ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో సమావేశమైన యూరోపియ‌న్ హై రిప్ర‌జెంటేటివ్/ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్‌విపి)  శ్రీ జోసెఫ్ బోరెల్ ఫోంటెల్స్

Posted On: 17 JAN 2020 10:20PM by PIB Hyderabad

 
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో యూరోపియ‌న్ హై రిప్ర‌జెంటేటివ్/ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్‌విపి) శ్రీ జోసెఫ్ బోరెల్ ఫోంటెల్స్ ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు.  శ్రీ బోరెల్ రైసీనా డైలాగ్ 2020 లో పాలుపంచుకోవ‌డం కోసం జ‌న‌వ‌రి 16వ తేదీ నుండి జనవరి18 తేదీ ల  మ‌ధ్య భార‌త‌దేశ సంద‌ర్శ‌న కు విచ్చేశారు.   నిన్న‌టి రోజు న ఆ కార్య‌క్ర‌మం ముగింపు సభ ను ఉద్దేశించి శ్రీ బోరెల్ ప్రసంగించారు.  హెచ్ఆర్‌విపి హోదా లో 2019వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 1వ తేదీ న ప‌ద‌వీ బాధ్య‌త‌ల ను స్వీక‌రించిన అనంత‌రం శ్రీ బోరెల్ ఇయు కు వెలుపల జ‌రిపిన తొలి విదేశీ సంద‌ర్శ‌న ఇది.

ప్ర‌ధాన మంత్రి హెచ్ఆర్‌విపి శ్రీ బోరెల్ కు ఆప్యాయం గా స్వాగతం పలికారు.  హెచ్ఆర్‌విపి గా ప‌ద‌వీ బాధ్య‌త‌ల ను స్వీక‌రించడం పట్ల అభినందించారు.  శ్రీ బోరెల్ ప‌ద‌వీ కాలం స‌ఫ‌లం కావాలంటూ త‌న శుభాకాంక్ష‌ల ను వ్యక్తం చేశారు.  హెచ్ఆర్‌విపి క్ర‌మం త‌ప్ప‌క రైసీనా డైలాగ్ లో పాలు పంచుకొంటున్నందుకు కూడాను ఆయన ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.  

యూరోపియ‌న్ యూనియ‌న్ మ‌రియు భార‌త‌దేశం స్వాభావిక భాగ‌స్వాములు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  2020వ సంవ‌త్స‌రం మార్చి నెల‌ లో జరుగనున్న ఇండియా-ఇయు స‌మిట్ ఫ‌ల‌ప్ర‌దం కావాల‌ని తాను నిరీక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.  ఇయు తో అనుబంధాన్ని మ‌రీ ముఖ్యం గా వ్యాపారం, ఆర్థిక సంబంధాలు, జ‌ల‌ వాయు ప‌రివ‌ర్త‌న రంగాల లో గాఢ‌త‌రం చేసుకోవాల‌ని భార‌త‌దేశం వచనబద్ధురాలు అయిందని ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం లో పున‌రుద్ఘాటించారు.  యూరోపియ‌న్ క‌మిశ‌న్‌ మరియు యూరోపియ‌న్ కౌన్సిల్ నాయ‌క‌త్వం తో  తాను జ‌రిపిన ఇది వ‌ర‌కటి సంభాష‌ణ‌ ను కూడా ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.  

యూరోపియ‌న్ యూనియ‌న్ యొక్క నాయ‌క‌త్వం స‌మీప భ‌విష్య‌త్తు లో బ్రుసెల్స్ లో ఇండియా-ఇయు స‌మిట్ కు ఆతిథ్యం ఇవ్వడం పట్ల ఉత్సుక‌త తో వేచి ఉంద‌ని  ప్ర‌ధాన మంత్రి దృష్టి కి హెచ్ఆర్‌విపి శ్రీ బోరెల్ తీసుకు వ‌చ్చారు.  భార‌త‌దేశం మ‌రియు ఇయు ల మధ్య గల ప్ర‌జాస్వామ్యం, బ‌హుపక్షవాదం మ‌రియు నియ‌మాల పై ఆధార‌ప‌డిన‌టువంటి అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ వంటి ఉమ్మ‌డి ప్రాధాన్యాల‌ ను గురించి మ‌రియు వ‌చ‌నబ‌ద్ధ‌త‌ ను గురించి కూడా ఈ సంద‌ర్భం లో శ్రీ బోరెల్ ప్ర‌స్తావించారు.

**



(Release ID: 1600046) Visitor Counter : 109