మంత్రిమండలి

ఇలెక్ట్రానిక్ సిగరెట్స్ నిషేధ ఆర్డినెన్స్ యొక్క జారీ కి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 18 SEP 2019 4:21PM by PIB Hyderabad

దేశం లో ఒక ప్రధానమైనటువంటి ఆరోగ్యాని కి మరియు శ్రేయస్సుకు సంబంధించిన కార్యక్రమం లో భాగం గా

ఇలెక్ట్రానిక్ సిగరెట్స్ యొక్క నిషేధం (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, విక్రయం, పంపిణీ, నిల్వ చేయడం మరియు ప్రకటన ల) ఆర్డినెన్స్, 2019 ని జారీ చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

 

ఇలెక్ట్రానిక్ సిగరెట్స్ బ్యాటరీ తో నడిపేందుకు వీలు ఉన్న సాధనాలు. ఇవి మండే సిగరెట్ లలో ఉండే ఒక వ్యసన పదార్థమైనటువంటి నికొటిన్ ను కలిగివున్న ఒక ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా గాలితుంపర (ఎయ్ రోసోల్)ను ఉత్పత్తి చేస్తాయి.  ఈ సాధనాల లో.. ఇలెక్ట్రానిక్ నికోటిన్ డిలివరీ సిస్టమ్స్ తాలూకు అన్ని రూపాలు, కాల్చడం కాక మండించే ఉత్పత్తులు (హీట్- నాట్- బర్న్ ప్రోడక్ట్ స్), ఇ-హుక్కా, ఇంకా అటువంటి  సాధనాలే.. చేరుతాయి.  ఈ నూతన ఉత్పత్తులు ఆకర్షణీయమైన రూపాల లోను, బహుళ రుచుల లోను వస్తున్నాయి.  వాటి వాడకం పెద్ద ఎత్తున అధికం అయింది.  అభివృద్ధి చెందిన దేశాల లో, ప్రత్యేకించి యువతీయువకుల లోను, చిన్న పిల్లల లోను ఇది తాత్కాలిక సాంక్రామిక రుగ్మత స్థాయి కి ప్రబలిపోయింది. 

 

అమలు:

 

ఈ ఆర్డినెన్స్ ను జారీ చేసినందువల్ల, ఇ-సిగరెట్స్ యొక్క ఉత్పత్తి, తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, ఎగుమతి చేయడం, రవాణా, విక్రయం, పంపిణీ, నిల్వ మరియు ప్రకటన లు చేయడం (ఆన్ లైన్ ప్రకటన లు సహా) కేసు పెట్టదగిన నేర కార్యకలాపాలు అవుతాయి.  ఈ విధమైన నేరాని కి తొలిసారి పాల్పడితే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా ఒక లక్ష రూపాయల వరకు జరిమానా లేదా ఈ రెంటి ని కూడా విధించేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ తరువాత కూడా ఇదే విధమైన నేరాల కు ఒడిగడితే గనక 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ను మరియు 5 లక్షల రూపాయల వరకు జరిమానా ను విధించవచ్చు.  ఇలెక్ట్రానిక్ సిగరెట్స్ ను నిల్వ చేయడం కూడా శిక్షార్హమే.  దీనికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 50,000 రూపాయల వరకు జరిమానా లేదా ఈ రెంటి ని కూడా విధించేందుకు ఆస్కారం ఉంటుంది.

 

ఆర్డినెన్స్ అమలు ప్రారంభం అయిన తేదీ నాటి కి ఇ-సిగరెట్స్ యజమానులు ఈ నిల్వల ను గురించి వారంతట వారు గా వెల్లడి చేయడం తో పాటు ఈ పదార్థాల నిల్వల ను సమీపంలోని పోలీస్ ఠాణా లో ఇచ్చేయాలి.  ఆర్డినెన్స్ అమలు చేసేందుకుగాను సబ్- ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ను ఆథరైజ్ డ్ ఆఫీసర్ గా నియమించడమైంది.  ఈ ఆర్డినెన్స్ యొక్క నిబంధనల ను అమలు లోకి తీసుకు రావడం కోసం కేంద్ర మరియు రాష్ట్రాల ప్రభుత్వాలు మరే ఇతర తత్సమాన అధికారి ని (అధికారుల ను) కూడా నియమించవచ్చు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/prohibitonone-cigarettes2(1)SD4J.jpg

ప్రధాన ప్రభావం:

 

-సిగరెట్స్ ను నిషేధించాలన్న నిర్ణయం జనాభా ను, ప్రత్యేకించి యువతీయువకులను మరియు చిన్న పిల్లల ను ఇ-సిగరెట్స్ యొక్క వ్యసనాని కి లోనయ్యే రిస్క్ నుండి కాపాడడం లో సహాయకారి కాగలదు.  పొగాకు నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కు ఈ ఆర్డినెన్స్ యొక్క అమలు పూరకం గా ఉండి, పొగాకు వినియోగాన్ని తగ్గించడం లో మరియు దీని తో సంబంధం కలిగివున్న ఆర్థిక భారాన్ని, రోగాల భారాన్ని కూడా తగ్గించగలుగుతుంది.

 

**


(Release ID: 1585491) Visitor Counter : 413