ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్ డర్న్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
26 SEP 2019 6:00AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నాడు న్యూ యార్క్ లో జరుగుతున్న యుఎన్‌జిఎ సమావేశాల సందర్భం గా న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్ డర్న్ తో భేటీ అయ్యారు.
ఉభయ నేత లు ద్వైపాక్షిక సంబంధాల ను సమీక్షించడం తో పాటు రాజకీయాలు, ఆర్థికం, రక్షణ, భద్రత మరియు ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల ను పెంపొందించుకోవడం కోసం చేపట్టవలసిన చర్యల పై సైతం చర్చించారు. మనీలా లో 2017వ సంవత్సరం నవంబర్ లో వారు ఇరువురూ జరిపిన సమావేశాన్ని గురించి గుర్తు కు తెచ్చుకొంటూ, 2016వ సంవత్సరం అక్టోబర్ లో న్యూజీలాండ్ పూర్వ ప్రధాని భారతదేశాన్ని సందర్శించిన తరువాత ఏర్పాటైన నూతన సంస్థాగత యంత్రాంగాల
ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు వర్ధిల్లాయన్నారు. యుఎన్‌జిఎ సమావేశాల నేపథ్యం లో ‘‘సమకాలీన సమయం లో గాంధీ యొక్క ప్రాసంగికత’’ అనే అంశం పై 2019వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన ఏర్పాటైన కార్యక్రమం లో పాలు పంచుకోవాలంటూ పంపించిన ఆహ్వానాన్ని స్వీకరించినందుకుగాను ప్రధాని ఆర్ డర్న్ కు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.
‘‘ఇండియా 2022 – ఇన్ వెస్టింగ్ ఇన్ ది రిలేశన్ శిప్’’ పేరు తో తాను ఒక నూతన వ్యూహాత్మక పత్రాన్ని తీసుకు వచ్చినట్లు, ఇది న్యూజీలొండ్ ఇంక్. ఇండియా స్ట్రాటజీ 2011 యొక్క విస్తృత రూపం గా ఉన్నట్లు న్యూజీలాండ్ ప్రధాని ఈ సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి చెప్పారు. భారత మూలాలు కలిగిన వారు మరియు న్యూజీలాండ్ లో విద్య ను అభ్యసిస్తున్న విద్యార్థులు రెండు దేశాల నడుమ ముఖ్య సేతువు గా ఉన్నారని, వారు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాని కి గొప్ప తోడ్పాటు ను అందిస్తున్నారని ప్రధాని ఆర్ డర్న్ అన్నారు.
నేతలు ఉభయులూ అంతర్జాతీయ ఉగ్రవాదం సహా ఇరు పక్షాల హితం ముడిపడివున్న ప్రాంతీయ అంశాలను, అలాగే ప్రపంచ అంశాల ను గురించి చర్చించారు. ఈ విషయాల లో రెండు దేశాల కు ఒకే విధమైన అభిప్రాయాలు ఉండటాన్ని నేత లు ప్రశంసించారు. ఇరు దేశాలూ పుల్‌వామా, ఇంకా క్రైస్ట్ చర్చ్ లలో జరిగిన ఉగ్రవాద దాడుల ను తీవ్రం గా ఖండించాయి. ఈ ఘటనల అనంతరం ఒక పక్షానికి మరొక పక్షం మద్ధతు ను వ్యక్తం చేశాయి. క్రైస్ట్ చర్చ్ కాల్ ఆఫ్ యాక్శన్ పట్ల న్యూజీలాండ్ మరియు ఫ్రాన్స్ జమిలి గా నడుంకట్టి చేపట్టిన కార్యక్రమాన్ని కూడా భారతదేశం సమర్ధించింది.
**
(Release ID: 1586427)
Visitor Counter : 109