మంత్రిమండలి
స్వాజీలాండ్ కు పన్నుల సంబంధిత సహాయాన్ని అందించడం కోసం టిఒఆర్ పై సంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
10 JAN 2019 8:48PM by PIB Hyderabad
భారతదేశానికి, స్వాజీలాండ్ కు (దీని కొత్త పేరు ‘ఇస్వాతినీ’గా ఉంది) మధ్య టాక్స్ ఇన్‌స్పెక్టర్స్ విత్ అవుట్ బార్డర్స్ ప్రోగ్రామ్ లో భాగం గా స్వాజిలాండ్ కు పన్నుల సంబంధిత సహాయాన్ని అందించడం కోసం భారతీయ నిపుణుడి ని నియమించే విషయం లో టరమ్స్ ఆఫ్ రెఫరన్స్ (టిఒఆర్) పై సంతకాలు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అంశం వారీగా వివరాలు
టాక్స్ ఇన్‌స్పెక్టర్స్ విత్ అవుట్ బార్డర్స్ (టిఐడబ్ల్యుబి) ప్రోగ్రామ్ లో భాగం గా భారత ప్రభుత్వం మరియు కింగ్ డమ్ ఆఫ్ ఇస్వాతినీ ప్రభుత్వం కలసికట్టు గా ఒక భారతీయ నిపుణుడి ని ఎంపిక చేయడమైంది.
టిఒఆర్ అనేది టిఐడబ్ల్యుబి ప్రోగ్రామ్ పరిధి లో ఇస్వాతినీ కి పన్నుల సంబంధిత సహాయాన్ని అందించడం కోసం భారతీయ నిపుణుడి ని నియమించుకొనేందుకు నియమ నిబంధనల ను నిర్దేశించడం జరుగుతుంది.
ప్రధాన ప్రభావం
టిఐడబ్ల్యుబి ప్రోగ్రామ్ లో భాగం గా భారతీయ నిపుణుడి సేవలను అందుకోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల లో పన్నుల సంబంధిత వ్యవహారాల లో సామర్ధ్య నిర్మాణాన్ని సంతరించడం లో భారతదేశం అందిస్తున్నటువంటి మద్దతు కు ఒక భారీ ఉత్తేజం లభ్యం కానుంది.
**
(Release ID: 1559569)
Visitor Counter : 241