో ఎగువ స్థాయి కి కదలిక.

•  వ్యవసాయ సరకులకు జాతీయ విపణి ని అభి వృద్ధిపరచడం.

 

 2006 మూడో త్రైమాసికం లో పప్పు పైన , 2009 ఒకటో త్రైమాసికం లో పంచదార పైన మరియు 2019వ సంవత్సరం సెప్టెంబర్ లో ఉల్లిపాయల పైన స్టాక్ పరిమితుల ను విధించడం ఉల్లిగడ్డ ల చిల్లర మరియు టోకు ధరల లో చాంచల్యాన్ని పెంచివేసింది.

ప్రస్తుతం భారతదేశం లో ఇసిఎ యొక్క ప్రాసంగికత ను గురించి వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తప్పక పరిశీలించాలి.

 

 దాడులు బాగా తక్కువ స్థాయి లో నేర నిరూపణ కు దారి తీస్తున్నందున, మరి అదే విధం గా ధరల పై ఎటువంటి ప్రభావం లేనందున ఇసిఎ అనేది కిరాయి ని కోరేందుకు, వేధించేందుకు మాత్రమే వీలు కల్పిస్తున్నట్లు గా తోస్తున్నది.

 ఈ కాల దోషం పట్టిన చట్టాన్ని తొలగించడానికి ఒక స్పష్టమైన సాక్ష్యం ఉన్నదని సర్వేక్షణ సూచిస్తున్నది.

2.   ఇసిఎ లో భాగంగా ఔషధ ధర నియంత్రణ

 డిపిసిఒ ద్వారా ఔషధాల ధరల నియంత్రణ నియంత్రిత ఔషధం ధర లో పెరుగుదల కు దారి తీసింది. 

చిల్లర దుకాణాల లో కన్నా ఆసుపత్రుల లో విక్రయించే మందులు చౌక రకాల తో పోలిస్తే, మరింత ఖరీదైన ఫార్ములేశన్ ల ధరల లో పెరుగుదల అధికం గా ఉంది.

 ఈ అంశాలు ఔషధాల ను తక్కువ ధర లో లభించేటట్లు చూడాలన్న డిపిసిఒ ధ్యేయానికి భిన్నమైన పర్యవసానాన్ని ఆవిష్కరించాయి.

 ఔషధాల భారీ కొనుగోలుదారు గా ఉన్న ప్రభుత్వం తన కొనుగోళ్ళు అన్నింటినీ కలిపివేసుకోవడం మరియు తన బేరమాడే శక్తి ని వినియోగించడం ద్వారా తక్కువ ధర ఔషధాల ను అందించడం కోసం మరింత సమర్ధం గా జోక్యం చేసుకొనేందుకు వీలు ఉంది.

 ప్రభుత్వం యొక్క బేరమాడే శక్తి ని ఒక పారదర్శకమైన పద్ధతి లో ఉపయోగించేటటువంటి, తప్పుదారి పట్టించడానికి వీలులేనటువంటి యంత్రాంగాన్ని ఆరోగ్యం మరియు కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తప్పక రూపొందించాలి.

ధాన్య విపణుల లో ప్రభుత్వ జోక్యం:

 ఆహార ధాన్యాల విపణుల లో విధానాలు ఈ కింది అంశాల కు దోహదం చేశాయి:

•  బియ్యం మరియు గోధుమల అతి పెద్ద కొనుగోలుదారుగాను మరియు నిల్వదారుగాను ప్రభుత్వం అవతరించింది.

•  ప్రైవేటు వ్యాపారం నుండి ప్రభుత్వం తప్పుకొన్నది.

•  ప్రభుత్వం పై ఆహార సబ్సిడీ భారం అంతకంతకు పెరుగుతోంది.

•  విపణుల లోని దక్షత లోపం దీర్ఘకాలం లో వ్యవసాయరంగ వృద్ధి పై ప్రభావాన్ని చూపుతున్నది.

 ఆహార ధాన్యాల సంబంధిత విధానం గతిశీలం గా ఉండాలి.  ఆహార ధాన్యాల ను నేరు గా పంపిణీ చేసే పద్ధతి నుండి నగదు బదిలీలు/ ఫూడ్ కూపన్ లు, స్మార్ట్ కార్డు ల విధానాని కి మారాలి.

రుణాల మాఫీ:

రాష్ట్రాలు/కేంద్రం ఇచ్చిన రుణ మాఫీల తాలూకు రుణ విశ్లేషణ:

•  పూర్తి స్థాయి లో రుణమాఫీ సౌకర్యాన్ని పొందినటువంటి లబ్ధిదారులు తక్కువ గా వినియోగించుకొంటూ, తక్కువ గా పొదుపు చేస్తూ, తక్కువ పెట్టుబడి పెడతారు. దీని తో పాక్షిక రూపం లో రుణ మాఫీ ని పొందిన లబ్ధిదారులతో పోలిస్తే వారి యొక్క ఉత్పాదన తక్కువగా ఉంటుంది.

• రుణ మాఫీ లు అనేవి రుణ మంజూరు సంస్కృతి ని ప్రభావితం చేస్తాయి.

•  అవి అదే రైతుల కు ఫార్మల్ క్రెడిట్ లభ్యత ను తగ్గిస్తాయి.  తద్వారా వాటి ఉద్దేశ్యమే దెబ్బతింటుంది.

o        సర్వేక్షణ యొక్క సలహాలు ఏమిటంటే:

 ప్రభుత్వం విపణుల లో అనవసరం గా జోక్యం చేసుకొనే రంగాల ను వ్యవస్థాత్మకంగా తప్పక పరిశీలించాలి; అయితే, ప్రభుత్వం యొక్క జోక్యం ఏ రకంగాను ఉండకూడదు అని ఇది వాదించడం లేదు.

 అంతకన్నా, ఆ యొక్క జోక్యాలు భిన్నమైనటువంటి ఆర్థిక వాతావరణం లో సరైనవని ఇది సూచిస్తున్నది. 

 

o అటువంటి సందర్భాల ను పరిహరించడం పెట్టుబడులు మరియు ఆర్థిక వృద్ధి.. ఈ రెంటినీ ప్రోత్సహించేటటువంటి స్పర్ధాత్మకమైన విపణులకు మార్గాన్ని సుగమం చేస్తుంది.

 

నెట్‌వ‌ర్క్ ప్రాడ‌క్ట్‌ ల‌పై ప్ర‌త్యేక‌ దృష్టి ద్వారా ఉపాధిక‌ల్ప‌న‌ప్ర‌గ‌తి సాధ‌న‌

•  చైనా లాంటిశ్రమతో కూడినఎగుమతి పథంలో సాగ‌డానికి భారతదేశానికి అపూర్వమైన అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

• “ప్రపంచం కోసం భారతదేశంలో అసంబిల్ చేయ‌డాన్ని” మేక్ ఇన్ ఇండియాగా స‌మీకృతం చేయ‌డం ద్వారా ఇండియా  వీటిని చేయవచ్చు:


o భార‌త‌దేశం త‌న ఎగుమతి మార్కెట్ వాటాను 2025 నాటికి 3.5% , 2030 నాటికి 6% కి పెంచవ‌చ్చు.


2025 నాటికి 4 కోట్లు, 2030 నాటికి 8 కోట్ల  మంచి ఉద్యోగాలు సృష్టించగ‌ల‌దు.

•      2025 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి అవసరమైన విలువలో నాలుగింట ఒక వంతును  నెట్‌వర్క్ ఉత్పత్తుల ఎగుమతులు అందించగలవు

•      ఈ అవకాశాన్ని పొందటానికి చైనా అనుస‌రించిన‌ వ్యూహాన్ని ఈ సర్వే సూచిస్తుంది:
-కార్మిక-ఇంటెన్సివ్ రంగాలలోముఖ్యంగా నెట్‌వర్క్ ఉత్పత్తులలో పెద్ద ఎత్తున స్పెషలైజేషన్.
నెట్‌వర్క్ ఉత్పత్తులలో పెద్ద ఎత్తున‌ కార్యకలాపాలను ప్రారంభించడంపై లేజర్ త‌ర‌హా దృష్టి ఉంచాలి.


o  ప్రధానంగా ధనిక దేశాల మార్కెట్లకు ఎగుమతి పై దృష్టిపెట్టాలి.

వాణిజ్య విధానం తప్పనిసరిగా ఆచ‌ర‌ణ‌సాధ్య‌మైన‌దిగా ఉండాలి.

 

·         మొత్తం వాణిజ్య సమతుల్యతపై భారతదేశ వాణిజ్య ఒప్పందాల ప్రభావాన్ని సర్వే విశ్లేషిస్తోంది.


o  భారతదేశం  ఎగుమతులు తయారీ ఉత్పత్తులకు సంబంధించి 13.4% కు,  మొత్తం సరుకుల విష‌యంలో 10.9% పెరిగాయి


o  తయారీ ఉత్పత్తుల విష‌యంలో దిగుమతులు 12.7% , మొత్తం వస్తువుల విష‌యంలో 8.6 శాతం పెరిగాయి.


o  తయారీ ఉత్పత్తుల విష‌యంలో భారతదేశం సంవత్సరానికి వాణిజ్య మిగులులో 0.7% పెరుగుద‌ల‌నుమొత్తం సరుకుల  విష‌యంలో సంవత్సరానికి 2.3%  పెరుగుద‌ల‌ను సాధించింది.


భారతదేశంలో  సులభతర   వాణిజ్యం భారతదేశంలో వ్యాపారం సులభతరం చేయడం


• ప్రపంచ బ్యాంక్ వారి డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో 2014 లో 142 గా ఉండ‌గా, 79 స్థానాలు పెరిగి 2019 లో  అది 63 కి చేరుకుంది.


• సుల‌భ‌త‌ర వ్యాపార ప్రారంభంఆస్తిని నమోదు చేయడంపన్నులు చెల్లించడంకాంట్రాక్టులను అమలు చేయడం వంటి వాటి ప్ర‌మాణాల విష‌యంలో భారతదేశం ఇప్పటికీ కొంత‌ వెనుకబడి ఉంది.


• సర్వేలో అనేక  కేస్ స్ట‌డీల ప్ర‌స్తావ‌న ఉంది:


వాణిజ్య ఎగుమతుల ను గ‌మ‌నిస్తేదిగుమతుల కోసం లాజిస్టిక్స్ ప్రక్రియ,  ఎగుమతుల కంటే సమర్థవంతంగా ఉంది.


బెంగళూరు విమానాశ్రయం ద్వారా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులుదిగుమతులను గ‌మ‌నిస్తేభారతీయ రవాణా ప్రక్రియలు ప్రపంచ స్థాయిలో ఎలా ఉంటాయో తెలియ‌జేస్తాయి..


•  భారతదేశంలో నౌకల టర్నరౌండ్ సమయం 2010-11లో 4.67 రోజులు ఉండ‌గా 2018-19లో ఇది  2.48 రోజులకు దాదాపు సగానికి త‌గ్గింది.


•    సులభతర వ్యాపారానికి  సూచనలు:


o  వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ,  పరోక్ష పన్నులు కస్టమ్స్ కేంద్ర బోర్డుషిప్పింగ్ మంత్రిత్వ శాఖవివిధ పోర్టు అధికారుల మధ్య సమన్వయం.
o  పర్యాటకం లేదా తయారీ వంటి వ్యక్తిగత రంగాలకు ప్రతి విభాగానికి నియంత్రణ  ప్రక్రియప‌ర‌మైన‌ అడ్డంకులను గుర్తించే మరింత ప్ర‌త్యేక దృష్టి  ఉండే విధానం అవసరం.


బ్యాంక్‌ల జాతీయ‌క‌ర‌ణ స్వ‌ర్ణోత్స‌వం - స‌మీక్ష‌


 •  2019   బ్యాంకుల‌జాతీయ‌క‌ర‌ణ స్వ‌ర్ణోత్స‌వ సంవ‌త్స‌రంగా స‌ర్వే అభివ‌ర్ణించింది.


•  ల‌క్ష‌లాది మంది ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సాధించిన విజ‌యాలుపి.ఎస్‌.బిల వాస్త‌విక స్థితిగ‌తుల అంచ‌నాల‌పై స‌ర్వే ప‌లు సూచ‌న‌లు చేసింది.



•   1969 నుంచి భార‌త బ్యాంకింగ్ రంగం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి సాధించిన‌దానికి అనుగుణంగా అభివృద్ధి చెంద‌లేదు.


•      అంత‌ర్జాతీయంగా ఉన్న‌త‌ స్థాయిలో ఉన్న 100 బ్యాంకుల జాబితాలో భార‌త‌దేశానికి చెందిన ఒకే ఒక బ్యాంకు ఉంది. భార‌త‌దేశ సైజుతో పోల్చిన‌పుడు ఫిన్‌లాండ్  సుమారు 1/11, డెన్ మార్క్ 1/8  ఉండ‌గా ఈ దేశాల స్థాయిలోనే ఉన్నాం.


• భారీ ఆర్థిక‌వ్య‌వ‌స్థ వృద్ధికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డానికి స‌మ‌ర్ధ‌వంత‌మైన బ్యాంకింగ్ రంగం అవ‌స‌రం.
•     ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మ‌ద్ద‌తు ప‌లికే బాధ్య‌త పి.ఎస్‌.బి ల‌పై ప‌డుతోంది. భార‌త బ్యాంకింగ్ రంగంలో 70 శాతం మార్కెట్ షేర్ పి.ఎస్‌.బి ల‌దిగా ఉంది.

    
o  పిఎస్‌బిలు వాటి పీర్ గ్రూప్‌ల‌తో పోల్చి చూసిన‌పుడు వాటి ప‌నితీరుకు సంబంధించిన ప్ర‌తి పెరామీట‌ర్‌లో స‌మ‌ర్ధ‌త‌లేమితో ఉన్నాయి.
o  2019లో  పిఎస్‌బిల‌లో పెట్టిన ప్ర‌తి రూపాయి పెట్టుబ‌డిపై స‌గ‌టున 23 పైస‌ల న‌ష్టం వాటిల్లింది. అదే ఎన్‌పిబిల‌లో 9.6 పైస‌ల లాభం వ‌చ్చింది.    
o  గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా పి.ఎస్‌.బి ల రుణ వృద్ధి ఎన్‌పిబి ల‌కంటే చాలా త‌క్కువ‌.


• పిఎస్‌బిల‌ను మ‌రింత స‌మ‌ర్థంగా తీర్చిదిద్ద‌డానికి సూచ‌న‌లు :


o  పిఎస్‌బి ఉద్యోగుల‌కు ఎంప్లాయీస్ స్టాక్ ఓన‌ర్‌షిప్ ప్లాన్ (ఇఎస్ఒపి) 
o  ఎంప్లాయీస్‌కు ఇన్‌సెంటివైజ్ చేయ‌డానికి  ఉద్యోగులకు గ‌ల బ్లాక్‌ల దామాషాలో వారికి బోర్డులో ప్రాతినిథ్యం క‌ల్పించిబ్యాంకులోని ఇత‌ర షేర్ హోల్డ‌ర్ల‌తో వారి ప్ర‌యోజ‌నాల‌ను మిళితం చేయ‌డం.


o  పిఎస్‌బి ల‌నుంచి డాటా స‌మీక‌ర‌ణ‌కు జిఎస్‌టిఎన్ త‌ర‌హా వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయ‌డంబిగ్ డాటా వంటి సాంకేతిక ప‌రిజ్ఞానాన్నికృత్రిమ మేధ‌స్సుమెషిన్ లెర్నింగ్ వంటి వాటిని రుణ నిర్ణ‌యాల‌లో వాడ‌డం ద్వారా పెద్ద రుణ‌గ్ర‌హీత‌ల విష‌యాన్ని మ‌రింత మెరుగ్గా ప‌రిశీలించ‌డానికి వీలు క‌ల్పించ‌డం.


  ఎన్‌.బి.ఎఫ్‌.సి రంగంలో ఆర్థిక బ‌ల‌హీన‌త‌


  ఈ రంగంలో ప్రస్తుతం నెల‌కొన్న‌ లిక్విడిటీ క్రంచ్  ప‌రిస్థితుల‌లోభారతదేశంలో షాడో బ్యాంకింగ్ వ్యవస్థ రోల్ ఓవ‌ర్‌ రిస్క్  ముఖ్య ,చోద‌కాల‌ను  సర్వే పరిశీలిస్తుంది.


  రోల్ ఓవ‌ర్ రిస్క్ కు కీల‌క చోద‌క‌శ‌క్తులు :


o  అసెట్ ల‌య‌బిలిటీ మేనేజ్‌మెంట్ (ఎఎల్ఎం ) రిస్క్‌


o  అనుసంధానిత రిస్క్‌


o   ఎన్‌.బి.సి ఫైనాన్షియ‌ల్‌ఆప‌రేటింగ్ రెసిలియ‌న్స్‌


o  స్వ‌ల్ప‌కాలిక హోల్‌సేల్ ఫండింగ్‌పై ఎక్కువగా ఆధార‌ప‌డ‌డం.


•   హెచ్ఎఫ్‌సిలురీటైల్ ఎన్‌బిఎఫ్‌సిల‌కు సంబంధించి రోల్ ఓవ‌ర్ రిస్క్ స్థాయికి సంబంధించి హెల్త్ స్కోర్ న‌మూనాను స‌ర్వే గ‌ణించింది.(ఆయా రంగాల‌కు సంబంధించి అవి న‌మూనాలు)
•      హెల్త్ స్కోర్ విశ్లేష‌ణ కింది అంశాల‌ను గుర్తించింది.


o  2014 త‌ర్వాత హెచ్‌.ఎఫ్‌.సి రంగం ప‌త‌నాన్ని సూచించింది. మొత్తం మీద ఈ రంగం  ప‌రిస్థితి 2019 ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నాటికి చెప్పుకోద‌గిన స్థాయిలో దిగ‌జారింది.


o   2014-19 కాలానికి సంబంధించి రిటైల్ ఎన్ బిఎఫ్‌సి రంగం స్కోరు స్థిరంగా ఉండ‌వ‌ల‌సిన స్థాయి కంటే త‌క్కువ‌లోనే ఉంది.


o   పెద్ద రిటైల్ ఎన్‌.బిఎఫ్‌సిలు ఎక్కువ హెల్త్ స్కోరు క‌లిగి ఉండగామ‌ధ్య‌త‌ర‌హాచిన్న రిటైల్ ఎన్‌బిఎఫ్‌సిలుమీడియం స్థాయి సంస్థ‌లు మొత్తం 2014-19 కాలంలో త‌క్కువ స్కోరు క‌లిగి ఉన్నాయి.


•     హెల్త్ స్కోరు రానున్న లిక్విడిటీ స‌మ‌స్య‌కు ముంద‌స్తు హెచ్చ‌రిక‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని స‌ర్వే తెలిపింది.


• ఈక్విటీ మార్కెట్ లు ఆయా హెచ్ ఎఫ్ సిలురిటైల్ ఎన్‌.బి.ఎఫ్‌.సిల హెల్త్ స్కోర్ పెంపుకోసం సానుకూలంగా స్పందిస్తాయి.


•        సర్వే ఈ విశ్లేషణను ఎన్‌బిఎఫ్‌సి రంగంలోని సంస్థలలో (వివిధ ఆరోగ్య స్కోర్‌లతో) సమర్ధవంతంగా కేటాయించటానికి సూచన‌లు ఇస్తుందితద్వారా మూలధన-సమర్థత‌ పద్ధతిలో ఆర్థిక బలహీనతను నిలువ‌రిస్తుంది.


ప్రైవేటీక‌ర‌ణ‌సంప‌ద సృష్టి


 • సర్వేభారత దేశ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్రైవేటీకరణ వ‌ల్ల స‌మ‌కూరిన‌ సమర్థతలాభాలను పరిశీలిస్తుంది. సిపిఎస్ఇ ల  పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌ను వేగ‌వంతం చేయ‌డాన్ని బలపరుస్తుంది.


• బిపిసిఎల్ లో ప్రభుత్వ వాటా 53.29 శాతం వ్యూహాత్మక ఉప‌సంహ‌ర‌ణ‌ వల్ల జాతీయ సంప‌ద వృద్ధి సుమారు రూ 33,000 కోట్లు అయింది.


•    1999-2000 నుండి 2003-04 వరకు వ్యూహాత్మక పెట్టుబడుల ఉప‌సంహ‌ర‌ణ‌ జ‌రిగిన‌ 11 సిపిఎస్‌ఇల  పనితీరునుపెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌కు ముందుఆ త‌ర్వాత ప్రాతిప‌దిక‌న‌ విశ్లేషణను సర్వే అందిస్తున్న‌ది:


o  ప్రైవేటీకరించిన సిపిఎస్‌ఇల నికర విలువనికర లాభంఆస్తులపై రాబడి (ROA), ఈక్విటీ (ROE) వంటి ఆర్థిక సూచికలు సగటున గణనీయంగా మెరుగుపడ్డాయి.


o  ప్రైవేటీకరించిన సిపిఎస్‌ఇలు ఒకే వనరుల నుండి ఎక్కువ సంపదను సృష్టించ‌గ‌లిగాయి.


 •     సిపిఎస్ఇ ల‌లో పెద్ద ఎత్తున పెట్టుబ‌డ‌లు ఉపసంహ‌ర‌ణ‌కు కింది కార‌ణాల‌తో స‌ర్వే సూచ‌న‌లు చేసింది.


o  అధిక లాభదాయ‌క‌త‌ను తీసుకురావ‌డానికి


o  స‌మ‌ర్ధ‌త పెంపున‌కు


o  పోటీత‌త్వం పెంపున‌కు.


o  ప్రొఫెష‌న‌లిజం ప్రోత్స‌హించ‌డానికి.


భారతదేశం జిడిపి వృద్ధి అధికంగా  పేర్కొన‌బ‌డి ఉందా?  లేదు.


 
 •  పెట్టుబడిదారులువిధాన నిర్ణేతలు నిర్ణయం తీసుకోవటానికి జిడిపి వృద్ధి కీలకమైన వేరియబుల్. అందువల్ల, 2011 లో సవరించిన అంచనా పద్దతిని అనుసరించి భారతదేశ జిడిపి అంచనాల‌ ఖచ్చితత్వం గురించి ఇటీవల జరిగిన చర్చ చాలా కీల‌క‌మైన‌ది.


• వివిధ దేశాలు గుర్తించిన‌గుర్తించ‌ని మార్గాల‌లో పోలిక‌ల విష‌యంలో విభేదిస్తున్నందున ఆయా దేశాల పోలిక ల విష‌యంలో ఇత‌ర కార‌కాల ప్ర‌భావాన్నివృద్ధి అంచ‌నాల పున‌ర్ విమ‌ర్శ ప్ర‌భావాన్ని వేరు చేయ‌డం ద్వారా దేశ వ్యాప్త పోలిక‌ల‌ను చేప‌ట్ట వ‌ల‌సి ఉంటుంది.


•  2011 తరువాత భారతదేశ జిడిపి వృద్ధిని 2.7% తప్పుగా అంచనా వేసిన మోడల్స్అదే కాలంలో జిడిపి వృద్ధిని శాంపిల్ లోని 95 దేశాల లో 51 దేశాలకు తప్పుగా అంచనా వేసింది.


•  యుకెజర్మనీ సింగపూర్ వంటి అనేక ఆధునిక ఆర్థిక వ్యవస్థలు వాటి జిడిపిలను అసంపూర్ణంగా పేర్కొన్న ఎకోనొమెట్రిక్ మోడల్‌తో తప్పుగా అంచనా వేశాయి.


•  స‌రైన నమూనాలు భారతదేశం లో లేదా ఇతర దేశాల లో వృద్ధిని తప్పుగా అంచనా వేయ‌బోవు.


• భారతీయ జిడిపి త‌ప్పుగా అంచ‌నా వేయ‌బడిందంటూ వ్య‌క్తం చేస్తున్న  ఆందోళనలకు ఎలాంటి గ‌ణాంకాల  ఆధారం లేదు.  అలాంటి ఆందోళ‌న‌లు నిరాధార‌మైన‌వి.

          .  
థాలినోమిక్స్: ది ఎకనామిక్స్ ఆఫ్ ఎ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా

 భారతదేశం అంతటా ఒక భోజ‌నం కోసం ఒక సాధారణ వ్యక్తి చెల్లించే మొత్తాన్ని లెక్కించే ప్రయత్నం.


  2015-16 నుండి  భోజ‌న ధరలలో మార్పు


 • 2015-16 త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా నాలుగు రీజియ‌న్ల‌లో శాకాహార భోజ‌న ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా ప‌డిపోతూ వ‌చ్చాయి. 2019-20లో మాత్రం ధ‌ర‌లలో పెరుగుద‌ల క‌నిపించింది.
•    2015-16 త‌ర్వాత‌ ధ‌ర‌ల మోడ‌రేష‌న్ కార‌ణంగా, వెజిటేరియ‌న్ భోజ‌నం విష‌యంలో స‌గ‌టు గృహ‌స్తు ఏడాదికి సుమారు రూ 11000 లు ల‌బ్ది పొందారు.


• రెండు నాన్ వెజిటేరియ‌న్ భోజ‌నాలు వినియోగించే స‌గ‌టు గృహస్తుకు అదే కాలంలోసంవ‌త్స‌రానికి సుమారు 12000 రూపాయల వ‌ర‌కూ ల‌బ్ధి చేకూరింది.


 2006-07 నుంచి 2019-20


•   శాకాహార భోజ‌న‌ స్థోమత 29% మెరుగుపడింది.


 • నాన్-వెజిటేరియన్ భోజ‌న స్థోమ‌త‌ 18% మెరుగుపడింది.


2019-20లో భారతదేశ ఆర్థిక పనితీరు


• 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్థంలో అంత‌ర్జాతీయ ఉత్పాదకతవాణిజ్యండిమాండ్ ల‌లో బలహీనమైన వాతావరణం కార‌ణంగా, భార‌త‌దేశ జిడిపి వృద్ధి 4.8 శాతానికి  మోడ‌రేట్‌ చేయ‌బ‌డింది.


•  2019-20 ఆర్థిక‌సంవ‌త్స‌రం  రెండ‌వ త్రైమాసికంలో వాస్త‌విక‌ వినియోగ వృద్ధి కోలుకుందిఇది ప్రభుత్వ తుది వినియోగంతో గణనీయమైన వృద్ధిని సాధించింది.


• 2019-20 ప్ర‌థమార్థంలో వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు’, ‘ప్రజా పరిపాలనరక్షణ  ఇతర సేవల’ వృద్ధి 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం ద్వితీయార్థం  కంటే ఎక్కువగా ఉంది.


 201 2019-20 ప్ర‌థ‌మార్థంలో భారతదేశ విదేశీరంగం మరింత స్థిరత్వాన్ని పొందింది:


• కరెంట్ ఖాతా లోటు (సిఎడి) 2018-20లో 2.1 శాతం నుండి 2019-20 ప్ర‌థ‌మార్థంలో జిడిపిలో 1.5% కు త‌గ్గించ‌బ‌డింది.


•  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ) ప‌రిస్థితి అద్భుతంగా ఉంది.


 •  పోర్ట్‌ ఫోలియో రాబ‌డి గ‌ణ‌నీయంగా ఉంది.


 •  విదేశీ మారక నిల్వలు స‌మ‌కూరాయి.


 • ముడిచ‌మురు ధరల సడలింపుతో, 2019-20 ప్ర‌థ‌మార్థంలో ఎగుమతులతో పోలిస్తే దిగుమతుల‌లొ త‌గ్గుద‌ల.


 • హెడ్ లైన్ ద్ర‌వ్యోల్బ‌ణం ఏడాది చివ‌రి నాటికి త‌గ్గే అవ‌కాశం :


•       ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం లో తాత్కాలిక పెరుగుద‌ల‌ తో  2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్థం లో 3.3 శాతం నుంచి  2019-20 డిసెంబ‌ర్ లో 7.35 శాతానికి పెరుగుద‌ల‌.

    
•    2019-20 లో సిపిఐ- కోర్టోకు ధ‌ర‌ల సూచీలో పెరుగుద‌ల డిమాండ్ ఒత్తిడి పెరుగుద‌ల‌ను సూచిస్తోంది.

    
•  జిడిపి వృద్ధిలో మంద‌గ‌మ‌నం చక్రీయ‌ చట్రంలో నుంచి జిడిపి వృద్ధిలో క్షీణతను అర్థం చేసుకోవచ్చు:
•    వాస్త‌విక రంగంపై ఆర్థిక రంగం ప్ర‌భావం చూపింది (ఇన్వెస్ట్ మెంట్‌- వృద్ధి- వినియోగం)


• 2019-20 ల‌లో పెట్టుబ‌డులువినియోగంఎగుమ‌తులు పెంచ‌డానికి సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డం జ‌రిగింది.


 • ఇన్‌సాల్వెన్సీబాంక్‌ర‌ప్ట‌సీ కోడ్ (ఐబిసి) కింద ఇన్‌సాల్వెన్సీ రిసల్యూష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డం జ‌రిగింది.


• తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎన్‌బిఎఫ్‌సిరియ‌ల్ ఎస్టేట్ రంగాల‌కు సుల‌భ‌త‌ర రుణ స‌దుపాయం.


 • నేష‌న‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ పైప్‌లైన్ 2019-2025 ప్ర‌క‌ట‌న‌.


•      2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం ద్వితీయార్థంలో జిడిపి వృద్ధి పుంజుకుంటుంద‌ని స‌ర్వే అంచ‌నా.
•       సిఎస్ఒ తొలి ముంద‌స్తు అంచ‌నాల ప్ర‌కారం 2019-20 ఆర్థిక సంవ‌త్సరం జిడిపి వృద్ధి అంచ‌నా 5 శాతం.


•      2020-21లో  ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లంగా పుంజుకోవ‌డానికి వీలుగా సంస్క‌ర‌ణ‌ల‌ను వేగ‌వంతంగా చేప‌ట్ట‌డం.

 

ఆర్ధిక పరిణామాలు

·         ఆర్ధిక సంవత్సరం  2019-20 మొదటి ఎనిమిది నెలల్లో గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చినప్పుడు  రెవెన్యూ వసూళ్లులో ఎంతో వృద్ధి జరిగింది.  పన్నేతర రెవెన్యూ వసూళ్లలో గణనీయమైన ప్రగతి సాధించడం వల్ల ఇది సాధ్యమైంది.

·         2019-20 సంవత్సరంలో (డిసెంబర్ 2019 వరకు) నెలవారీ జి ఎస్ టి వసూళ్లు మొత్తం ఐదు సార్లు నెలకు రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటాయి. 

·         ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పన్నుల విధింపునకు సంబంధించి నిర్మాణాత్మకమైన సవరణలు చేయడం జరిగింది.

·         కార్పొరేట్ పన్ను రేట్లలో మార్పులు

·         జి ఎస్ టి అమలును సులభతరం చేసేందుకు చర్యలు

·         రాష్ట్రాల ఆర్ధిక  లోటు ఎఫ్ ఆర్ బి ఎం చట్టం ప్రకారం నిర్దేశించిన లక్ష్యాల పరిధిలోనే ఉంది. 

·         ప్రభుత్వం (కేంద్రం మరియు రాష్ట్రాలు) ఆర్ధికంగా బలపడే మార్గంలో ముందుకు సాగుతున్నదని సర్వే పేర్కొన్నది.

 

విదేశీ రంగం

·        విదేశీ బకాయిల చెల్లింపు: 

  • చెల్లింపుల శేషం (బిఒపి)లో భారతదేశం యొక్క స్థితి మెరుగుపడింది. 2019 మార్చి చివరి నాటికి విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 412.9 అమెరికా డాలర్ల నుంచి 2019 సెప్టెంబర్ చివరి నాటికి 433.7 బిలియన్ అమెరికా డాలర్లకు పెరిగాయి. 
  • కరెంట్ ఖాతా లోటు 2018-19 ఆర్ధిక సంవత్సరంలో స్థూలదేశీయోత్పత్తి (జిడిపి)లో 2.1 శాతం గా ఉండగా అది  2019-20 ఆర్ధిక సంవత్సరం ప్రథమార్ధం లో జిడిపి లో 1.5 శాతానికి తగ్గింది. 
  • విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 10 జనవరి, 2020 నాటికి 461.2 బిలియన్ అమెరికా డాలర్లు గా ఉన్నాయి.
  • ప్రపంచ వాణిజ్యం :-
  • 2019లో విశ్వ ఉత్పాదనలో ప్రగతి 2.9 శాతం ఉండగలదని అంచనా. తదనుగుణంగా ప్రపంచ వాణిజ్యం కూడా దానితో జత కలిసే విధంగా 1.0% ప్రగతి సాధించవచ్చని అంచనా.  ప్రపంచ వాణిజ్యం 2017లో అత్యున్నత స్థాయి 5.7 శాతానికి చేరింది. 
  • అయితే, ప్రపంచ ఆర్ధిక క్రియాశీలత మరింత పుంజుకునే సూచనలున్నందున వాణిజ్య రంగం కోలుకొని 2020లో 2.9 శాతానికి చేరవచ్చని భావిస్తున్నారు.  
  • భారతదేశానికి వర్తకం ద్వారా లభించిన వ్యాపార వ్యత్యాసం 2009-14 మధ్యకాలంతో పోల్చినప్పుడు 2014-19 మధ్య కాలంలో బాగా పెరిగింది.  పరిశీలన లో ఉన్న రెండవ పంచవర్షలో ఎక్కువ మిగులు కనిపించడానికి ప్రధానంగా 2016-17లో ముడి చమురు ధరలు 50% కన్నా ఎక్కువ గా తగ్గడమే కారణం. 
  • భారతదేశం తో విదేశీ వాణిజ్యం జరుపుతున్న ఐదు ప్రధాన దేశాలు గా అమెరికా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా,  హాంకాంగ్ కొనసాగుతున్నాయి. 

 

·        ఎగుమతులు:

  • ఎక్కువ గా ఎగుమతి అయ్యే వస్తువులు:  పెట్రోలియం ఉత్పత్తులు,  రత్నాల వంటి విలువైన రాళ్ళు, ఔషధాల సూత్రీకరణ లు మరియు జీవ సంబంధమైన ప్రయోగాంశాలు,  బంగారం మరియు ఇతర విలువైన లోహాలు
  • 2019-20 (ఏప్రిల్ – నవంబర్) ఆర్ధిక సంవత్సరం లో భారత్ నుంచి ఎక్కువగా వరుస క్రమం లో   అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యు ఎస్ ఎ), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఎ ఇ), చైనా, హాంగ్ కాంగ్ లకు ఎగుమతులు జరిగాయి.     
  • స్థూలదేశీయోత్పత్తి కి వాణిజ్య ఎగుమతుల కు మధ్య ఉన్న నిష్పత్తి తగ్గడం వల్ల దాని ప్రతికూల ప్రభావం విదేశీ చెల్లింపుల శేషంపై పడింది.
  • ప్రపంచ ఉత్పాదన తగ్గిపోవడంతో దాని ప్రభావం పడి ఎగుమతులకు స్థూలదేశీయోత్పత్తికి మధ్య ఉన్న నిష్పత్తి ప్రధానంగా 2018-19తో పోల్చినప్పుడు 2019-20 సంవత్సరం ప్రధామార్ధంలో తగ్గిపోయింది. 
  • రెండు పంచ వర్షాలు పోల్చినప్పుడు పెట్రోలియమేతర  వస్తువుల ఎగుమతుల్లో వృద్ధి 2009-14తో పోల్చినప్పుడు 2014-19లో బాగా తగ్గిపోయింది.
  • దిగుమతులు
  • ఎక్కువగా దిగుమతయ్యే వస్తువులు:  ముడి పెట్రోలియం, బంగారం, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, కొక్  మరియు బ్రికెట్స్.
  • భారతదేశం అన్నిటికన్నా ఎక్కువగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. మనకు వరుసగా చైనా, అమెరికా, ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా నుంచి దిగుమతులు వస్తున్నాయి.
  • స్థూలదేశీయోత్పత్తికి వాణిజ్య దిగుమతులకు మధ్య ఉన్న నిష్పత్తి తగ్గడం వల్ల దాని సానుకూల ప్రభావం విదేశీ చెల్లింపుల శేషంపై పడింది. 
  • ముడిచమురు ధరలు పెరిగిన నేపధ్యంలో ముడి చమురు దిగుమతులు పెరగడం వల్ల దాని ప్రభావం భారతదేశం మొత్తం దిగుమతులపై పడింది.  ముడిచమురు ధరలు పెరిగితే మొత్తం దిగుమతులలో ముడిచమురు వాటా కూడా పెరుగుతుంది.  అంటే దిగుమతులకు స్థూలదేశీయోత్పత్తి కి మధ్య గల నిష్పత్తి కూడా పెరుగుతుంది.
  • ధరల పెరుగుదల కు తోడు గా బంగారం దిగుమతులు కూడా పెరిగినప్పుడు మొత్తం దిగుమతులలో బంగారం వాటా కూడా పెరుగుతుంది.  అయితే 2018-19తో పోల్చినప్పుడు 2019-20 ప్రథమార్ధంలో మొత్తం దిగుమతులలో బంగారం వాటాలో మార్పు లేదు.  ఎందుకంటే ధరలు పెరిగినప్పటికినీ దిగుమతి సుంకంలో పెరుగుదల వల్ల బంగారం దిగుమతులు కూడా తగ్గిపోయాయి.  
  • పెట్రోలియమేతర వస్తువులు, బంగారం దిగుమతుల తగ్గుదల స్థూలదేశీయోత్పత్తిలో వృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపింది.
  • పెట్రోలియమేతర – చమురేతర దిగుమతులు స్థూలదేశీయోత్పత్తిలో వృద్ధి ఎగసినందున దామాషాగా 2009-14 నుంచి 2014-19 మధ్య తగ్గిపోయాయి. 
  • దీనికి కారణం వృద్ధి వినియోగంతో ముడిపడి వుండటమే. మదుపు రేటు తగ్గడం వల్ల పెట్రోలియమేతర మరియు బంగారమేతర దిగుమతులు కూడా తగ్గిపోయాయి. 
  • మదుపు రేటులో ఎడతెగని తగ్గుదల వల్ల  స్థూలదేశీయోత్పత్తిలో  వృద్ధి తగ్గిపోయింది.  వినియోగం బలహీనమైంది, పెట్టుబడి దృక్పథం మందగించింది.  దానివల్ల స్థూలదేశీయోత్పత్తి మరింత దిగజారింది.  దాంతో పాటు 2018-19తో పోల్చినప్పుడు 2019-20 సంవత్సరం ప్రథమార్ధంలో జి డి పి దామాషాలో  పోల్చినప్పుడు పెట్రోలియమేతర మరియు బంగారమేతర దిగుమతులు తగ్గాయి. 
  • ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో వర్తక సౌలభ్యంపై వెలువరించిన నివేదిక “సరిహద్దులకు ఆవల వర్తకం” సూచిక ప్రకారం వర్తక సౌలభ్యంలో భారతదేశం 2016లో 143వ స్థానంలో ఉండగా 2019 నాటికి భారతదేశం ర్యాంకింగ్ ఎంతో మెరుగుపడి 68వ స్థానానికి ఎగబాకింది.
  • భారతదేశం లో లాజిస్టిక్స్ పరిశ్రమ ప్రస్తుతమున్న 160 బిలియన్ అమెరికా డాలర్ల నుంచి 2020 చివరినాటికి 215 బిలియన్ అమెరికా డాలర్లకు పెరుగగలదని అంచనా.
  • ప్రపంచ బ్యాంకు వెలువరించిన వ్యూహరచన పనితీరు సూచికలో భారతదేశం 2014లో 54వ స్థానం నుంచి  2018లో 44వ స్థానానికి ఎగబాకింది
  • నికరంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకడ 2019-20 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది. 2019-20 సంవత్సరం మొదటి 8 నెలల్లో 24.4 బిలియన్ల అమెరికా డాలర్ల పెట్టుబడులను రాబట్టారు. ఇది 2018-19 మొదటి 8 నెలలకన్నా ఎక్కువ. 
  • 2019-20 మొదటి 8 నెలల్లో భారత సెక్యూరిటీలలో ప్రవాస భారతీయులు పెట్టిన పెట్టుబడుల (విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు) విలువ 12.6 బిలియన్ల అమెరికా డాలర్లు. 
  • విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు 2019-20 ప్రథమార్ధంలో  పంపిన సొమ్ము (నికర బదిలీ) 38.4 బిలియన్ అమెరికా డాలర్లు.  ఇది క్రితం సంవత్సరం కన్నా 50% ఎక్కువ.
  • విదేశీ రుణాలు: 2019 సెప్టెంబర్ నాటికి విదేశీ రుణాలు తక్కువగా  స్థూలదేశీయోత్పత్తిలో 20.1%గా ఉన్నాయి. 2014-15 తరువాత గణనీయంగా తగ్గడం మొదలైన తరువాత భారతదేశం విదేశీ రుణాలకు  (అప్పులు మరియు ఈక్విటీ) స్థూలదేశీయోత్పత్తికి మధ్య ఉన్న నిష్పత్తి 2019 జూన్ చివరలో పెరిగింది. దీనికి ప్రధాన కారణం  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదల, పోర్ట్ ఫోలియో పెట్టుబడుల రాక,  విదేశీ వాణిజ్య రుణాలు (ఈ సి బి). 

ద్రవ్య నిర్వహణ మరియు ఆర్ధిక జోక్యం

·        2019-20లో  ద్రవ్య విధానం సర్ధుబాట్లకు అనుకూలంగా ఉంది.

  • మందగించిన వృద్ధి మరియు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం వల్ల వరుసగా నాలుగు ద్రవ్య విధానం కమిటీ సమావేశాలలో రేపో రేటును 110 బేసిస్ పాయింట్లు తగ్గించడం జరిగింది. అయితే 2019 డిసెంబరులో జరిగిన  ఐదవ సమావేశంలో దానిని మార్చకుండా ఉంచారు.
  • 2019-20 ఆర్ధిక సంవత్సరం మొదటి రెండు మాసాలలో నగదు చెలామణి చాలా ఇబ్బందికరంగా ఉండింది.   ఆ తరువాత అది సానుకూలంగా మారింది.
  • స్థూల నిరర్ధక అడ్వాన్సుల నిష్పత్తి:
  • ఇది 2019 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులలో ఎలాంటి మార్పు లేకుండా 9.3 శాతం గా ఉంది.
  • బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ (ఎన్ బి ఎఫ్ సి) లలో కొద్దిగా పెరిగింది.   2019 మార్చిలో 6.1% నుంచి 2019 సెప్టెంబర్ నాటికి 6.3%కి చేరింది.
  • రుణాల వృద్ధి: 
  • బ్యాంకుల, ఎన్ బి ఎఫ్ సిల రుణాల వృద్ధిలో తగ్గుదల వల్ల ఆర్ధిక వ్యవస్థలోకి ద్రవ్యరాకడ తగ్గిపోయింది. 
  • క్రితం సంవత్సరంతో పోలిస్తే బ్యాంకు రుణాల వృద్ధి 2019 ఏప్రిల్ నెలలో 12.9% ఉండగా డిసెంబర్ నాటికి 7.1 శాతానికి తగ్గిపోయింది. 
  • కాగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల పెట్టుబడికి సంకటాలను ఎదుర్కోవడానికి ఆస్తులకు మధ్య  నిష్పత్తి 2019 మార్చిలో 14.3% నుంచి సెప్టెంబరులో 15.1%కి పెరిగింది. 

ధరలు మరియు ద్రవ్యోల్బణం

·      ద్రవ్యోల్బణం తీరుతెన్నులు

  • 2014 నుంచి ద్రవ్యోల్బణం మితంగా ఉంటూ వస్తోంది
  • వినియోగ ధరల సూచీ (సి పి ఐ)తో ముడిపడిన ద్రవ్యోల్బణం 2018-19 (ఏప్రిల్-డిసెంబర్, 2018) ఆర్ధిక సంవత్సరంలో 3.7 శాతం నుంచి 2019-20 (ఏప్రిల్-డిసెంబర్, 2019) ఆర్ధిక సంవత్సరం  నాటికి 4.1 శాతానికి పెరిగింది. 
  • టోకు ధరల సూచీ 2018-19 (ఏప్రిల్-డిసెంబర్, 2018) ఆర్ధిక సంవత్సరంలో  4.7 నుంచి 2019-20 (ఏప్రిల్-డిసెంబర్, 2019) ఆర్హిక సంవత్సరం నాటికి 1.5 శాతానికి తగ్గిపోయింది.
  • వినియోగ ధరల సూచీతో ముడిపడిన ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే అంశాలు: 
  • 2018-19 సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా చిల్లర వస్తువులు ప్రభావితం చేశాయి. 2019-20 ఆర్ధిక సంవత్సరం (ఏప్రిల్ – డిసెంబరు)లో ఆహారం, పానీయాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు తోడ్పడ్డాయి. ఆహారం, పానీయాలలో విశేషంగా కూరగాయలు, కాయధాన్యాల ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.  దీనికి కారణం అకాల వర్షాల వల్ల ఉత్పత్తి తగ్గింది.
  • సాలెగూడును పోలిన కాయధాన్యాల ధరల చిక్కు:
  • రైతులు క్రితం మార్కెట్ సీజన్లో ధరల ఆధారంగా పంటలు విత్తుతుంటారు
  • రైతులను సంరక్షించేందుకు కనీస మద్దతు ధరల వ్యవస్థను సమర్ధవంతంగా అమలు చేసి సేకరణ జరపాలి
  • రిటైల్ మరియు టోకు ధరల మధ్య తేడా : 
  • నాలుగు మెట్రో నగరాలలో 2014 – 2019 మధ్య అత్యవసర సరుకుల ధరలలో తేడాలను కనుగొనడం జరిగింది.  అన్నిటికన్నా ఎక్కువగా ఉల్లి, టొమాటో వంటి కూరగాయల ధరల్లో తేడా చాలా ఎక్కువగా ఉంది.  దీనికి కారణం ఎక్కువమంది మధ్యవర్తులు ఉండటం లావాదేవీల ఖర్చు ఎక్కువగా ఉండటం కావచ్చు. 
  • ధరలు హెచ్చుతగ్గులు చంచలంగా ఉండటం
  • 2009-14 మధ్య కాలంతో పోల్చినప్పుడు 2014-19మధ్య కాలంలో అనేక నిత్యావసర ఆహార వస్తువుల,  కాయధాన్యాల ధరలు వాస్తవానికి తగ్గాయి. 
  • ఉత్తమ మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటు, నిల్వ సౌకర్యాల ఏర్పాటు, సంర్ధవంతమైన కనీస మద్దతు ధరల విధానం వల్ల ధరల్లో చంచలత్వం తగ్గడం గమనార్హం. 
  • ప్రాంతీయ వ్యత్యాసం: 
  • చాలా రాష్ట్రాలలో పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారుల ధరల సూచీతో ముడిపడిన ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది.
  • వివిధ రాష్ట్రాలను పోల్చినప్పుడు గ్రామీణ ద్రవ్యోల్బణంలో  వ్యత్యాసం ఎక్కువగా ఉంది.
  • ద్రవ్యోల్బణం కదలికలు: 
  • వినియోగదారుల ధరల సూచీ తో ముడిపడిన ద్రవ్యోల్బణం డేటాను 2012 నుంచి ప్రధాన ద్రవ్యోల్బణంతో కలిపి కూడటం జరుగుతోంది.

నిలకడైన అభివృద్ధి మరియు వాతావరణ మార్పులు

  • ఉత్తమంగా రూపొందించిన చర్యల ద్వారా నిలకడైన అభివృద్ధి లక్ష్యాల అమలు దిశగా భారతదేశం పయనిస్తోంది.
  • నిలకడైన అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారతదేశం సూచిక:

-      హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, చండీగడ్ ముందున్నాయి.

-      అస్సామ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ అభిలషణీయ వర్గంగా ఉన్నాయి. 

  • సి ఓ పి – 14కు భారతదేశం ఆతిద్యం ఇచ్చింది.  పర్యావరణం, అభివృద్ధి లక్ష్యాల సాధనకు భూమిపై పెట్టుబడి పెట్టడం ద్వారా అవకాశాల పెంపునకు సంబంధించిన డిల్లీ ప్రకటనను ఆమోదించారు.
  • సి ఓ పి – 25 మాడ్రిడ్ లో  జరిగింది: 
  • పారిస్ ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నామని భారతదేశం పునరుధ్ఘాటించింది. వాతావరణ మార్పుల తీవ్రతను తగ్గించడం, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ దిశలో కృషి చేయడానికి అభివృద్ధి చెందిన దేశాల తోడ్పడటానికి అవసరమైన యత్నాల వంటివి సి ఓ పి – 25 నిర్ణయాలలో కొన్ని. 
  • అడవులు మరియు హరిత ఛత్రం

-      దేశంలో  అడవుల విస్తీర్ణం పెంచడం ద్వారా 80.73 మిలియన్ హెక్టార్లకు పెంపు

-      దేశంలో  24.56 % భూభాగానికి పెంపు

  • వ్యవసాయ అవశేషాలను తగులబెట్టడం ద్వారా కాలుష్య స్థాయి పెరుగుతోంది.  గాలి నాణ్యత తగ్గిపోతోంది.  వివిధ రకాల ప్రయత్నాల వల్ల తగులబెట్టడం బాగా తగ్గిపోయింది.  అయినప్పటికీ ఇది ఇంకా ఆందోళన కలిగించే అంశమే. 
  • అంతర్జాతీయ సౌర కూటమి  (ఐ ఎస్ ఏ)

-      సభ్యత్వ దేశాల సంస్థాపరమైన చర్యల ద్వారా 30 సభ్యత్వాల కల్పన.  

-      భారతదేశం , ఫ్రాన్స్ రుణ సహాయంతో పనులకు ఉపక్రమించడమైంది. 

-      సౌర శక్తి వల్ల తలెత్తే సంకటాలను ఎదుర్కోవడానికి  స్థిరోష్ణ పేటికల ఏర్పాటు

-       1000 మెగావాట్ల సౌర శక్తి డిమాండును మరియు 2.7 లక్షల సౌరశక్తితో నడిచే నీటి పంపుల ఏర్పాటుకు అవసరమైన సాధనాల అభివృద్ది

 

 

 

 

వ్యవసాయం – ఆహార నిర్వహణ

• భారత జనాభాలో అత్యధికశాతం ఉపాధి అవకాశాల కోసం ఇతర రంగాలతో పోలిస్తే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం రంగంపైనే ఆధారపడతారు.
• అభివృద్ధి ప్రక్రియ సహజ ఫలితంలో భాగంగా వ్యవసాయేతర రంగాలోల సాపేక్షంగా అధిక వృద్ధి సామర్థ్యం పెరుగుతున్నందువల్ల దేశ మొత్తం స్థూల విలువ జోడింపు’ (GVA)లో వ్యవసాయందాని అనుబంధ రంగాల వాటా క్షీణత నిరంతరం కొనసాగుతోంది.
• వ్యవసాయంఅడవులుమత్స్య రంగాలు నుంచి 2019-20 ప్రాథమిక ధరలకు అనుగుణంగా జీవీఏ వృద్ధి 2.8 శాతం మేర పెరుగుతుందని అంచనా.
• వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం స్వల్పస్థాయికి మాత్రమే పరిమితమైనందున వ్యవసాయ ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. బ్రెజిల్(75%), చైనా (59.5%)లతో పోలిస్తే భారత వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం అత్యల్పంగా 40 శాతానికి మాత్రమే పరిమితమైంది.
• భారతదేశంలో ప్రాంతీయ వ్యవసాయ రుణ పరపతి అపసవ్య ధోరణి:
కొండ ప్రాంతతూర్పుఈశాన్య రాష్ట్రాల్లో స్వల్పస్థాయి రుణ పరపతి (మొత్తం వ్యవసాయ రుణ పంపిణీలో శాతంకన్నా తక్కువ).
• లక్షలాది గ్రామీణ కుటుంబాలకు పశుపోషణ రెండో ప్రధాన ఆదాయ వనరుగా మారింది:
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్య సాధనలో ఒక ప్రధాన పాత్ర
గత ఐదేళ్లుగా పశుసంవర్ధక రంగంలో 7.9శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి నమోదవుతోంది.
• ఆహార తయారీ పరిశ్రమ రంగం 2017-18తో ముగిసిన గత ఆరేళ్లుగా పురోగమిస్తోంది:
ఈ మేరకు సగటు వార్షిక వృద్ధి సుమారు 5.06 శాతంగా నమోదవుతూ వస్తోంది.
• స్థూల విలువ జోడింపు పరంగా 2011-12నాటి ధరల ప్రాతిపదికన 2017-18లో తయారీవ్యవసాయ రంగాల వాటాలో ఈ రంగం వాటా వరుసగా 8.83శాతం, 10.66 శాతంగా ఉంది.
• జనాభాలోని బలహీనవర్గాల ప్రయోజనాల పరిరక్షణ అవసరం కాగాఆహారభద్రతతోపాటు కార్యకలాపాల సుస్థిరతను ఆర్థిక సర్వే నొక్కిచెప్పింది:
నానాటికీ పెరిగిపోతున్న ఆహార రాయితీ భారాన్ని పరిష్కరించడం.
జాతీయ ఆహార భద్రత చట్టం ()నిర్దేశిత ధరలుఅమలుపై పునఃపరిశీలన.
పరిశ్రమలు – మౌలిక సదుపాయాలు
• పారిశ్రామిక ఉత్పాదకత సూచీ ప్రకారం 2018-19 (ఏప్రిల్-నవంబర్)లో మన పారిశ్రామిక రంగం 5.0 శాతం వృద్ధి నమోదు చేయగా 2019-20 (ఏప్రిల్-నవంబర్)లో కేవలం 0.6 శాతానికే పరిమితమైంది.
• అయితేఎరువుల రంగం 2018-19 (ఏప్రిల్-నవంబర్)లో (-) 1.3 శాతంతో మైనస్ వృద్ధి నమోదు కాగా, 2019-20 (ఏప్రిల్-నవంబర్)లో ఆ క్షీణతను అధిగమించడమేగాక ఏకం గా శాతం వృద్ధిని సాధించింది.
• అదేవిధంగా ఉక్కు రంగం 2018-19 (ఏప్రిల్-నవంబర్)లో 3.6 శాతం వృద్ధి నమోదు చేయగా, 2019-20 (ఏప్రిల్-నవంబర్)లో 5.2 శాతం వృద్ధిని సాధించింది.
• దేశంలో 2019 సెప్టెంబరు 30నాటికి టెలిఫోన్ కనెక్షన్ల సంఖ్య 119.43 కోట్లకు చేరింది.
• విద్యుదుత్పాదనకు సంబంధించి 2019 మార్చి 31నాటికి 3,56,100 మెగావాట్లుగా ఉన్న స్థాపిత సామర్థ్యం 2019 అక్టోబరు 31నాటికి 3,64,960 మెగావాట్ల స్థాయికి పెరిగింది.
• జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళికపై కార్యాచరణ బృందం 31.12.2019న విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2020-2025 మధ్య కాలానికిగాను దేశంలో మొత్తం రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించింది.
సేవల రంగం
• భారత ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది:
• ఆర్థిక వ్యవస్థ పరిమాణంస్థూల విలువ జోడింపు వృద్ధిపరంగా ఈ రంగం వాటా దాదాపు 55 శాతంగా ఉంది.
• దేశంలోకి ప్రవహించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో మూడింట రెండు వంతులుగా ఉంది.
• మొత్తం ఎగుమతులలో దీని వాటా సుమారు 38 శాతం.
• దేశంలోని 33 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకుగాను 15 రాష్ట్రాల్లో స్థూల విలువ జోడింపు 50 శాతానికిపైగా నమోదైంది.
•  వివిధ హై-ఫ్రీక్వెన్సీ సూచీలువిమాన ప్రయాణికుల రద్దీరేవులు-నౌకా రవాణా రద్దీ,  బ్యాంకు రుణ పరపతి తదితర రంగాల గణాంకాలు సూచిస్తున్న మేరకు 2019-20లో  సేవల రంగంలో స్థూల విలువలో వృద్ధి ఒక మోస్తరుగా నమోదైంది.
•  సేవల రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం రీత్యా 2019-20లో ఆశావహ వాతావరణం కనిపించింది.
సామాజిక మౌలిక వసతులుఉపాధి - మానవాభివృద్ధి
• సామాజిక సేవ (ఆరోగ్యంవిద్యఇతర) రంగాలలో కేంద్రరాష్ట్రాల వ్యయం 2014-15 మధ్య స్థూల దేశీయోత్పత్తిలో 6.2 శాతం కాగా, 2019-20లో 7.7 శాతానికి పెరిగింది (బడ్జెట్ అంచనాలు).
• మానవాభివృద్ధి సూచీ ప్రకారం 2017లో భారతదేశం  130వ స్థానంలో ఉండగా 2018లో 129వ స్థానానికి చేరుకుంది.
• మానవాభివృద్ధి సూచీపరంగా భారత్ 1.34 శాతం వార్షిక సగటు వృద్ధితో అత్యంత వేగంగా మెరుగుపడుతున్న దేశాల జాబితాలో స్థానం సంపాదించింది.
• అయితేమాధ్యమికమాధ్యమికోన్నతఉన్నతస్థాయి విద్యాభ్యాసానికి విద్యార్థుల స్థూల నమోదు శాతం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
• క్రమబద్ధ వేతనం/జీతం పొందే ఉద్యోగుల వాటా 2011-12లో 18 శాతం కాగాఅది ఐదు శాతం పెరిగి 2017-18లో 23 శాతానికి చేరింది.
• దేశవ్యాప్తంగా సుమారు 2.62 కోట్ల మేర కొత్త ఉద్యోగాల సృష్టితో ఈ విభాగంలో గణనీయ పెరుగుదల నమోదైంది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 1.39 కోట్లుగ్రామీణ ప్రాంతాల్లో 1.21 కోట్లు వంతున ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
• ఆధికారిక ఉపాధి కల్పనలో మొత్తం పెరుగుదల 2011-12లో శాతం కాగా, 2017-18 నాటికి అది 9.98 శాతానికి పెరిగింది.
• దేశంలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికశక్తి భాగస్వామ్యం క్షీణతవల్ల భారత కార్మిక విపణిలో లింగ వివక్ష విస్తృతమైంది:
• ఆ మహిళల్లో ఉత్పాదక వయోపరిమితి (15-59)కి లోబడిగల సుమారు 60 శాతం పూర్తికాలం ఇంటిపనుల్లో నిమగ్నం కావడమే ఇందుకు కారణం.
• ఆయుష్మాన్ భారత్మిశన్ ఇంద్రధనుష్ వంటి కార్యక్రమాలద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల లభ్యత మెరుగుపడింది.
• మిశన్ ఇంద్రధనుష్ కార్యక్రమం కింద దేశంలోని 680 జిల్లాల పరిధిలో 3.39 కోట్ల మంది పిల్లలకు, 87.18 లక్షల గర్భిణులకు టీకాలు ఇవ్వబడ్డాయి.
• పట్టణ ప్రాంతాల్లో సుమారు 96 శాతంగ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 76.7 శాతం కుటుంబాలకు పక్కా ఇళ్లు సమకూరాయి.
• పరిశుభ్రతపరంగా ప్రవర్తనాత్మక మార్పు సుస్థిరతసహా ఘనద్రవ వ్యర్థాల నిర్వహణను అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పదేళ్ల (2019-2029)పాటు అమలు చేసేలా గ్రామీణ పారిశుధ్య ప్రణాళిక’ ప్రారంభించబడింది.

*****



(Release ID: 1601396) Visitor Counter : 1203