ప్రధాన మంత్రి కార్యాలయం

‘‘పరీక్షా పే చర్చ 2020’’లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లితండ్రుల తో సంభాషించనున్న ప్రధాన మంత్రి

Posted On: 19 JAN 2020 11:06AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  ‘‘పరీక్షా పే చర్చ 2020’’ కార్యక్రమం లో భాగం గా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లితండ్రుల తో 2020వ సంవత్సరం జనవరి 20వ తేదీ న సంభాషించనున్నారు.  పాఠశాల విద్యార్థుల తో ప్రధాన మంత్రి సంభాషించే ‘‘పరీక్షా పే చర్చ 2020’’ కార్యక్రమం యొక్క మూడో భాగాన్ని న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో 2020వ సంవత్సరం జనవరి 20వ తేదీ నిర్వహించాలని ప్రతిపాదించడమైంది. ఈ కార్యక్రమాని కై  ఎంపిక చేసిన విద్యార్థుల తో వారు పరీక్షల తాలూకు ఒత్తిడి ని ఎలాగ అధిగమించబోతున్నారన్న అంశం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించనున్నారు.  వారు అడిగే ప్రశ్నల కు ఆయన సమాధానాల ను కూడా ఇవ్వనున్నారు. 

అనుపమానమైనటువంటి ఈ కార్యక్రమం లో కేవలం పాలుపంచుకోవడం తో సరిపెట్టుకోకుండా ప్రధాన మంత్రి వద్ద నుండి విలువైన చిట్కాల ను అందుకోవడం పట్ల కూడా విద్యార్థుల లో, ఉపాధ్యాయుల లో మరియు తల్లితండ్రుల లో బోలెడంత ఉత్తేజం మరియు ఉత్సాహం వ్యక్తమవుతోంది.  విద్యార్థులు ఒక ఆనందకర వాతావరణం లో పరీక్షలు వ్రాయాలని, వారు దీర్ఘ కాలం లో ఉత్తమ ఫలితాల ను పొందాలి అంటే పరీక్షలను ఒక పెద్ద భారం గా వారు భావించకుండా చూడాలని ప్రధాన మంత్రి ఉత్సుకత తో ఉన్నారు.
 
పాఠశాల విద్యార్థుల తో మరియు కళాశాల విద్యార్థుల తో ప్రధాన మంత్రి సంభాషణ కార్యక్రమమైన ‘‘పరీక్షా పే చర్చ 1.0’’ (ఒకటో సంచిక)ను న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో 2018వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ న నిర్వహించడమైంది.  ఇదే విధం గా రెండో సంచిక ను ‘‘పరీక్షా పే చర్చ 2.0’’ పేరు తో న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లోనే 2019వ సంవత్సరం జనవరి 29వ తేదీ న జరిపారు.



(Release ID: 1600044) Visitor Counter : 93