ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన ఆస్ట్రేలియా పూర్వ ప్ర‌ధాని శ్రీ టోనీ అబాట్

Posted On: 20 NOV 2019 9:34PM by PIB Hyderabad

ఆస్ట్రేలియా పూర్వ ప్ర‌ధాని శ్రీ టోనీ అబాట్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు.

ఆస్ట్రేలియా తూర్పు కోస్తా తీర ప్రాంతం వెంబడి అటవీప్రాంతాల లో ఇటీవ‌ల మంటలు చెలరేగి ప్రాణ‌ న‌ష్టం మ‌రియు ఆస్తి న‌ష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

శ్రీ టోనీ అబాట్ భార‌త‌దేశాని కి రావడం మరియు గురు నాన‌క్ దేవ్ జీ యొక్క ప్ర‌కాశ్ ప‌ర్వ్ తాలూకు 550వ జయంతి ని సందర్భం లో స్వ‌ర్ణ దేవాల‌యాన్ని సందర్శించడం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వెలిబుచ్చారు.

ప్ర‌ధాన మంత్రి 2014వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ లో బ్రిస్ బేన్ లో జరిగిన జి-20 స‌మిట్ ను పురస్కరించుకొని ఆస్ట్రేలియా ను తాను సంద‌ర్శించిన‌ సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు.  అప్ప‌ట్లో కేన్ బరా లోను, సిడ్ నీ లోను మ‌రియు మెల్‌బార్న్ లోను జరిగిన ద్వైపాక్షిక సమావేశాలను గురించి ప్రస్తావించారు.  ఆస్ట్రేలియా పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి తాను ప్ర‌సంగించిన విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొన్నారు. 
 
భార‌త‌దేశం-ఆస్ట్రేలియా సంబంధాల ను బలవత్తరపర‌చ‌డం లో శ్రీ టోనీ అబాట్ పోషించినటువంటి పాత్ర ను ప్ర‌ధాన మంత్రి ప్రశంసించారు.


**



(Release ID: 1592949) Visitor Counter : 141