మంత్రిమండలి

ప‌దిహేనో ఆర్థిక సంఘం యొక్క ఉల్లేఖన నిబంధనల లో స‌వ‌ర‌ణ కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

అంత‌ర్గ‌త భ‌ద్ర‌త కు మ‌రియు ర‌క్ష‌ణ కు సంబంధించిన నిధుల ప‌ట్ల కొన్ని అంశాల ప‌రిష్కారాని కి ఏర్పాటు

Posted On: 17 JUL 2019 4:18PM by PIB Hyderabad

భార‌త‌దేశ ఆంత‌రంగిక భ‌ద్ర‌త కు మ‌రియు ర‌క్ష‌ణ కు చాలినన్ని, భద్రమైన మరియు కాలం తీరిపోన‌టువంటి నిధుల కేటాయింపున‌ కు సంబంధించి గంభీర‌మైన ఆందోళ‌న‌ల ను ప‌రిష్క‌రించ‌డానికి అనువుగా ప‌దిహేనో ఆర్థిక సంఘాని కి ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ఫినాన్స్ క‌మిశ‌న్ (మిస్ లేనియస్ ప్రవిజన్స్) యాక్ట్, 1951 కి మ‌రియు రాజ్యాంగం లోని 280వ అధిక‌ర‌ణం లోని (1) క్లాజు కు అనుగుణం గా రాష్ట్రప‌తి ప‌దిహేనో ఆర్థిక సంఘాన్ని 2017వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 27వ తేదీ నాడు నియ‌మించ‌డం జ‌రిగింది.  

సంఘం యొక్క ఉల్లేఖన నిబంధనల (టిఒఆర్)లో భాగం గా అంత‌ర్గ‌త భ‌ద్ర‌త మ‌రియు ర‌క్ష‌ణ ఆవ‌శ్య‌క‌త ల‌కు గాను హామీ తో కూడిన‌టువంటి వ‌న‌రుల కేటాయింపున కు వీలు గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌తిపాదించ‌డ‌మైంది.

అంత‌ర్గ‌త భ‌ద్ర‌త కు మ‌రియు ర‌క్ష‌ణ కు కావ‌ల‌సిన నిధుల ను స‌మ‌కూర్చ‌డం కోసం ఒక ప్ర‌త్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏమైనా ఉందా, మ‌రి అటువంటి ఆవ‌శ్య‌క‌త ఉంటే గ‌నుక ఆ విధ‌మైన ఒక యంత్రాంగం చేత ఏ విధం గా ప‌నుల ను చేయించాలి అనేది కూడా ప‌దిహేనో ఆర్థిక సంఘం ప‌రిశీలించేట‌ట్లుగా ఈ స‌వ‌ర‌ణ వీలు క‌ల్పిస్తుంది.  


**



(Release ID: 1579301) Visitor Counter : 147