మంత్రిమండలి
కంపెనీ (ద్వితీయ సవరణ) ఆర్డినెన్స్ 2019 జారీకి అనుమతి మంజూరు చేసిన కేంద్ర కేబినెట్
Posted On:
19 FEB 2019 8:53PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కంపెనీల (ద్వితీయ సవరణ0 ఆర్డినెన్స్ జారీకి అనుమతి మంజూరు చేసింది. అలాగే పార్లమెంటులో ఈ ఆర్డినెన్సు స్థానంలో బిల్లును తీసుకువచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. కంపెనీల చట్టం 2013 కింద నేరాలను సమీక్షించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా దీనిని రూపొందించారు. కంపెనీల చట్టం 2013లో పేర్కొన్న ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో గల కొన్ని లోపాలను సరిచేయడానికి దీనిని ఉద్దేశించారు. అలాగే చట్టాన్ని గౌరవించి నడచుకునే కార్పొరేట్ సంస్థల సులభతర వ్యాపారానికి మరింత వీలు కల్పించే ఏర్పాటూ ఇందులో ఉంది. తీవ్రనేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించే ఏర్పాటుతోపాటు చట్టబద్ధంగా వ్యవహరించే వారికి ప్రోత్సాహకాలకూ ఇది వీలు కల్పిస్తుంది.
వివరాలు:
కంపెనీల (సవరణ)బిల్లు 2018, దీనిని ఆ తర్వాత కంపెనీల (సవరణ )బిల్లు 2019గా 2018 డిసెంబర్ 20న లోక్‌సభలో ప్రవేశపపెట్టారు. దీనిని లోక్‌సభ చేపట్టి 2019 జనవరి 4న ఆమోదించింది. ఆ తర్వాత ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లింది. అయితే రాజ్యసభ శీతాకాల సమావేశాలలోకాని లేదా బడ్జెట్ సమావేశాలలో కానీ ఇది ఆమోదానికి నోచుకోలేదు.
ఇంతకు ముందు జారీ చేసిన ఆర్డినెన్సుల ద్వారా మొత్తం 29 సెక్షన్లను సవరించారు. 2 సెక్షన్లను చేర్చారు. ఈ ఆర్డినెన్సులను 2018 నవంబర్ 2న ( ఆర్డినెన్స్ 9 ఆఫ్ 2018), అలాగే 2019 జనవరి 12న (ఆర్డినెన్స్ 3 ఆఫ్ 2019) జారీ చేశారు.
సాంకేతికపరమైన, విధివిధానల పరంగానూ చేసిన చిన్న తప్పిదాలకు సివిల్ బాధ్యతను విధించేలా ఈ సవరణలు ఉన్నాయి .అలాగే కార్పొరేట్ పాలన, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించిన పలు అంశాలలో ఉన్న లోపాలను సరిచేసేందుకు వీటిని ఉద్దేశించారు. ఇందులో
ఎ) 16 చిన్న నేరాలను పున: వర్గీకరించి కేవలం సివిల్ తప్పిదాలుగా గుర్తించారు. దీనివల్ల ప్రత్యేక కోర్టుల కేసుల భారం తగ్గుతుంది.
బి) కొన్ని రోటీన్‌కార్యకలాపాలను ఎన్‌సిఎల్‌టి నుంచి కేంద్ర ప్రభుత్వానికి బదలాయింపు
అంటే ఆర్థిక సంవత్సరం మార్పునకు సంబంధించిన దరఖాస్తు , పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీకి మార్పు వంటి వి ఇందులో ఉన్నాయి.
సి. రిజిస్టర్డ్ ఆఫీస్ నిర్వహించకపోవడం, వ్యాపార కార్యకలాపాల ప్రారంభం గురించి తెలియజేయకపోవడం వంటివి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల నుంచి తొలగింపునకు ప్రాతిపదికగా చేయడం
డి) ఆరోపణల దాఖలు, మార్పులకు సంబంధించి తక్కువ వ్యవధి, కఠినమైన ప్రొవిజన్లు
ఇ) డైరక్టర్‌షిప్ సీలింగ్‌ను ఉల్లంఘించడం అనర్హతకు ఒక ప్రాతిపదికగా చేయడం
ప్రభావం:
ఈ మార్పుల కారణంగా కార్పొరేట్ సంస్థలు నిబంధనలను మరింత కచ్చితంగా పాటించడానికి వీలు కలుగుతుంది. అలాగే స్పెషల్‌కోర్టులలో కేసుల భారం తగ్గడానికి ఎన్‌సిఎల్ టి భారం తగ్గడానికి మరింత మెరుగైన రీతిలో చట్టాల అమలుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం కోర్టులలో పెండింగ్‌లో ఉన్న 40,000కు పైగా కేసులలో 60 శాతం కేఉలు వివిధ విధివిధానాలు సక్రమంగా పాటించకపోవడానికి సంబంధించినవి. ఇలాంటి వాటిని అంతర్గత పరిష్కార యంత్రాంగానికి మారుస్తారు. దీనిద్వారా కార్పొరేట్ సంస్థలు విధివిధానాలు సక్రమంగా పాటించేలా ప్రోత్సహిస్తారు. ఈ సవరణల ఫలితంగా భవిష్యత్తులో ఎన్‌సిఎల్‌టిలో మొత్తం మీద కేసుల భారం గణనీయంగా తగ్గుతుంది. ఒక క్షమా పథకం ద్వరా ప్రస్తుత కేసులను ప్రత్యేక కోర్టుల నుంచి ఉపసంహరించుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో అంతర్గతంగా కొన్నిప్రయోజనాలు ఉన్నాయి. అవి విధివిధానపరమైన వైఫల్యాల విషయంలో నేర విచారణకు బదులుగా సివిల్ పరంగా బాధ్యులను చేయడం జరుగుతుంది. నిబంధనలను పాటించడంలో వైఫల్యానికి సంబంధించిన చాలావరకు పెండింగ్‌లో ఉన్నలేదా దాఖలైన కేసులలో చాలావరకు కేసుల తీరును పరిశీలించి చూసినపుడు అవి ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ దాఖలు చేయకపోవడానికి సంబంధించనవో లేక వార్షిక నివేదిక దాఖలు చేయకపోవడానికి సంబంధించినవిగానో, ఇతరాలుగానో ఉన్నాయి.
ఇలాంటి ఉల్లంఘనలను పున: వర్గీకరించి అంతర్గత వ్యవస్థ ద్వారా పరిష్కరించి నగదు పెనాల్టీలు విధించినట్టయితే స్పెషల్ కోర్టులపై పనిభారం గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల అత్యంత తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన ముందుకు తీసుకుపోవడానికి వీలు కలుగుతుంది. ఇది , తీవ్రనేరాలకు పాల్పడే వారిపై మరింత చురుకుగా చర్యలు తీసుకోవడానికి ఆర్.ఒ.సిలకు వీలు కల్పిస్తుంది. వివాదాల పరిష్కారకర్తలైన అధికారులు (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్), నిర్ణీత కాల వ్యవధిలోగా వివాదాల పరిష్కారాలను పూర్తి చేయాలి. ఈ కాలపరిమితిని కచ్చితంగా అమలు చేసేలా నిబంధనలను సవరించేందుకు ప్రతిపాదించబడింది.
(Release ID: 1565443)
Visitor Counter : 120