మంత్రిమండలి

స‌ముద్ర సంబంధిత అంశాల పై భార‌త‌దేశం మ‌రియు డెన్మార్క్ ల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 10 JAN 2019 8:53PM by PIB Hyderabad

స‌ముద్ర సంబంధిత అంశాల పై భార‌త‌దేశానికి, డెన్మార్క్ కు మ‌ధ్య  అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందాని కి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  ఒప్పంద పత్రం పై 2019వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి లో డెన్మార్క్ నుండి డ‌బ్ల్యుఐపి భార‌త‌దేశాన్ని సంద‌ర్శించే సంద‌ర్భం లో సంతకాలు జ‌రగాలని ప్రతిపాదించడమైంది. 

ప్ర‌యోజ‌నాలు

ఈ ఎంఒయు పై సంత‌కాల తో ద్వైపాక్షిక స‌హ‌కారాని కి అనుకూలించే రంగాల‌ ను రెండు దేశాలు అన్వేషించేందుకు మార్గం సుగమం కాగలదు :
 
ఆ రంగాల లో - 
భార‌త‌దేశం, ఇంకా డెన్మార్క్ ల సముద్ర సంబంధ రంగాల లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాని కి, ఇంకా పెట్టుబ‌డుల‌ కు బాట వేయ‌డం; శిప్పింగ్ లో ఉభ‌య దేశాల సామ‌ర్ధ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డం కోసం ప్రావీణ్యం, ప్ర‌చుర‌ణ‌లు, స‌మాచారం, డాటా మ‌రియు గ‌ణాంకాల‌ ను ఉభ‌య దేశాలు ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకొనేందుకు వీలు క‌ల్పించ‌డం;  గ్రీన్ మారిటైమ్ టెక్నాల‌జీ రంగం లోను, నౌకా నిర్మాణం లోను స‌హ‌క‌రించుకోవ‌డం;  ఇండియ‌న్ రిజిస్ట‌ర్ ఆఫ్ శిప్పింగ్ (ఐఆర్ఎస్‌)కు రిక‌గ్నైజ్‌డ్ ఆర్గ‌నైజేశ‌న్ (ఆర్ఒ) హోదా ను మంజూరు చేయ‌డం, స‌ముద్ర సంబంధిత శిక్ష‌ణ మరియ విద్య రంగం లో  స‌హ‌కారం; మ‌ర్చంట్ శిప్పింగ్‌ మరియు స‌ముద్ర సంబంధ ర‌వాణా వ్య‌వ‌హారాల రంగం లో స్థిర ప్రాతిప‌దిక‌ కలిగిన స‌హ‌కారం కోసం పరిశోధన మరియు అభివృద్ధి కి నడుం కట్టడం లతో పాటు 
ద్వైపాక్షిక స్థాయి లో, అంత‌ర్జాతీయ స్థాయి లో ఇరు దేశాల‌ కు ప‌ర‌స్ప‌రం ప్ర‌యోజ‌నాలు చేకూరే అవ‌కాశాల‌ ను వినియోగించుకోవ‌డం లో మ‌రింత ఎక్కువ‌ గా స‌హ‌క‌రించుకోవ‌డం - 
వంటివి ఉంటాయి.
 
పూర్వ‌రంగం     

భార‌త‌దేశం తో వ్యాపారం చేస్తున్న భాగ‌స్వామ్య దేశాల లో డెన్మార్క్ ఒక ముఖ్య‌ భాగ‌స్వామి గా ఉంది.  డెన్మార్క్ నుండి భార‌త‌దేశాని కి ఎగుమ‌తి అవుతున్న స‌ర‌కుల లో ఔష‌ధ సంబంధ వ‌స్తువులు, విద్యుత్తు ఉత్పాద‌న యంత్రాంగం, పారిశ్రామిక యంత్ర సామ‌గ్రి, లోహ ఖ‌నిజాలు, సేంద్రియ ర‌సాయ‌నాలు వంటివి ఉన్నాయి.   డెన్మార్క్ కు భార‌త‌దేశం ఎగుమ‌తి చేస్తున్న స‌ర‌కుల‌ లో దుస్తులు, వ‌స్త్రాలు/ దారాలు, , ర‌హ‌దారి పై రాక‌పోక‌లు జ‌రిపే వాహ‌నాలు మ‌రియు విడి భాగాలు, లోహ వ‌స్తువులు, ఇనుము మ‌రియు ఉక్కు, పాదర‌క్ష‌లు, యాత్రల‌ లో వినియోగించే వ‌స్తువులు ప్ర‌ధాన‌మైన‌వి.  ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్స‌హించ‌డం కోసం, అలాగే స‌ముద్ర సంబంధిత రంగం లో స‌హ‌కారాన్ని, స‌మ‌న్వ‌యాన్ని ప్రోత్స‌హించ‌డం కోసం డెన్మార్క్ తో ఒక ద్వైపాక్షిక ఎంఒయు ను కుదుర్చుకోవాల‌ని ప్ర‌తిపాదించ‌డ‌మైంది.


**



(Release ID: 1559574) Visitor Counter : 285