మంత్రిమండలి

ప్ర‌ధాన‌ మంత్రి స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న లో భాగం గా త‌మిళ‌ నాడు లోను, తెలంగాణ లోను కొత్త ఎఐఐఎంఎస్‌ ల ఏర్పాటు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 17 DEC 2018 8:59PM by PIB Hyderabad

త‌మిళ‌ నాడు లోని మ‌దురై లో 1264 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో, తెలంగాణ లో  బీబీన‌గ‌ర్‌ లో 1028 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో మొత్తం రెండు అఖిల భార‌త వైద్య‌ విజ్ఞానశాస్త్ర సంస్థ‌ (ఎఐఐఎంఎస్‌)ల స్థాపన కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌ న సమావేశమైన కేంద్ర‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ ఎఐఐఎంఎస్‌ ల‌ను ప్ర‌ధాన‌ మంత్రి స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న (పిఎంఎస్‌ఎస్‌వై) లో భాగం గా  ఏర్పాటు చేస్తారు.

ఈ రెండు ఎఐఐఎంఎస్‌ ల‌కు ఒక్కొక్క‌దానికి ఒక‌టి చొప్పున డైరెక్ట‌ర్ పోస్టు ల‌ను కూడా కేంద్ర మంత్రివర్గం మంజూరు చేసింది; ఈ పోస్టు కు మూల వేతనం 2,25,000 రూపాయలు (ఫిక్స్‌డ్‌), అద‌నం గా ఎన్‌పిఎ (వేత‌నం ప్ల‌స్ ఎన్‌పిఎ 2,37,500 రూపాయలు మించ‌కుండా) మంజూరు చేసింది.

ప్ర‌యోజ‌నాలు :

•   ప్రతి ఒక్క నూతన ఎఐఐఎంఎస్‌ లో 100 యుజి (ఎంబిబిఎస్‌) సీట్లు, ఇంకా 60 బి.ఎస్‌సి. (న‌ర్సింగ్ ) సీట్లు అందుబాటు లోకి వ‌స్తాయి.

•   ప్రతి ఒక్క నూతన ఎఐఐఎంఎస్‌ లో 15-20 సూప‌ర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి.

•   ప్రతి ఒక్క నూతన ఎఐఐఎంఎస్‌ లో దాదాపు 750 ఆసుపత్రి పడక లు ఉంటాయి.

•   ఎఐఐఎంఎస్ ల ప‌నితీరు కు సంబంధించి అందుబాటు లో ఉన్న సమాచారం ప్ర‌కారం, ప్రతి ఒక్క నూతన ఎఐఐఎంఎస్ రోజూ 1500 మంది అవుట్  పేశంట్ లకు, నెల‌ నెలా 1000 మంది కి ఆస్ప‌త్రి లోపలే వైద్య సేవ‌లను అందించగలుగుతుందని ఆశిస్తున్నారు.

ప్రాజెక్టు వివ‌రాలు:

కొత్త ఎఐఐఎంఎస్ ల లో వైద్య‌ విద్య‌, న‌ర్సింగ్‌ కోర్సు ల‌కు బోధ‌న విభాగాల స్థాపన, రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్, అనుబంధ సేవ‌లు, న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్‌,  పిఎంఎస్ఎస్‌వై తొలి ద‌శ‌ కింద చేప‌ట్టిన ఇత‌ర ఆరు ఎయిమ్స్‌ ల  స్థాయి లో సౌక‌ర్యాలు చేప‌ట్టవ‌ల‌సి వుంది.  నాణ్య‌మైన ప్ర‌త్యేక వైద్య సేవ‌లు అందించేందుకు, వైద్య‌ విద్య‌, న‌ర్సింగ్ విద్య‌, ఈ ప్రాంతం లో ప‌రిశోధ‌న‌ లు సాగించేందుకు జాతీయ ప్రాధాన్య‌త‌ గ‌ల సంస్థ‌ లుగా కొత్త ఎయిమ్స్ ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది.
ప్ర‌తిపాదిత ఎయిమ్స్ ఆస్ప‌త్రుల‌ లో అత్యవసర పరిస్థితి, ట్రామాకేర్ బెడ్‌ ల‌తో పాటు ఆయుష్ పడక లు,ప్రైవేటు బెడ్‌ లు, ఐసియు స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ బెడ్ లు ఉంటాయి.  వీటికి తోడు ఒక వైద్య  క‌ళాశాల‌, ఆయుష్ బ్లాక్, ఆడిటోరియం, రాత్రి పూట ఆశ్ర‌యం, అతిథిగృహం, వసతి గృహాలు, రెసిడెన్షియ‌ల్ సౌక‌ర్యాలు ఉంటాయి.  నూత‌న ఎయిమ్స్ ఏర్పాటు తో కొత్త మూల‌ధ‌న ఆస్తుల ఏర్పాటు జ‌రుగుతుంది. వీటి నిర్వ‌హ‌ణ‌కు ఆరుకొత్త ఎయిమ్స్‌ల స్థాయిలో ప్ర‌త్యేక మాన‌వ వ‌న‌రుల వ్య‌వ‌స్థ ఏర్పాటు జ‌రుగుతుంది. ఇందుకు అవ‌స‌ర‌మ‌య్యే మొత్తాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ప్ర‌ధాన‌ మంత్రి స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న ప‌ద్దు కింద ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌ శాఖ ఖ‌ర్చు చేస్తుంది.
త‌మిళ‌ నాడు, తెలంగాణా ల‌లో కొత్త ఎయిమ్స్‌ ల ఏర్పాటు కు 45 నెల‌ల కాలాన్ని నిర్దేశిత గడువు గా నిర్ణ‌యించారు. ఇందుకు నిర్మాణానికి ముందు 10 నెల‌ల వ్య‌వ‌ధి, నిర్మాణాల‌కు 32 నెల‌ల వ్య‌వ‌ధి, స్టెబిలైజేశన్‌ కు, క‌మిశనింగ్‌ కు  మూడు నెల‌ల వ్య‌వ‌ధి ని గ‌డువు గా నిర్ణ‌యించారు.  ఎయిమ్స్ నిర్మాణం, నిర్వ‌హ‌ణ ల వ్య‌యాన్ని పిఎంఎస్‌ఎస్‌వై కింద కేంద్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుంది.
 
ప్ర‌భావం:

కొత్త ఎయిమ్స్‌ ల ఏర్పాటు వైద్య విద్య‌, శిక్ష‌ణ‌ లో మార్పు తీసుకురావ‌డ‌మే కాకుండా ఈ ప్రాంతం లో వైద్య సిబ్బంది కొర‌త‌ ను తీర్చ‌డానికి ఉప‌క‌రిస్తుంది. వీటి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు రెండు ప్ర‌యోజ‌నాలు అందుతాయి. ఒక‌టి సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సేవ‌ లు అందుబాటులోకి రావ‌డం, రెండు పెద్ద ఎత్తున వైద్యులు, హెల్త్ వ‌ర్క‌ర్లు అందుబాటు లోకి రావ‌డం.  ప్రాథ‌మిక మరియు మాధ్యమిక స్థాయి సంస్థ‌ ల‌కు వీరు అందుబాటు లోకి వ‌స్తారు.  నేశనల్ హెల్త్ మిశన్ కింద స‌దుపాయాలు క‌ల్పింప‌బ‌డ‌తాయి.  కొత్త ఎఐఐఎంఎస్ ల నిర్మాణం పూర్తి గా కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌ తో జ‌రుగుతుంది.  వీటి కార్య‌క‌లాపాలు, నిర్వ‌హ‌ణ కూడా పూర్తి గా కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌ తోనే జ‌రుగుతుంది.

ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌:

ఈ కొత్త ఎయిమ్స్‌ ల ఏర్పాటు వ‌ల్ల రెండు రాష్ట్రాల‌ లో వివిధ ఫేక‌ల్టీ, నాన్‌ ఫేక‌ల్టీ ల‌లో సుమారు 3000కు పైగా ఉద్యోగాల క‌ల్ప‌న‌ కు అవ‌కాశం క‌లుగుతుంది.  ఇక్క‌డ ఏర్పాటు చేసే స‌దుపాయాలు, సేవ‌లు ఎయిమ్స్ ప‌రిస‌రాల‌ లో ఏర్ప‌డే  షాపింగ్ సెంట‌ర్‌, కాంటీన్ ల వంటి వాటి కార‌ణంగా  ప‌రోక్ష ఉపాధి అవ‌కాశాలూ ఏర్పడుతాయి.
  వివిధ కొత్త ఎయిమ్స్‌ ల ఏర్పాటు కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ కు పెద్ద ఎత్తున నిర్మాణ‌ ప‌నులు చేప‌ట్ట‌వ‌ల‌సి ఉంటుంది.  ఇది నిర్మాణ రంగం లో ఉపాధి అవ‌కాశాల‌ను స‌మ‌కూరుస్తుంది.

పూర్వరంగం:

ప్ర‌ధాన‌ మంత్రి స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న (పిఎంఎస్ఎస్‌వై) కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం. దేశం లోని వివిధ ప్రాంతాల‌ లో వైద్య ఆరోగ్య సేవ‌ల అందుబాటు లో గ‌ల‌ అస‌మ‌తౌల్యాన్ని స‌రిదిద్ద‌డం,నాణ్య‌మైన వైద్య స‌దుపాయాలను క‌ల్పించ‌డం, ప్ర‌త్యేకించి వైద్య విద్య విష‌యం లో మ‌రింత చొర‌వ అవ‌స‌ర‌మైన రాష్ట్రాల‌కు సేవ‌లను అందించ‌డం దీని ఉద్దేశం.

త‌మిళ‌ నాడు లో ఎయిమ్స్ ఏర్పాటు కు సంబంధించి 2015-16 బ‌డ్జెటు ప్ర‌సంగంలో ఆర్థిక‌ మంత్రి ప్ర‌క‌టన చేశారు. తెలంగాణ లో ఎయిమ్స్ ఏర్పాటు కు సంబంధించి 2018 ఏప్రిల్‌ లో ఆర్థిక‌ మంత్రిత్వ‌ శాఖ సూత్ర‌ప్రాయ ఆమోదాన్ని తెలిపింది.


**




(Release ID: 1556483) Visitor Counter : 173