మంత్రిమండలి

బ‌యోమెడిక‌ల్ రిస‌ర్చ్ కెరియ‌ర్ ప్రోగ్రామ్ ను అయిదు సంవ‌త్స‌రాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 27 MAR 2019 4:59PM by PIB Hyderabad

బ‌యోమెడిక‌ల్ రిస‌ర్చ్ కెరియ‌ర్ ప్రోగ్రామ్ (బిఆర్‌సిపి) మరియు వెల్‌క‌మ్ ట్రస్ట్ (డ‌బ్ల్యుటి)/ డిబిటి ఇండియా అల‌య‌న్స్ ను దాని ఆరంభిక ప‌ది సంవ‌త్స‌రాల కాలం (2008-09 నుండి 2018-29) నుండి పొడిగించి కొత్త‌ గా అయిదు సంవ‌త్స‌రాల దశ (2019-20 నుండి 2023-24 వ‌ర‌కు) లోనూ అమలుపరచేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జ‌రిగిన  కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  మరో వైపు, డ‌బ్ల్యుటి కి బ‌యోటెక్నాల‌జీ విభాగం (డిబిటి) తన వచనబద్ధత ను డబ్ల్యుటి తో పోల్చితే రెండు రెట్లు పెంచేసింది.

ఈ నిర్ణయం తో మొత్తం 1,092 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఆర్థిక భారం ప‌డ‌నుంది.  దీనిలో డిబిటి మరియు డబ్ల్యు టి వరుసగా 728 కోట్ల రూపాయ‌ల‌ ను మ‌రియు 364 కోట్ల రూపాయ‌ల‌ ను అందజేయనున్నాయి.

ఈ ప్రోగ్రాము 1:1 భాగ‌స్వామ్యం లో తన ప‌ది సంవత్సరాల ఆర్థిక పోషణ కాలం లో భార‌త‌దేశం లో అత్యాధునిక బ‌యోమెడిక‌ల్ రిస‌ర్చ్ సంబంధిత అత్యున్న‌త ప్ర‌పంచ ప్ర‌మాణాలు కలిగిన ప్రతిభల ను పెంచడం మరియు శిక్షణను ఇవ్వడానికి సంబంధించిన తన ఉద్దేశ్యాల‌ ను నెర‌వేర్చింది.  త‌త్ఫ‌లితం గా సామాజిక ఆవశ్యకతల ను పూర్తి చేయడం కోసం ముఖ్య‌మైన వైజ్ఞానిక పురోగ‌తి ని సాధించ‌డం జ‌రిగింది.

బిఆర్‌సిపి తో- విదేశాల‌ లో పనిచేస్తున్న ఉత్తమ భార‌తీయ శాస్త్రవేత్త‌ల కు   స్వదేశాని కి తిరిగి రావడం ఆకర్షణీయంగా మారిపోయింది.  దీనితో పాటు, బిఆర్ సిపి కారణం గా భారతదేశం లో పలు ప్రాంతాల లో ప్ర‌పంచ‌ స్థాయి బ‌యోమెడిక‌ల్ రిస‌ర్చ్ ను చేప‌ట్టే కేంద్రాల సంఖ్య భారీ గా పెరిగిపోయింది.

ఈ కార్యక్రమం యొక్క తదుపరి (విస్తరించిన) దశ లో ఈ సామ‌ర్ధ్యాన్ని మ‌రింత పెంచ‌డానికి వీలు ఏర్పడుతుంది.  అంతేగాక‌, భారతదేశంలో ఆరోగ్య సంబంధమైన ప్రధాన సవాళ్ల ను అధిగమించడం కోసం సాగుతున్న కృషి ని, క్లినిక‌ల్ రిస‌ర్చ్ ను కూడా బ‌లోపేతం చేయ‌డం జరుగుతుంది.  భారత ప్రభుత్వం యొక్క పెరిగిన భాగస్వామ్యం తో ఈ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించ‌డమనేది అత్యంత ముఖ్యమైపోతోంది. ఎందుకంటే అలా జరిగితేనే ఆశించిన పరిణామాలు సిద్ధించగలుగుతాయి.  


**



(Release ID: 1569735) Visitor Counter : 200