మంత్రిమండలి

భార‌త‌దేశాని కి మ‌రియు నార్వే కు మ‌ధ్య‌ ఇండియా- నార్వే ఓశన్ డైలాగ్ అంశం పై ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 06 FEB 2019 9:53PM by PIB Hyderabad

ఇండియా- నార్వే ఓశన్ డైలాగ్ అంశం పై భార‌త‌దేశాని కి మ‌రియు నార్వే కు మధ్య ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎంఒయు) కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.
 
ప్ర‌యోజ‌నాలు:

నీలి ఆర్థిక వ్య‌వ‌స్థ అభివృద్ధి కి సంబంధించిన ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ముడిప‌డిన రంగాల లో స‌హ‌కారాన్ని ఈ ఎంఒయు పెంపొందించ‌నుంది.  నీలి ఆర్థిక వ్య‌వ‌స్థ రంగం లో నార్వే ప్ర‌పంచం లో ఒక అగ్ర‌గామి దేశం గా ఉంది.  మ‌త్స్య ప‌రిశ్ర‌మ‌, హైడ్రోకార్బ‌న్స్, న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి, మ‌హా స‌ముద్ర వ‌న‌రుల ను స్థిర ప్రాతిప‌దిక‌ న ఉప‌యోగించుకోవ‌డం మ‌రియు స‌ముద్ర సంబంధిత ర‌వాణా ల వంటి రంగాల లో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాల తో పాటు ప్రావీణ్యం లో నార్వే ది అందె వేసిన చేయి.  ప్ర‌తిపాదిత ఎంఒయు హైడ్రోకార్బ‌న్స్, ఇత‌ర స‌ముద్ర సంబంధిత వ‌న‌రుల అన్వేష‌ణ వంటి రంగాల లో స‌హ‌కారాని కి అవ‌కాశాల‌ ను సృష్టించ‌డం లో తోడ్పాటు ను అందించ‌ గ‌లుగుతుంది.  అంతేకాకుండా, జాయింట్ టాస్క్ ఫోర్స్ (జెటిఎఫ్‌) ఫ్రేమ్ వ‌ర్క్ కు లోబ‌డి అన్ని భాగ‌స్వామ్య ప‌క్షాల ప‌ర‌స్ప‌ర ల‌బ్ది ల‌క్ష్యం గా నౌకాశ్ర‌యాల నిర్వ‌హ‌ణ‌, ఇంకా ప‌ర్య‌ట‌క అభివృద్ధి కి కూడా ఈ ఎంఒయు దోహ‌దం చేయ‌నుంది.  మ‌త్స్య ప‌రిశ్ర‌మ లో, చేపలు/ రొయ్యల పెంపకం లో నూత‌న సాంకేతిక విజ్ఞానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఆహార భ‌ద్ర‌త ల‌క్ష్య సాధ‌న‌ కు ఇది తోడ్ప‌డ‌నుంది.  ఉభ‌య దేశాల లో లాభ‌సాటి వ్యాపార సంస్థ ల‌ను నిర్వ‌హించ‌డం కోసం ఒక వేదిక ను కూడా ఇది సమకూర్చుతుంది.  ఆర్క్ టిక్ ప్రాంతం లో మ‌హా స‌ముద్ర సంబంధిత ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ ను అధ్య‌య‌నం చేయ‌డం లో రెండు దేశాల శాస్త్రవేత్త‌ లు మ‌రియు ప‌రిశోధ‌కు లు క‌ల‌సి ప‌ని చేసేందు కు కూడా దీని ద్వారా అవ‌కాశం ల‌భించ‌నుంది.


**



(Release ID: 1563320) Visitor Counter : 171