మంత్రిమండలి

ఇంట‌ర్‌నేశ‌న‌ల్ ఫినాన్శల్ స‌ర్వీసెస్ సెంట‌ర్స్ ఆథారిటిస్ బిల్లు, 2019 ని రాజ్య స‌భ నుండి ఉప‌సంహ‌రించిన అనంత‌రం, లోక్ స‌భ లో ప్ర‌వేశ‌పెట్టేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

प्रविष्टि तिथि: 20 NOV 2019 10:36PM by PIB Hyderabad

ద ఇంట‌ర్‌నేశ‌న‌ల్ ఫినాన్శియ‌ల్ స‌ర్వీసెస్ సెంట‌ర్స్ ఆథారిటి బిల్లు, 2019 ని ఉప‌సంహ‌రించుకొనేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఈ రోజు న ఆమోదం తెలిపింది.  ఈ బిల్లు ను రాజ్య స‌భ లో 2019వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ న ప్ర‌వేశ‌పెట్టిన అనంతరం ఆ బిల్లు రాజ్య సభ లో పెండింగు లో ఉన్నది.   అయితే, ఇంట‌ర్‌నేశ‌న‌ల్ ఫినాన్శల్ స‌ర్వీసెస్ సెంట‌ర్స్ అథారిటీస్ బిల్లు, 2019 ని పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భం లో లోక్ స‌భ లో ప్ర‌వేశ‌పెట్టేందుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

లాభాలు

ప్ర‌స్తుతం ఐఎఫ్ఎస్‌సి లోని బ్యాంకింగ్, కేపిట‌ల్ మార్కెట్ లు మ‌రియు బీమా రంగాలు బ‌హుళ నియంత్రణ సంస్థ‌ లైన ఆర్‌బిఐ, ఎస్ఇబిఐ  మ‌రియు ఐఆర్‌డిఎఐ ల నియంత్రణ ప‌రిధి లో ఉన్నాయి.  ఐఎఫ్ఎస్‌సి ల లోని వ్యాపారం యొక్క గ‌తిశీల స్వ‌భావం రీత్యా ఉన్న‌త స్థాయి ప్రమాణాలు క‌లిగిన అంత‌ర్ నియంత్ర‌ణ సంబంధిత స‌మ‌న్వ‌యం అవసరపడుతుంది.  అంతేకాదు, దీని కి ప్ర‌స్తుతం ఐఎఫ్ఎస్‌సి ల‌ ఆర్థిక కార్యకలాపాలకు వ‌ర్తిస్తున్నటువంటి పాలక నియ‌మ నిబంధ‌న ల‌లో స్ప‌ష్టీక‌ర‌ణ లు, వివరణ లు మ‌రియు త‌ర‌చు గా స‌వ‌ర‌ణ లు కూడాను అవ‌స‌రమే.

ఐఎఫ్ఎస్‌సి ల‌లో ఆర్థిక ప‌ర‌మైన సేవ‌ ల మ‌రియు ఉత్ప‌త్తుల అభివృద్ధి అనేది స‌మ‌ర్ప‌ణ భావం తో కూడినటువంటి నియంత్ర‌ణ ప‌ర‌మైన జోక్యాల ను కోరుకొంటుంది.  ఈ కార‌ణం గా ఐఎఫ్ఎస్‌సి ల‌కు ఒక ఏకీకృత ఫినాన్శల్ రెగ్యులేట‌ర్ ఎంత‌యినా అవ‌సరం అని భావించ‌డమైంది.  దీని ద్వారా, భార‌త‌దేశం లో ఆర్థిక విప‌ణి లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల కు ప్ర‌పంచ శ్రేణి నియంత్ర‌ణ సంబంధిత వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌వ‌చ్చును.  

పైపెచ్చు, వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యం తాలూకు దృష్టి కోణం నుండి చూసినా ఇటువంటి ఏర్పాటు అత్యంత అవ‌స‌రం గా ఉన్నది.  భారతదేశం లో ఐఎఫ్ఎస్‌సి ని ప్ర‌పంచ ఉత్త‌మ అభ్యాసాల తో తుల‌ తూగే విధం గా  మ‌రింత‌ గా అభివృద్ధి ప‌ర‌చేందుకు కూడా ఏకీకృత ఆథారిటి  తోడ్ప‌డగలదు.

**


(रिलीज़ आईडी: 1592885) आगंतुक पटल : 111
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam