మంత్రిమండలి

నూత‌న, ఇంకా న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి రంగం లో సాంకేతిక ప‌ర‌మైన ద్వైపాక్షిక స‌హ‌కారం అంశం లో భార‌త‌దేశాని కి మ‌రియు ఫ్రాన్స్ కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 10 JAN 2019 8:50PM by PIB Hyderabad

నూత‌న, ఇంకా న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి రంగం లో సాంకేతిక ప‌ర‌మైన ద్వైపాక్షిక స‌హ‌కారం అంశం లో భార‌త‌దేశాని కి మ‌రియు ఫ్రాన్స్ కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రాని కి  (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  ఈ ఎంఒయు పై 2018 వ సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 3 వ తేదీ నాడు సంత‌కాల‌య్యాయి.

ప్ర‌ధానాంశాలు

నూత‌న, మ‌రియు న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి సంబంధిత అంశాల లో ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం, స‌మానావ‌కాశాలను ఇచ్చిపుచ్చుకోవ‌డం ప్రాతిప‌దిక‌లు గా ఉండేట‌టువంటి ఒక స‌హ‌కార పూర్వ‌క సంస్థాగ‌త‌ సంబంధాన్ని ప్రోత్సహించడం తో పాటు  సాంకేతిక ప‌ర‌మైన ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని కూడా ప్రోత్స‌హించేందుకు ఒక ప్రాతిప‌దిక‌ ను నెల‌కొల్పుకోవాల‌ని భార‌త‌దేశం, ఫ్రాన్స్ లు ధ్యేయం గా పెట్టుకొన్నాయి.  సంయుక్త ప‌రిశోధ‌క కార్యాచ‌ర‌ణ బృందాలు, ప్ర‌యోగాత్మ‌క‌మైన ప‌థ‌కాలు, అధ్య‌య‌న యాత్ర‌, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్‌, కేస్ స్ట‌డీస్ మరియు అనుభ‌వాన్ని/ప్రావీణ్యాన్ని ఒక ప‌క్షానికి మ‌రొక ప‌క్షం ఇచ్చిపుచ్చుకోవ‌డం ఈ సాంకేతిక ప‌ర‌మైన స‌హ‌కారం ప‌రిధి లోకి వ‌స్తాయి.

లాభాలు
  
ఈ ఎంఒయు భార‌త‌దేశాని కి, ఫ్రాన్స్ కు మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయ‌డం లో స‌హాయ‌కారి కాగ‌ల‌దు.


**



(Release ID: 1559532) Visitor Counter : 147