మంత్రిమండలి

నేశ‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైన‌ర్స్ హెల్త్ ను ఐసిఎంఆర్- నేశ‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేశ‌న‌ల్ హెల్త్ తో విలీనానికి / అమాల్గమేశన్ కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 24 JUL 2019 4:19PM by PIB Hyderabad

గ‌నుల మంత్రిత్వ శాఖ (ఎంఒఎం) పరిధి లో ఒక స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ గా ఉన్నటువంటి నేశ‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైన‌ర్స్ హెల్త్ (ఎన్ఐఎంహెచ్‌)ను ర‌ద్దు చేసి మ‌రియు దానిని అన్ని ఆస్తుల తో, అప్పుల తో ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ  (ఎంఒహెచ్ & ఎఫ్ డబ్ల్యు) కు చెందినటువంటి  ఎన్ఐఎంహెచ్‌  యొక్క ఐసిఎంఆర్- నేశ‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేశ‌న‌ల్ హెల్త్ (ఎన్ఐఒహెచ్‌)తో విలీనం చేయడానికి / అమాల్గమేశన్ కు; దీనితో పాటు ఎన్ఐఎంహెచ్ తాలూకు ఉద్యోగులంద‌రిని అదే పోస్టు / కేసు వారీ పే స్కేల్/ పోస్ట్ తో ఎన్ఐఒహెచ్ లో చేర్చుకోవడం తో పాటు వారి యొక్క వేత‌నాన్ని ప‌రిర‌క్షించ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  ర‌ద్దు కు దారి తీసేందుకు అవసరమైన చర్యల ను, అలాగే ఎన్ఐఒహెచ్ తో ఎన్ఐఎంహెచ్ యొక్క విలీనాని కి / అమాల్గమేశన్ కు తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌ ను ఎన్ఐఎంహెచ్‌, ఐసిఎంఆర్, ఎన్ఐఒహెచ్‌, ఎంఒఎమ్, ఇంకా డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ రిసర్చ్ (డిహెచ్ ఆర్), ఎంఒహెచ్ & ఎఫ్ డబ్ల్యు లు తీసుకొంటాయి.

ప్ర‌భావం:      

ఎన్ఐఒహెచ్ లో  ఎన్ఐఎంహెచ్ విలీనం / అమాల్గమేశన్ అనేది ప్ర‌జా ధ‌నాన్ని సమర్ధమైన రీతి లో నిర్వ‌హించ‌డం తో పాటు వృత్తి సంబంధ ఆరోగ్య రంగం లో ఉభ‌య సంస్థల కు వాటి వాటి ప్రావీణ్యాన్ని మ‌రింత వృద్ధిపరచుకోవడం లో ప్ర‌యోజ‌న‌కారి కాగ‌ల‌దు.

పూర్వ‌రంగం:

ఎన్ఐఎంహెచ్ ను భార‌త ప్ర‌భుత్వం 1990వ సంవ‌త్స‌రం లో ఏర్పాటు చేసింది.  దీని ని క‌ర్నాట‌క సొసైటీల న‌మోదు చ‌ట్టం, 1960 ప‌రిధి లో ఒక సొసైటీ గా న‌మోదు చేయ‌డ‌మైంది.  ఎన్ఐఎంహెచ్ యొక్క న‌మోదిత కార్యాల‌యం క‌ర్నాట‌క లోని కోలార్ గోల్డ్ ఫీల్డ్‌స్ లోను, కేంద్రీయ ప్ర‌యోగ శాల నాగ్‌ పుర్ లోను ఉన్న‌ాయి.  ఈ సంస్థ ఆక్యుపేశ‌న‌ల్ హెల్త్ అండ్‌ హైజీన్ లో అప్ల‌య్‌ డ్ రిస‌ర్చ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.  అంతేకాక, గ‌నుల త‌వ్వ‌కం మ‌రియు ఖ‌నిజాధారిత ప‌రిశ్ర‌మ కు అవ‌స‌ర‌మైన సాంకేతిక మ‌ద్ధ‌తు సంబంధ సేవ‌ల‌ ను స‌మ‌కూర్చ‌డం లో ఈ సంస్థ ది అందె వేసిన చేయి గా ఉంది.  అభివృద్ధి మ‌రియు ప‌రిశోధ‌న ద్వారా గ‌నుల త‌వ్వ‌కం ప్ర‌క్రియ భ‌ద్రం గా ఉండేట‌ట్లు ఈ సంస్థ పాటు ప‌డుతున్న‌ది.  

కాగా, ఎన్ఐఒహెచ్ ప్ర‌త్యేకం గా శ్ర‌ద్ధ వ‌హిస్తున్న‌టువంటి రంగాల లో ఆక్యుపేశ‌న‌ల్ హైజీన్ మ‌రియు ఆక్యుపేశ‌న‌ల్ మెడిసిన్ ల‌తో స‌హా ఆక్యుపేశ‌న‌ల్ హెల్త్ కు సంబంధించిన అనేక రంగాలు క‌ల‌సి ఉన్నాయి.  స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌ల ప‌ని తీరు ను, ప్ర‌ద‌ర్శ‌న‌ ను స‌మీక్షించిన వ్య‌య నిర్వ‌హ‌ణ సంఘం (ఇఎంసి) ఇత‌ర అంశాల తో పాటు, ‘‘ఒకే విధ‌మైన‌టువంటి ల‌క్ష్యాలు క‌లిగిన సంస్థ‌ల ను వాటి కార్య‌క‌లాపాల లో సమ‌న్వ‌యాన్ని ప్రోత్స‌హించేందుకు, అలాగే ఖ‌ర్చు ను త‌గ్గించేందుకు వాటి విలీనాన్ని ప‌రిశీలించాలి’’ అంటూ సిఫారసు చేసింది.  దీని కి అనుగుణం గానే, ఎన్ఐఎంహెచ్ ను ఎన్ఐఒహెచ్ తో విలీన‌ ప‌ర‌చాల‌ని కూడా సిఫారసు చేసింది.

**



(Release ID: 1580165) Visitor Counter : 114