మంత్రిమండలి

ఆధార్ ను ప్రజల కు అనుకూలమైనది గా తీర్చిదిద్దడం

చట్ట ప్రకారం అవసరమైతే తప్ప ఆధార్ సంఖ్య కు రుజువు ను చూపవలసిందంటూ ఏ వ్యక్తి ని నిర్బంధించడం ఉండదు.
స్వేచ్ఛ గా ఆధార సంఖ్య ను ఇస్తే దీనిని కెవైసీ దస్తావేజు వలె స్వీకరించవలసి ఉంటుంది.
ఆధార్ మరియు ఇతర శాసనాల (సవరణ) బిల్లు, 2019 కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 12 JUN 2019 7:51PM by PIB Hyderabad

ఆధార్ కార్డు ను ప్రజల కు అనుకూలమైన విధం గా రూపొందించాలనే లక్ష్యం తో ఆధార్ మరియు ఇతర శాసనాల (సవరణ) ఆర్డినెన్సు, 2019 స్థానం లో చట్టాన్ని తీసుకు రావడానికి ఆధార్ మరియు ఇతర శాసనాల (సవరణ) బిల్లు, 2019 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.  2019వ సంవత్సరం మార్చి 2వ తేదీ న రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్సు లో పేర్కొన్న సవరణల నే బిల్లు లో  ప్రతిపాదించడం జరిగింది.  బిల్లు ను రాబోయే పార్లమెంట్ సమావేశాల లో ప్రవేశపెడతారు.

ఆధార్ కార్డు ను మరింత ప్రజానుకూలం గాను,  పౌరుల కు వినియోగ యోగ్యం గాను మార్చే ఈ నిర్ణయం వల్ల  దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరేందుకు అవకాశం ఉంది.

ప్రభావం: 

  • ప్రజల కు ప్రయోజనకరమైన సేవల ను అందించేందుకు,  ఆధార్ దుర్వినియోగాన్ని నివారించేందుకు మరింత శక్తివంతమైన యంత్రాంగం యుఐడిఎఐ సంస్థ కు ఏర్పడేటందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుంది.
  • పార్లమెంట్ ఆమోదించిన చట్ట ప్రకారం అవసరమైతే తప్ప ఈ సవరణ తరువాత ఆధార్ సంఖ్య ఉన్నట్లు రుజువు చూపవలసిందిగా, తమ గుర్తింపు ను ప్రమాణీకరించవలసింది గా  ఏ వ్యక్తి ని నిర్బంధించడం జరుగదు.
  • ప్రతిపాదిత సవరణల అనంతరం సాధారణ ప్రజానీకం సౌకర్యం కోసం బ్యాంకు ఖాతాలు తెరచే కాలం లో టెలిగ్రాఫ్ చట్టం, 1885 మరియు ద్రవ్య అక్రమ చలామణీ నిరోధక చట్టం, 2002 ప్రకారం  కె వై సి పత్రం గా ఆధార్ సంఖ్య ను స్వచ్చందం గా చూపవచ్చును.

 

వివరాలు :

సవరణ ల ప్రధానాంశాలు దిగువ విధం గా ఉన్నాయి –

  • ఆధార్ సంఖ్య సొంతదారు అనుమతి తో భౌతికం గా, ఎలక్ట్రానిక్ పద్ధతి లో గుర్తింపు ను రుజువు పరచుకోవచ్చును;
  • పన్నెండు అంకెలను కలిగివుండే ఆధార్ సంఖ్య ను వినియోగించే వెసులుబాటు మరియు దీనికి ప్రత్యామ్నాయం గా వర్చువల్ గుర్తింపు ను ఉపయోగించుకొనే సౌలభ్యం.  ఇలాగ ఎందుకంటే, వ్యక్తి యొక్క వాస్తవిక ఆధార్ సంఖ్య ను దాచి ఉంచ వచ్చును;
  • ఆధార్ సంఖ్య ఉన్న పిల్లలు వారికి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చే కన్నా ముందు వారి యొక్క ఆధార్ సంఖ్య ను రద్దు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది;  
  • ఆధార్ జారీ సంస్థ పొందుపరచిన గోప్యత, భద్రత ప్రమాణాల ను పాటించిన సంస్థలు మాత్రమే ఆధార్ ధ్రువీకరణ ను జరపాలి;  అది పార్లమెంట్ ఆమోదించిన శాసనం ప్రకారం అనుమతించబడి లేక కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత నియమాల ప్రకారం రాజ్యహితమై ఉండాలి;  
  • టెలిగ్రాఫ్ చట్టం, 1885 మరియు ద్రవ్య అక్రమ చలామణీ నిరోధక చట్టం, 2002 ల ప్రకారం  కె వై సి పత్రం గా ఆధార్ సంఖ్య ను స్వచ్చందం గా చూపినప్పుడు ప్రమాణీకరణ కు  అనుమతించవచ్చును; 
  • ప్రైవేటు సంస్థ లు ఆధార్ వినియోగించడానికి సంబంధించిన ఆధార్ చట్టం లోని 57వ సెక్షన్ ను తొలగించాలనే ప్రతిపాదన కు చోటు కల్పించడమైంది; 
  • ఆధార్ సంఖ్య ద్రువీకరణ కు అంగీకరించనప్పుడు లేక ద్రువీకరించలేనప్పుడు ఏ వ్యక్తి ని సేవలు అందుకోవడానికి వీలు లేకుండా ఉంచజాలరు.  
  • యూనీక్ ఐడెంటిఫికేశన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫండ్ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ది; 
  • ఆధార్ వ్యవస్థ లోని సంస్థలు ఆధార్ చట్టం మరియు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు జరిమానా కు, తీర్పుల కు, అప్పీలు కు అవకాశం ఉంటుంది.

 

పూర్వరంగం: 

ఆధార్ మరియు ఇతర శాసనాల (సవరణ) ఆర్డినెన్సు, 2019 గుణ దోషాల ను మంత్రివర్గం  2019వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన సమావేశం లో పరిశీలించింది.  రాష్ట్రపతి 2019 మార్చి 2వ తేదీ న ఆర్డినెన్సు ను ప్రకటించారు. 

ఇతర అంశాల తో పాటు సర్వన్నత న్యాయస్థానం ఆదేశాలు మరియు జస్టిస్ బి.ఎన్. శ్రీ కృష్ణ (రిటైర్డ్) సంఘం సిఫారసు ల మేరకు ఆధార్ చట్టాన్ని పటిష్టం చేసేందుకు ఆధార్ మరియు ఇతర శాసనాల (సవరణ) ఆర్డినెన్సు, 2019 ను ఉద్దేశించడమైంది. 

 

 

 **


(Release ID: 1574489) Visitor Counter : 169