మంత్రిమండలి

రైల్వే రంగంలో ఇండియా, ర‌ష్యాల మ‌ధ్య‌న కుదిరిన అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రానికి కేబినెట్ ఆమోదం.

Posted On: 12 JUN 2019 8:11PM by PIB Hyderabad

రైల్వే రంగంలో ఇండియా, ర‌ష్యాల మ‌ధ్య‌న కుదిరిన అవ‌గాహన ఒప్పంద ప‌త్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఈ ఆమోదం తెలిపింది. భార‌త‌దేశ రైల్వే శాఖ‌కు చెందిన ప‌రిశోధ‌న న‌మూనాలు మ‌రియు ప్ర‌మాణాల సంస్థ‌కు ర‌ష్యాకు చెందిన రైల్వే ప‌రిశోధ‌న సంస్థ‌, ర‌ష్యాకే చెందిన ప‌రిశోధ‌న‌ మ‌రియు స‌మాచార సాంకేతిక రంగ, సిగ్న‌లింగ్ మ‌రియు రైల్వే ర‌వాణా టెలిక‌మ్యూనికేష‌న్ల సంస్థ‌ల‌కు మ‌ధ్య‌న ఈ అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రం కుదిరింది.

ఈ ఎంఒయు కార‌ణంగా ఇరు దేశాల మ‌ధ్య‌న స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డం జ‌రుగుతుంది. అంతే కాదు నిపుణుల స‌మావేశాల‌ను, సెమినార్ల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. ఇరు దేశాలు ఉమ్మ‌డిగా అంగీక‌రించిన స‌హ‌కార కార్య‌క్ర‌మాల్ని అమ‌లు చేసుకోవ‌డం, సాంకేతిక ప‌ర‌మైన సంద‌ర్శ‌న‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. 

ఈ ఎంఓయు ఏప్రిల్ 2019న కుదిరింది.

***



(Release ID: 1574507) Visitor Counter : 87