ప్రధాన మంత్రి కార్యాలయం

“ప‌రీక్షాపే చ‌ర్చా 3.0” లో భాగం గా విద్యార్థులు, ఉపాధ్యాయులు మ‌రియు త‌ల్లితండ్రుల తో మాట్లాడిన‌ ప్ర‌ధాన మంత్రి

Posted On: 20 JAN 2020 3:22PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌రీక్షా పే చ‌ర్చా 3.0”లో భాగం గా విద్యార్థుల తో న్యూ ఢిల్లీ లోని తాల్ క‌టోరాస్టేడియ‌మ్ లో ఈ రోజు న   సంభాషించారు. ఈ కార్య‌క్ర‌మంలో 50 మంది దివ్యాంగ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. 90 నిమిషాల కు పైగా సాగిన ఈ ముఖాముఖి కార్య‌క్ర‌మం లో విద్యార్థులు వారికి ముఖ్య‌మైన‌టువంటి వేరు వేరు అంశాల పై ప్ర‌ధాన మంత్రి యొక్కమార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని పొంద‌గోరారు. ఈ సంవ‌త్స‌రం కూడా దేశం లోని అన్ని ప్రాంతాల కు చెందిన విద్యార్థుల తో పాటు విదేశాల లో ఉంటున్న భార‌తీయ విద్యార్థులు సైతం ఈ కార్య‌క్ర‌మం లో పాలు పంచుకొన్నారు.

 

ఆరంభం లో ప్ర‌ధాన మంత్రి విద్యార్థులంద‌రికీ ఒక స‌మృద్ధ‌మైన‌టువంటి నూత‌న సంవ‌త్స‌రం తాలూకు శుభాకాంక్ష‌ల ను మ‌రియు ఒక నూత‌న ద‌శాబ్దం తాలూకు శుభాకాంక్ష‌ల ను వ్య‌క్తం చేశారు. ఈ ద‌శాబ్దం యొక్క ప్రాముఖ్య‌ాన్ని గురించి ఆయ‌న వివ‌రిస్తూ, ప్ర‌స్తుత ద‌శాబ్ది తాలూకు ఆశ‌ లు మరియు ఆకాంక్ష‌ లు దేశం లోని పాఠ‌శాల విద్య సంబంధిత ఆఖ‌రి సంవ‌త్స‌రాల లో ప్ర‌వేశించిన పిల్ల‌ల భుజ‌స్కంధాల పైన ఉన్నాయ‌న్నారు.

 

‘‘దేశం ఈ ద‌శాబ్దం లో ఏమి చేసిన‌ప్ప‌టికీ కూడా 10వ‌, 11వ మ‌రియు 12వ త‌ర‌గ‌తుల విద్యార్థులు ప్ర‌స్తుతం ఒక అతి ఘ‌న‌మైన‌టువంటి పాత్ర ను పోషించ‌వ‌ల‌సి ఉన్నది. దేశం నూత‌న శిఖ‌రాల ను స‌మీపించాల‌న్నా, క్రొత్త ఆశ‌ల ను నెర‌వేర్చాల‌న్నా.. ఇది అంతా ఈ యొక్క నవ త‌రం మీద ఆధార‌ప‌డివుంది’’ అని ఆయ‌న అన్నారు.

ప్రధాన మంత్రి సంభాష‌ణ ను మొద‌లు పెట్ట‌డానిక‌న్నా ముందు తాను వివిధ కార్య‌క్ర‌మాల లో పాలు పంచుకోవ‌డం జ‌రుగుతూ ఉండేదే అయినప్ప‌టి కీ, త‌న హృద‌యాని కి చేరువ‌గా ఉన్న‌ ఒకే కార్య‌క్ర‌మం ప‌రీక్షా పే చ‌ర్చాయే అని పేర్కొన్నారు.

 

‘‘ప్ర‌ధాన మంత్రి గా ఉన్న వ్యక్తి కి అనేకానేక విధాలైనటువంటి కార్య‌క్ర‌మాల కు హాజ‌రు అయ్యే అవకాశం లభిస్తుంది. అటువంటి కార్య‌క్ర‌మాల లో ఎంతో నేర్చుకోవచ్చు.  ఆ యా కార్య‌క్ర‌మాల లో ప్ర‌తి ఒక్క‌టీ ఒక నూత‌న శ్రేణి అనుభ‌వాల ను ప్రసాదిస్తుంది. కానీ, ఎవరైనా మీ హృద‌యాన్ని మిక్కిలి గా స్ప‌ర్శించే ఒక కార్య‌క్ర‌మం ఏది అంటూ అడిగిన‌ట్ల‌యితే, అది ఈ ప‌రీక్షా పే చ‌ర్చాకార్యక్రమమే అని నేను అంటాను. హ్యాక‌థ‌న్ ల‌ కు హాజ‌రు కావడమన్నా నాకు ఇష్ట‌మే. అవి భార‌త‌దేశం యొక్క యువ‌త లోని ప్ర‌తిభ ను మ‌రియుశ‌క్తి ని చాటిచెప్తాయి’’ అని ఆయ‌న అన్నారు.

 

ప్రేర‌ణ ను కోల్పోవ‌డం మ‌రియు మ‌న‌సు ఊగిసలాట కు లోనవటాన్నిఅధిగ‌మించ‌డం:

 

 

చదువుకొనేటపుడు ఆసక్తి ని కోల్పోవటాన్ని గురించి ఒక విద్యార్థి అడిగిన ప్ర‌శ్న కు ప్ర‌ధాన మంత్రి జ‌వాబిస్తూ, విద్యార్థులు చాలా సంద‌ర్భాల లో వారికి సంబంధించ‌ని అంశాల కార‌ణం గా త‌ర‌చు గా ప్రేర‌ణ ను కోల్పోతూ ఉంటారు. అంతేకాక, వారు వారి యొక్క స్వీయ అంచ‌నాల కు మ‌రీ ఎక్కువ ప్రాముఖ్యాన్ని కట్టబెట్టే ప్ర‌య‌త్నం లో కూడా ఇది జ‌రుగుతూ ఉంటుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

ప్రేర‌ణ‌ ను కోల్పోవ‌డం, మ‌రి అలాగే ఆ స‌మ‌స్య ను ఏ విధం గా అధిగ‌మించాలి అనే అంశాల కు ఒక కారణాన్ని అన్వేషించవలసిందంటూ విద్యార్థుల కు ప్ర‌ధాన మంత్రి సూచించారు. ఇటీవ‌ల తాను ఇస్రో నుసంద‌ర్శించ‌టాన్ని మ‌రియు చంద్ర‌యాన్ ను గురించి ఆయ‌న ఉదాహ‌రించారు.

 

‘‘ప్రేర‌ణ, ప్రేర‌ణ‌ ను కోల్పోవ‌డం అనేవి చాలా సామాన్య‌మైన‌టువంటి విషయాలు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విధ‌మైన భావాల‌ కు లోన‌వుతారు. ఈ సంద‌ర్భం లో, నేను చంద్ర‌యాన్ వేళ ఇస్రో ను సంద‌ర్శించ‌డాన్ని, కఠోరంగా శ్రమించేటటువంటి మ‌న శాస్త్రవేత్త‌ల తో కాలాన్ని వెచ్చించ‌డాన్ని ఎన్న‌టికీ మ‌రచిపోలేను’’ అని ఆయ‌న అన్నారు.

 

‘‘మ‌నం వైఫ‌ల్యాల‌ ను ఓట‌ములు గానో, అడ్డంకులు గానో చూడ‌కూడ‌దు. మ‌నం జీవితం లోని ప్ర‌తి ఒక్క అంశాని కి ఉత్సాహాన్ని జోడించుకోవ‌చ్చును. ఒక తాత్కాలిక ప‌రాజ‌యానికి అర్థం మ‌నం జీవితం లో స‌ఫ‌లం కాలేము అని కాదు. నిజాని కి ఒక అప‌జ‌యం అనేది అత్యుత్త‌మ‌మైన‌ది ఇంకా ముందుందని సూచిస్తుంది. మ‌నంఒత్తిడి కి లోనైన‌టువంటి సంద‌ర్భాల ను ఒక ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కు చేర్చేట‌టువంటి సోపానాలు గా మ‌ల‌చుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి’’ అని ఆయ‌న వివ‌రించారు.

 

2001వ సంవ‌త్స‌రం లో ఆస్ట్రేలియా-భార‌త‌దేశం జ‌ట్ల మ‌ధ్య క్లిష్ట‌మైన ప‌రిస్థితుల లో భార‌త‌దేశ జ‌ట్టు ను ఓట‌మి అంచుల లో నుండి బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి, గెలుపు ను చేజిక్కించుకోవ‌డం కోసం క్రికెట‌ర్లు వి.వి.ఎస్‌. ల‌క్ష్మ‌ణ్‌, రాహుల్ ద్రావిడ్ లు బ్యాటింగ్ చేసిన తీరు ను కూడా ప్ర‌ధాన మంత్రి ఉదాహ‌రించారు.

 

అనిల్ కుంబ్లే త‌న‌కు గాయం అయిన‌ప్ప‌టికీ భార‌త‌దేశానికి ప్ర‌తిష్ట‌ను స‌మ‌కూర్చ‌డం కోసం ఏ విధం గా  బౌలింగు చేసిందీ ప్రధాన మంత్రి వివ‌రించారు.

 

‘‘ఇదీ స‌కారాత్మ‌క‌మైన ప్రేర‌ణ కు ఉండేట‌టువంటి శ‌క్తి’’ అని ఆయ‌న అన్నారు.

 

పాఠ్యప్రణాళికేత‌ర కార్య‌క‌లాపాల ను మ‌రియు విద్య ను స‌మ‌తూకం చేసుకోవ‌డం:

 

 

చ‌దువుల ను మ‌రియు పాఠ్యప్రణాళికేత‌ర కార్య‌క‌లాపాల ను ఏ విధం గా స‌మ‌తూకం చేసుకోవాలి అని అడిగిన ఒక ప్ర‌శ్న కు ప్ర‌ధాన మంత్రి స‌మాధాన‌మిస్తూ, ఒక విద్యార్థి యొక్క జీవితం లో చ‌దువు తో పాటే చేప‌ట్ట‌వ‌ల‌సిన ఇత‌ర కార్య‌క్ర‌మాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యం త‌క్కువ చేసి చూపించ‌లేనటువంటిది అన్నారు.

 

‘‘పాఠ్యప్రణాళికేత‌ర కార్య‌క‌లాపాలు అవ‌లంబించ‌కుండా ఉంటే అది ఒక విద్యార్థి ని ఒక మ‌ర‌ మ‌నిషి వ‌లే చేసివేయగలదు’’ అని ఆయ‌న అన్నారు.

 

విద్య ను మ‌రియు పాఠ్యప్రణాళికేత‌ర కార్య‌క‌లాపాల ను స‌మ‌తూకం చేసుకోవ‌డానికి విద్యార్థులు ఒక ఉత్త‌మ‌మైనటువంటి మ‌రియు అభిల‌ష‌ణీయ‌మైనటువంటి కాల పాల‌న ను ఆశ్ర‌యించ‌వ‌ల‌సి ఉంటుంది అని కూడా ఆయ‌న చెప్పారు.

 

‘‘ఇవాళ ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రి వాటిని యువ‌జ‌నులు  వినియోగించుకొంటార‌ని, ఒక అభిరుచి ని లేదా వారికి ఆస‌క్తి క‌లిగిన ఏదైనా ప‌ని ని చేప‌డుతూ త‌గిన అభినివేశం తో ముందంజ వేస్తార‌న్న ఆశ నాలో ఉంది’’ అని ఆయ‌న అన్నారు.

 

ఏమైనప్పటికీ త‌ల్లితండ్రులు వారి పిల్ల‌ల లోని బోధ‌నేత‌ర ఆసక్తుల ను ఒక డాబుస‌రి చేష్ట‌ గానో లేదా ఒక భుజ‌కీర్తి గానో చేసి వేయ‌కూడ‌ద‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు.

 

‘‘పిల్ల‌ల ఉద్వేగం అనేది త‌ల్లితండ్రుల‌ కు ఒక ఫ్యాశన్ స్టేట్‌మెంట్ గా మార‌డం అనేది మంచిది కాదు. పాఠ్యాంశాల కు అతీత‌మైన కార్య‌క‌లాపాలు ఆక‌ర్ష‌ణ ను సంత‌రించుకోవ‌ల‌సిన ప‌ని లేదు. ప్ర‌తి ఒక్క చిన్నారి ని అత‌డి కి లేదా ఆమె కు న‌చ్చిన పని ని చేయ‌నివ్వండి’’ అని ఆయ‌న చెప్పారు.

 

మార్కులే స‌ర్వం అనుకోవాలా?:

 

 

ప‌రీక్ష‌ల లో మార్కుల‌ ను ఎలా రాబ‌ట్టుకోవాలి? అవే నిగ్గు తేల్చే అంశామా? అంటూ వ‌చ్చిన ఒక ప్ర‌శ్న‌కు ప్ర‌ధాన మంత్రి ప్ర‌తిస్పందిస్తూ, ‘‘మ‌న విద్య వ్య‌వ‌స్థ వివిధ ప‌రీక్ష ల లో మ‌న ప్ర‌ద‌ర్శ‌న ఆధారం గా మ‌న విజ‌యాన్నినిర్ధారిస్తుంది. మ‌నం మంచి మార్కుల ను సాధించ‌డం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హిస్తూ ఉన్నప్ప‌టి కీ, మ‌న త‌ల్లితండ్రులు సైతం ఇదే అంశం పై నొక్కి ప‌లుకుతూ ఉంటారు’’ అని చెప్పారు.

 

ప్ర‌స్తుతం అనేక అవ‌కాశాలు ఉన్నాయి అని ఆయ‌న చెప్తూ, ప‌రీక్ష‌ల లో సాఫ‌ల్యం, లేదా వైఫ‌ల్యం ఒక్క‌టే స‌ర్వస్వం అనే భావ‌న నుండి బ‌య‌ట ప‌డ‌వ‌ల‌సింది గా విద్యార్థుల‌ ను కోరారు.

 

‘‘మార్కులే జీవితం కాదు. అదే మాదిరి గా ప‌రీక్ష మాత్ర‌మే మ‌న యావ‌జ్జీవితాన్నినిగ్గు తేల్చేట‌టువంటి అంశం కాదు. అది ఒక సోపానం. జీవితం లో ముఖ్య‌మైన‌టువంటి ఒకముంద‌ంజ. మార్కులే స‌ర్వం అని వారికి చెప్ప‌కండి అంటూ త‌ల్లితండ్రుల‌ ను నేను ప్రార్థిస్తున్నాను. అది జ‌ర‌గ‌క‌పోతే మీరు ప్రతిదీ కోల్పోయిన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌ వ‌ద్దు. మీరు ఏరంగానికి అయినా వెళ్ళ‌వ‌చ్చును. మీ ఎదుట బోలెడ‌న్ని అవ‌కాశాలు ఉన్నాయి’’ అని ఆయ‌న అన్నారు.

 

ప‌రీక్ష‌లు ముఖ్య‌మే, కానీ ప‌రీక్ష‌లే జీవితం కాదు. మీరు ఈ మ‌న‌స్త‌త్వం నుండి బ‌య‌ట‌కు రావాలి అని ఆయ‌న అన్నారు.

 

విద్య లో సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రాముఖ్యం :

 

 

సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రాముఖ్యం మ‌రియు విద్య లో దాని ఉపయోగం అనే అంశం పై అడిగిన ఒక ప్ర‌శ్న కు ప్ర‌ధాన మంత్రి జ‌వాబిస్తూ, సాంకేతిక విజ్ఞానం లో స‌రిక్రొత్త అంశాల ను అర్థం చేసుకోవలసింది గా విద్యార్థుల ను కోరారు. అలాగే, దాని ని దురుప‌యోగం చేసినందువ‌ల్ల దాపురించే ఆపద ల విష‌యం లో జాగ్ర‌త్త గా ఉండాల‌ని కూడా వారి కి ఆయ‌న విజ్ఞప్తి చేశారు. ‘‘సాంకేతిక విజ్ఞానం తాలూకు భ‌యం మంచిది కాదు. సాంకేతిక విజ్ఞానం అనేది ఒక నేస్తం వంటిది. సాంకేతిక విజ్ఞానం తాలూకు జ్ఞానం ఒక్క‌టే స‌రిపోదు. దాని ని వినియోగించ‌డం ముఖ్యం. సాంకేతిక విజ్ఞానం మ‌న నిత్య జీవితం లో ఒకభాగం. అయితే, మ‌నం దాని ని దుర్వినియోగ ప‌రిస్తే అది మ‌న విలువైన కాలాన్ని మ‌రియు వ‌న‌రుల ను హ‌రించి వేస్తుంది’’ అని ఆయ‌న అన్నారు.

 

హ‌క్కులు మ‌రియు బాధ్య‌త‌లు :

 

 

విద్యార్థుల యొక్క హ‌క్కులు ఏమిటి, అదే విధం గా పౌరుల ను వారి యొక్క బాధ్య‌త ల‌ను గుర్తించుకొనే విధం గా ఎలా చేయ‌గ‌లం? అనే ప్ర‌శ్న కు ప్ర‌ధాన మంత్రి జ‌వాబిస్తూ, ఒక వ్య‌క్తి యొక్క హ‌క్కులు అత‌డి బాధ్య‌త‌ల లో మిళితం అయి ఉన్నాయ‌ని చెప్పారు. ఒక ఉపాధ్యాయుడి ఉదాహ‌ర‌ణ ను ఆయ‌న పేర్కొంటూ, ఒక టీచ‌రు గ‌నుక త‌న విధుల ను నెర‌వేర్చేట‌పుడు విద్యార్థుల యొక్క హ‌క్కుల ను అత‌డు ఆచ‌రించిన‌ట్లే అని వివ‌రించారు.

 

జాతి పిత ఈ అంశం ప‌ట్ల వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ‘‘ప్రాథ‌మిక హ‌క్కులు అనేవి లేవు; కానీ, ప్రాథ‌మిక బాధ్య‌త‌లు మాత్రం ఉన్నాయని స్ప‌ష్టం చేశారు’’ అంటూ వివ‌రించారు.

 

‘‘ఇవాళ నేను 2047వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశ అభివృద్ధి లో ఒక కీల‌క‌మైన పాత్ర ను పోషించే విద్యార్థుల తో మాట్లాడుతున్నాను. 2047 వ సంవత్సరం అంటే అది స్వాతంత్య్రం సిద్ధించిన త‌రువాత మనం ఒక వంద సంవ‌త్స‌రాల మేర ప‌య‌నించే మైలురాయి. మ‌న రాజ్యాంగం లో ఉల్లేఖించిన ప్రాథమిక బాధ్య‌తల లో కొన్నిటి ప‌ట్ల ఈ త‌రం బాధ్య‌త వ‌హిస్తుంద‌ని నేను ఆశిస్తున్నాను’’ అని ఆయ‌న అన్నారు.

 

ఒత్తిడి ని త‌ట్టుకోవ‌డం ఎలాగా ? ఉపాధ్యాయులు మ‌రియు త‌ల్లితండ్రుల అంచ‌నాల ను అందుకోవ‌డం ఎలా? :

 

 

ఒత్తిడి ని త‌ట్టుకోవ‌డం మ‌రియు ఉపాధ్యాయుల, త‌ల్లితండ్రుల అంచ‌నాల ను అందుకోవ‌డం ఎలాగ? అనే అంశం పై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల ను ఒత్తిడి కి గురి చేయ‌వ‌ద్ద‌ని త‌ల్లితండ్రులను కోరారు. ‘‘వారిని ఒత్తిడి చేయ‌వ‌ద్దు, వారిని అనుసరించండి. పిల్ల‌ల లోప‌లి అంతఃశ‌క్తి ని వెలికి తీసే ప‌నుల‌ ను చేయ‌వ‌ల‌సింది గా వారి ని ప్రేరేపించండి’’ అని ప్ర‌ధాన మంత్రి సూచించారు.

 

చ‌ద‌వ‌డాని కి ఉత్త‌మ‌మైనటువంటి కాలం మ‌రియు బోర్డు ప‌రీక్ష‌ ల యొక్క భ‌యం నుండి బ‌య‌ట‌ప‌డ‌టం :

 

 

చ‌ద‌వ‌డానికి ఉత్త‌మ‌మైన కాలం ఏది? అన్న‌టువంటి ఒక ప్ర‌శ్న కు ప్ర‌ధాన మంత్రి బ‌దులిస్తూ, చదువుకోవ‌డం తో పాటు స‌రిప‌డా విశ్రాంతి అనేది కూడా ముఖ్య‌మైందే అంటూ స‌ల‌హా ఇచ్చారు. ‘‘ఉద‌యం పూట మస్తిష్కం తాజా గా ఉంటుంది. వాన వెలిసిన ఆకాశం మాదిరి గా, ఎవ‌రైనా వారికి సౌక‌ర్య‌వంతం గా ఉన్న‌టువంటి నియ‌మిత వేళ ను మాత్ర‌మే అనుస‌రించాలి’’ అని ఆయ‌న చెప్పారు.

 

ప‌రీక్ష‌ల కాలం లో హ‌ఠాత్తు గా ముడుచుకుపోవ‌డం అనే అంశాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించి, విద్యార్థులు వారి స‌న్నాహాల లో ప‌క్కా గా ఉండాల‌నిసూచించారు.

 

‘‘విద్యార్థులు వారి స్వీయ స‌న్నాహాల విష‌యం లో న‌మ్మ‌కం గా ఉండాల‌ని నేను కోరుతున్నాను.   ఏ విధమైనటువంటి ఒత్తిడి తోనూ ప‌రీక్షా మందిరం లోకి అడుగుపెట్ట‌వ‌ద్దు. ఇత‌రులు ఏం చేస్తున్నారు అని బెంగ పెట్టుకోవ‌ద్దు. మీ ప‌ట్ల మీరు న‌మ్మ‌కాన్ని కలిగివుండండి. మీరు ఏ విధం గా స‌న్న‌ద్ధులు అయిందీ అనే దాని మీద దృష్టి నిల‌పండి’’ అని ఆయ‌న అన్నారు.

 

భావి కెరియర్ తాలూకు ఐచ్ఛికాలు :

 

 

భ‌విష్య‌త్తు వృత్తి జీవ‌నం యొక్క ఐచ్ఛికాలు అనే అంశాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించి, విద్యార్థుల ను వారి మ‌న‌స్సు మాట విన‌వ‌ల‌సిందిగాను, అలాగే దేశం కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుప‌డేటటువంటి ఉత్సాహాన్ని పెంపొందించుకోవలసింది గాను  కోరారు.

 

‘‘కెరియ‌ర్ లు చాలా ముఖ్య‌మైన‌వి. ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక బాధ్య‌త ను స్వీక‌రించాలి. మ‌నం మ‌న యొక్క బాధ్య‌త‌ల ను నిర్వ‌ర్తిస్తూనేదేశాని కి మ‌న వంతు కృషి ని స‌దా అందించ‌వ‌చ్చును’’ అని ఆయ‌న అన్నారు.

 

ప్ర‌ధానమంత్రి తో సంభాష‌ణ కార్య‌క్ర‌మం ‘‘ప‌రీక్షా పే చ‌ర్చా 2020’’ యొక్క మూడో సంచిక కోసమ‌ని తొమ్మిదో త‌ర‌గ‌తి మొద‌లుకొని ప‌న్నెండో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ కు లఘు వ్యాసాల ర‌చ‌న లో ఆన్ లైన్ పోటీ ని ప్రారంభించారు. ఈ పోటీ కోసం www.mygov.in ద్వారా 2019వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 2వ తేదీ నుండి డిసెంబ‌ర్ 23వ తేదీ వ‌ర‌కు ఆన్ లైన్ లో ఎంట్రీల‌ ను ఆహ్వానించారు. 3 ల‌క్ష‌ల మంది కి పైగా బాల‌లు వారి పేర్ల ను న‌మోదు చేసుకొన్నారు. వారిలో 2.6 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ పోటీ లో పాల్గొన్నారు. 1.03 ల‌క్ష‌ల మంది విద్యార్థులు 2019వ సంవ‌త్స‌రం లో నిర్వ‌హించిన పోటీ లో పాల్గొన్నారు. ఎంపికైన విజేత‌లు ‘‘ప‌రీక్షపే చ‌ర్చా 2020’’కి హాజ‌రై, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో సంభాషించారు.

 

సిబిఎస్ఇమ‌రియు కెవిఎస్ విద్యార్థుల కు ప‌రీక్ష సంబంధిత అంశాల పై ఒక చిత్ర‌లేఖ‌న పోటీ ని మ‌రియు పోస్ట‌ర్ ను తీర్చిదిద్దే పోటీ ని నిర్వ‌హించ‌డ‌మైంది. దీనికి సుమారు 725 పోస్ట‌ర్ లు మ‌రియు పెయింటింగ్ లు అందాయి. వాటిలో దాదాపు 50 ఎంపిక‌య్యాయి. వాటిని ‘‘ప‌రీక్షాపే చ‌ర్చా 2020’’ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి స‌మ‌క్షం లో ప్ర‌ద‌ర్శ‌న కు ఉంచారు.

 

 

**



(Release ID: 1600048) Visitor Counter : 173