మంత్రిమండలి

ఎంహెచ్ఇపి రుణం తిరిగి చెల్లింపు గ‌డువు ను రెండు సంవ‌త్స‌రాల పాటు పొడిగించేందుకు గాను భార‌త‌దేశం మ‌రియు భూటాన్ ల మ‌ధ్య కుదిరిన ఒప్పందం తాలూకు ఆర్టికిల్ 3 లో స‌వ‌ర‌ణ‌ కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 07 MAR 2019 2:36PM by PIB Hyderabad

మాంగ్డేఛూ జ‌ల విద్యుత్తు ప‌థ‌కం (ఎంహెచ్ఇపి)కి సంబంధించి రుణం తిరిగి చెల్లింపు అవధి ని రెండు సంవత్సరాల పాటు పొడిగించేందుకు భార‌త‌దేశాని కి, భూటాన్ కు మ‌ధ్య ఉన్న ఒప్పందం లోని ఆర్టికిల్ 3 కు స‌వ‌ర‌ణ చేసేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్ష‌త న‌ జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ప్ర‌స్తావిత ప‌థ‌కాన్ని భూటాన్ లో అమలుచేసేందుకు గాను ఇప్పుడు ఉన్న రుణం తిరిగి చెల్లింపు గ‌డువు ను 15 సంవ‌త్స‌రాల నుండి 17 సంవ‌త్స‌రాల కు  పొడిగించడం కోసం ఇది వీలు ను క‌ల్పిస్తుంది.

ప్ర‌యోజ‌నాలు:

ఈ ప్ర‌తిపాద‌న సాధించేది ఏమిటంటే:

భూటాన్ లో 720 ఎండ‌బ్ల్యు సామ‌ర్ధ్యం క‌లిగిన ఎంహెచ్ఇపి నుండి విద్యుత్తు ను దిగుమ‌తి చేసుకోవ‌డం కోసం ఒక‌టో సంవ‌త్స‌రం లో టారిఫ్ ప్ర‌తి ఒక్క యూనిట్ కు 4.12 భార‌త‌దేశ రూపాయ‌లు గా ఉండాలి.

ఎంహెచ్ఇపి నుండి భూటాన్ ద్వారా భార‌త‌దేశాని కి మిగులు విద్యుత్తు ను త‌ప్ప‌నిస‌రిగా స‌ర‌ఫ‌రా చేయాలి.  

భార‌త‌దేశం-భూటాన్ ల ఆర్థిక సంబంధాలు, ప్రత్యేకించి  జ‌ల విద్యుత్తు సంబంధిత స‌హ‌కార రంగం లో పరస్పర సంబంధాలు మరియు భార‌త‌దేశం-భూటాన్ సంబంధాల స‌ర్వ‌తోముఖ అభివృద్ధి ని పటిష్టపరచాలి.


** 



(Release ID: 1568175) Visitor Counter : 102