మంత్రిమండలి
ప్రధాన మంత్రి- జన్ ఆరోగ్య యోజన ను మరింత మెరుగ్గా అమలుచేసేందుకు నేశనల్ హెల్త్ ఏజెన్సీ ని ‘‘నేశనల్ హెల్త్ అథారిటీ’’ గా పునర్ నిర్మించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
02 JAN 2019 5:51PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి- జన్ ఆరోగ్య యోజన (పిఎమ్- జెఎవై) ని మరింత మెరుగ్గా అమలుచేసేందుకుగాను ప్రస్తుతం ఉన్నటువంటి నేశనల్ హెల్త్ ఏజెన్సీ ని ‘‘నేశనల్ హెల్త్ అథారిటీ’’ పేరిట పునర్ నిర్మాణం చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఆమోదం తో ఇప్పటి ‘‘నేశనల్ హెల్త్ ఏజెన్సీ’’ సొసైటీ రద్దు అయ్యి, దాని స్థానం లో ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు అనుబంధ కార్యాలయం గానేశనల్ హెల్త్ అథారిటీ ఏర్పడుతుంది.
ప్రస్తుతం ఉన్న బహుళ అంచెల నిర్ణాయక యంత్రాంగం స్థానం లో భారత ప్రభుత్వ ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్యక్షత న పాలక మండలి ని ఏర్పరచడమైంది. ఇది ఈ పథకం ఇబ్బంది లేకుండా అమలయ్యేటట్టుగా నిర్ణయాలను వేగవంతం గా తీసుకోవడం లో తోడ్పడనుంది. పాలక మండలి కూర్పు ప్రభుత్వం, డమేన్ ఎక్స్ పర్ట్ స్, వగైరా వర్గాల నుండి తగినంత మంది ప్రతినిధులతో విస్తృత ప్రాతిపదిక న ఉంటుంది. దీనికి తోడుగా, పాలక మండలి లో రాష్ట్రాలకు కూడాఆవర్తన పద్ధతి న ప్రాతినిధ్యం లభించనుంది.
ఎటువంటి నూతన నిధులకు ఆమోదం ఇవ్వడం జరుగలేదు. ఇంతకు ముందు నేశనల్ హెల్త్ ఏజెన్సీ కోసం మంత్రిమండలి ఆమోదించిన ప్రస్తుత బడ్జెటు ను (ఐటి, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, నిర్వహణ సంబంధిత వ్యయాలు, వగైరా లు సహా) నేశనల్ హెల్త్ అథారిటీ ద్వారా వినియోగం కానున్నాయి.
పిఎమ్ జెఎవై ని నేశనల్ హెల్త్ అథారిటీ సమర్థంగాను, ప్రభావశీలం గాను మరియు పారదర్శకమైనటువంటి నిర్ణయాలతో కూడిన ప్రక్రియ తోను అమలు చేయాలని, అందుకు తగ్గ అధికారం తో పాటు పూర్తి జవాబుదారుతనం కూడా నేశనల్ హెల్త్ అథారిటీ వహించాలని సూచించడమైంది.
**
(Release ID: 1558297)