ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌స్తుత యుగం లో మ‌హాత్మ గాంధీ యొక్క సంద‌ర్భ శుద్ధి అనే అంశం పై ఇసిఒఎస్ఒసి చాంబ‌ర్స్ లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

Posted On: 25 SEP 2019 6:00PM by PIB Hyderabad

సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ శ్రీ ఎంటోనియో గుటెరజ్,

అధ్య‌క్షుడు శ్రీ మూన్‌,

ప్ర‌ధానులు శ్రీ‌యుతులు లీ, ఎండ్ర్యూ హాల్‌నెస్‌, లోటె శెరింగ్‌ ల‌తో పాటు ప్రధానులు శేఖ్ హసీనా గారు, ఆర్‌ డ‌ర్న్ గారు

ఎక్స్‌లెన్సీస్‌,

మిత్రులారా,

మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి సంద‌ర్భం గా ప్ర‌స్తుత యుగం లో ఆయ‌న యొక్క ఔచిత్యం అనే అంశాన్ని గురించి చ‌ర్చించడాని కి మ‌నమంతా ఈ రోజు న ఇక్క‌డ స‌మావేశ‌మ‌య్యాము.

ఇక్క‌డ కు విచ్చేసిన ప్ర‌ముఖ అతిథులు అంద‌రికీ ఇదే నా స్వాగ‌తం.

మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి ని పుర‌స్క‌రించుకొని ఒక స్మార‌క స్టాంపు ను జారీ చేసినందుకు ఐక్య రాజ్య స‌మితి కి నేను ప్ర‌త్యేకం గా ధ‌న్య‌వాదాల‌ ను తెలియ‌ జేస్తున్నాను.

గాంధీ గారు ఒక భార‌తీయుడు అయిన‌ప్ప‌టి కీ, ఆయ‌న ఒక్క భార‌త‌దేశాని కి మాత్రమే చెందిన వారు కాదు.  దీని కి ఈ నాటి ఈ వేదిక యే ఒక స‌జీవ నిద‌ర్శ‌నం గా ఉంది.  

పాల‌న యంత్రాంగం తో ఏ విధ‌మైన సంబంధమూ లేనటువంటి ఒక వ్య‌క్తి స‌త్యం, అహింస‌ ల యొక్క శ‌క్తి తో శతాబ్దాలు గా నడచిన సామ్రాజ్యాన్ని కుదిపివేయ‌డం ఒక్క‌టే కాక అనేక దేశ భ‌క్తుల లో స్వాతంత్ర్య స్ఫూర్తి ని స్థాపించ‌డం అనేది చ‌రిత్ర లో మ‌రెక్క‌డా కనిపించదు.  

అధికారాని కి ఎంతో దూరం గా ఉన్న‌ప్ప‌టి కీ కూడాను కోట్లాది ప్ర‌జ‌ల హృద‌యాల ను ఏలుతున్న‌టువంటి ఒక వ్య‌క్తి మ‌హాత్మ గాంధీ.  

వారి తో ఆయ‌న ఎన్న‌టికీ భేటీ కాకున్నా ప్ర‌జ‌లు ఆయ‌న జీవితం ద్వారా ఎంతగా ప్రభావితులు అయ్యారో మీరు ఊహించుకోగల‌రు.  మార్టిన్ లూథ‌ర్ కింగ్ జూనియ‌ర్ కావ‌చ్చు, లేదా నెల్స‌న్ మండేలా కావ‌చ్చు..  వారి యొక్క ఆలోచ‌న‌ల కు మూలం మ‌హాత్మ గాంధీ, అది గాంధీ యొక్క దార్శ‌నిక‌తే.

మిత్రులారా,

ఈ రోజు న ప్ర‌జాస్వామ్య నిర్వ‌చ‌నం ఒక ప‌రిమిత అర్థాన్ని మాత్ర‌మే క‌లిగివున్న‌ది.  అది ఏమిటంటే ప్ర‌జ‌లు వారి కి న‌చ్చిన ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోవాలి.  ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల అంచ‌నాల‌ కు అనుగుణం గా ప‌ని చేయాలి అనేదే.  అయితే, మ‌హాత్మ గాంధీ ప్ర‌జాస్వామ్యం యొక్క వాస్త‌విక శ‌క్తి ని స్ప‌ష్టీక‌రించారు.  ఆయ‌న ఎటువంటి దిశ‌ ను చూపారంటే, అది ప్ర‌జ‌లు ప‌రిపాల‌న పై ఆధారప‌డ‌కుండా స్వ‌ావలంబికులు కావాలి అనే దిశ.

మిత్రులారా,

భార‌తదేశ స్వాతంత్య్ర పోరాటం లో మ‌హాత్మ గాంధీ కేంద్ర బిందువు గా ఉన్నారు.  అయితే, గాంధీజీ ఒక స్వేచ్ఛాయుత‌మైన దేశం లో పుట్టి వుంటే, ఆయ‌న ఏం చేసేవారు?  అనేది మ‌నం ఒక్క క్ష‌ణ కాలం పాటు ఆలోచించాలి.  

ఆయ‌న స్వాతంత్య్ర పోరాటాన్ని చేశారు.  ఇది ముఖ్య‌మే.  అయితే, ఇదొక్క‌టే గాంధీజీ కృషి అని కాదు.

మ‌హాత్మ గాంధీ ప్ర‌భుత్వం పై ఆధార‌ప‌డ‌న‌టువంటి ఒక సామాజిక వ్య‌వ‌స్థ కు మార్గ‌ద‌ర్శి అయ్యారు.

మ‌హాత్మ గాంధీ మార్పు ను తీసుకు వ‌చ్చారు అనేది అందరికీ తెలిసిందే.  కానీ, ఆయ‌న ప్ర‌జ‌ల లోప‌లి అంతశ్శక్తి ని జాగృతం చేశారు.  మ‌రి మార్పు ను తీసుకు రావ‌డం కోసం వారి ని ఆయ‌న చైతన్యవంతులను చేశారున అని చెప్ప‌డం కూడా స‌మంజ‌స‌మే. 

స్వాతంత్య్ర పోరాటాని కి గాంధీ బాధ్యుడు కాక‌పోయిన‌ట్ల‌యితే, అప్ప‌టి కీ ఆయ‌న స్వ‌ావలంబన మ‌రియు స్వ‌రాజ్ ల తాలూకు మౌలిక సూత్రాల తో సాగిపోయే వారు.

భార‌త‌దేశం ఈ రోజు న ఎదుర్కొంటున్న పెను స‌వాళ్ళ‌ ను ప‌రిష్క‌రించే ఒక గొప్ప సాధ‌నం గా గాంధీజీ యొక్క దార్శ‌నిక‌త రూపుదాల్చుతోంది.

గ‌త 5 సంవ‌త్స‌రాల లో మేము ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాని కి ప్రాధాన్యాన్ని ఇచ్చాము.  అది స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ కావ‌చ్చు, డిజిట‌ల్ ఇండియా కావ‌చ్చు.. ఈ ప్ర‌చార ఉద్య‌మాల‌ ను ప్ర‌స్తుతం ముందు ఉండి న‌డిపిస్తోంది స్వ‌యం గా ప్ర‌జ‌లే.

మిత్రులారా,

మ‌హాత్మ గాంధీ చెప్పే వారు, త‌న జీవిత‌మే తాను ఇచ్చే సందేశం అని.  గాంధీజీ త‌న జీవితం ద్వారా ఒక ప్ర‌భావాన్ని క‌లుగ‌జేయాల‌ని ఎన్న‌డూ ప్ర‌య‌త్నించింది లేదు.  కానీ, ఆయ‌న జీవితం స్ఫూర్తి ని ఇచ్చేదిగా మారిపోయింది.  ఈ రోజు న మ‌నం ఎలా ప్ర‌భావితం చేయ‌గ‌లం అనే యుగం లో జీవిస్తున్నాము.  అయితే ఏ విధం గా స్ఫూర్తి ని ర‌గిలించాలి అనేదే గాంధీజీ యొక్క దార్శ‌నిక‌త  .  

ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల గాంధీజీ యొక్క విధేయ‌త తాలూకు శ‌క్తి ఏమిట‌నే దాని కి సంబంధించిన ఒక సంఘ‌ట‌న ను మీకు నేను చెప్ప‌ద‌ల‌చుకున్నాను.  కొన్నేళ్ళ క్రితం బ్రిట‌న్ లో మ‌హారాణి ఎలిజ‌బెత్ గారి తో నేను భేటీ అయిన‌ప్పుడు, ఆమె గొప్ప ఉద్వేగం తో ఒక రుమాలు ను నాకు చూపించారు.  అది ఖాదీతో చేసినటువంటి చేతి రుమాలు.  దాని ని ఆమె వివాహ స‌మ‌యం లో గాంధీ బ‌హుమ‌తి గా ఇచ్చార‌ట‌.

ఎవ‌రితో అయితే సిద్ధాంతాల విష‌య‌మై ఆయ‌న సంఘ‌ర్షించారో, మ‌రి ఆమె విష‌యం లో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన సున్నిత‌త్వం ఎంత‌టిదో ఒక్క‌సారి ఊహించండి.  త‌న‌కు వ్య‌తిరేకం గా ఉన్న వారిని, తాను ఎవ‌రితో అయితే స్వాతంత్య్ర స‌మ‌రాన్ని జ‌రుపుతున్నారో వారిని కూడా ఆయన గౌర‌వించారు, వారి శ్రేయాన్ని సైతం ఆయ‌న కోరుకొన్నారు.

మిత్రులారా,

సిద్ధాంతాల పట్ల ఇంత‌టి వ‌చ‌న బ‌ద్ధ‌త ను ప్ర‌ద‌ర్శించిన గాంధీజీ యొక్క శ్ర‌ద్ధ ఏ 7 వికృతుల ప‌ట్ల ఆక‌ర్షితం అయిందంటే, వాటి విష‌యం లో ప్ర‌తి ఒక్క‌రు జాగ‌రూక‌త వ‌హించాలి.  అవి- 

శ్ర‌మ కు తావు లేని సంప‌ద‌

ఆత్మసాక్షి లేని సంతోషం

చ‌రిత్ర లేన‌టువంటి జ్ఞానం

నైతిక‌త లేన‌టువంటి వ్యాపారం

మాన‌వీయ‌త‌ కు తావు లేన‌టువంటి విజ్ఞాన శాస్త్రం.

త్యాగాని కి చోటు లేని ధ‌ర్మం

సిద్ధాంతాని కి చోటు ఇవ్వని రాజ‌కీయాలూ ను.

అది జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న కావ‌చ్చు, లేదా ఉగ్ర‌వాదం కావ‌చ్చు, అవినీతి కావ‌చ్చు, లేదా స్వార్ధప‌ర‌త్వం తో కూడిన సామాజిక జీవ‌నం కావ‌చ్చు.. గాంధీజీ అనుస‌రించిన ఈ సిద్ధాంతాలు మాన‌వ జాతి ని ప‌రిర‌క్షించ‌డం కోసం ఒక మార్గ‌ద‌ర్శి వ‌లే ప‌ని చేస్తాయి.

గాంధీజీ చూపిన‌టువంటి ఈ మార్గం ఒక ఉత్త‌మ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించ‌డం లో ప్రేర‌ణ ను అందిస్తుందని నేను న‌మ్ముతున్నాను.

మాన‌వాళి తో గాంధీజీ యొక్క ఆలోచ‌న‌ల ప్ర‌వాహం కొన‌సాగినంత కాలం గాంధీజీ యొక్క స్ఫూర్తి మ‌రియు ఔచిత్యం సైతం మ‌న‌తో ఉండిపోతాయ‌ని నేను త‌లపోస్తున్నాను.

మ‌రొక్క‌ మారు మీ అందరికీ నేను నా కృత‌జ్ఞ‌త ను వ్య‌క్తం చేస్తున్నాను.

మీకు ఇవే నా ధ‌న్య‌వాదాలు.


**



(Release ID: 1586439) Visitor Counter : 139