మంత్రిమండలి
బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కు ఉపయోగించుకొనేందుకు, అన్వేషణ లో పరస్పర సహకారాని కి భారతదేశం, బహ్రెయిన్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
31 JUL 2019 3:37PM by PIB Hyderabad
భారతదేశం, బహ్రెయిన్ ల మధ్య బాహ్య అంతరిక్షాన్నిశాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకొనేందుకు, అన్వేషణ లో పరస్పర సహకారాని కి వీలు గా అవగాహనపూర్వక ఒప్పందం పై సంతకాని కి సంబంధించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గాని కి వివరించడం జరిగింది.
ఇందుకు సంబంధించిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు)పై భారతదేశం 2019వ సంవత్సరం మార్చి నెల 11వ తేదీ న బెంగళూరు లో, బహ్రెయిన్ 2019వ సంవత్సరం మార్చి నెల 28వ తేదీ న మనామా లో సంతకాలు చేశాయి.
వివరాలు:
అంతరిక్ష విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, భూమి కి సంబంధించి రిమోట్ సెన్సింగ్ తో సహా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఉపగ్రహ కమ్యూనికేశన్, ఉపగ్రహ ఆధారిత నావిగేశన్, అంతరిక్ష విజ్ఞానం, గ్రహాలకు సంబంధించిన విశేషాల అన్వేషణ, అంతరిక్ష నౌక, అంతరిక్ష వ్యవస్థ, భూతల వ్యవస్థల వినియోగం, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటివి ఈ ఒప్పందం లో భాగం గా ఉన్నాయి.
ఈ ఒప్పందం ఒక సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు కు వీలు కల్పిస్తుంది. ఇందులో డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్ రో, బహ్రెయిన్ ప్రభుత్వాని కి చెందిన బహ్రెయిన్ నేశనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ (ఎన్ ఎస్ ఎస్‌ఎ) ల సభ్యులను చేర్చుకొంటారు. ఈ కార్యాచరణ బృందం ఈ ఒప్పందం లోని అంశాల అమలు కాలావధి, కార్యాచరణ, ఈ ఒప్పందాన్ని అమలు చేసే పద్ధతిని కూడా ఖరారు చేయనుంది.
అమలు వ్యూహం మరియు లక్ష్యాలు:
భారతదేశం, బహ్రెయిన్ ల మధ్య సంతకాలు జరిగిన ఈ ఎంఒయు, ప్రత్యేకంగా ఒప్పందం లోని అంశాల అమలు ఏర్పాటును ఖరారు చేయడానికి వీలు కల్పిస్తుంది. దీనికి తోడు సంయుక్త కార్యారచణ బృందం ఏర్పాటు కు, ఒక కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు పోవడానికి, తగిన కాలనియతి కి, ఎంఒయు లోని అంశాల అమలు కు దోహదపడుతుంది.
ప్రభావం:
ఇప్పటికే సంతకాలు జరిగిన ఈ ఒప్పందం భూమి కి సంబంధించి రిమోట్ సెన్సింగ్ రంగం లో నూతన పరిశోధనల ఆవిష్కరణ కు ఊతం ఇవ్వనుంది. అలాగే ఉపగ్రహ కమ్యూనికేశన్, ఉపగ్రహ మార్గనిర్దేశకత్వం, అంతరిక్ష విజ్ఞానం, బాహ్య అంతరిక్షం లలో అన్వేషణ కు కూడా ఇది ఉపకరిస్తుంది.
అయ్యే ఖర్చు:
ఈ అవగాహన ఒప్పందాని కి సంబంధించి ప్రతి ఒక్క కార్యకలాపం విషయం లో ఆర్థికపరమైన ఖర్చు ఆయా సంయుక్త కార్యకలాపాల ఆధారం గా ఉంటుంది. ఇది సంబంధిత కార్యకలాపం అమలు ఒప్పందాల లో లేదా ఏర్పాటు లేదా కాంట్రాక్టుల లో స్పష్టం గా నిర్దేశించడం జరుగుతుంది.
ప్రయోజనాలు:
కింగ్‌డమ్ ఆఫ్ బహ్రెయిన్ ప్రభుత్వం తో సహకారాని కి సంబంధించిన ఈ ఎంఒయు మానవాళి అభ్యున్నతి కి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అమలు రంగంలో సంయుక్త కార్యకలాపాలు చేపట్టడానికి వీలు కల్పిస్తుంది. దీని వల్ల దేశం లోని అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలు ప్రయోజనాల ను పొందుతాయి.
పూర్వరంగం:
బహ్రెయిన్ నేశనల్ స్పేస్ ఏజెన్సీ (ఎన్ ఎస్‌ఎస్‌ఎ) అధిపతి, బహ్రెయిన్ ట్రాన్స్‌పోర్టేశన్, టెలికమ్యూనికేశన్ మంత్రి అంతరిక్ష రంగం లో ఇస్రో తో పరస్పర సహకారాని కి ఆసక్తి ని కనబరుస్తూ 2018 ఏప్రిల్ లో భారత రాయబారి కి తెలియజేశారు.
దీనికి కొనసాగింపు గా 2018లో విదేశీ వ్యవహారాల శాఖ విజ్ఞప్తి మేరకు భారతదేశం- బహ్రెయిన్ అంతరిక్ష సహకారాని కి సంబంధించిన ఒక ముసాయిదా పత్రాన్ని రూపొందించి విదేశీ వ్యవహారాల శాఖ కు ఇవ్వడం జరిగింది. అనంతరం బహ్రెయిన్ దీని కి సానుకూలత తెలపడం తో ఇరు పక్షాలు అంగీకరించిన అంశాల తో ఒక పత్రాన్ని సంతకాల కు సిద్ధం చేయడం జరిగింది.
**
(Release ID: 1580939)
Visitor Counter : 191
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam