మంత్రిమండలి

కేంద్ర జాబితా లో ఇత‌ర వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ఉప వ‌ర్గీక‌ర‌ణ అంశం పై ప‌రిశీలన జరుపుతున్న క‌మిశన్ ప‌ద‌వీకాలాన్ని 2019వ సంవ‌త్సరం మే నెల 31వ తేదీ వ‌ర‌కు పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 22 NOV 2018 1:37PM by PIB Hyderabad

కేంద్ర జాబితా లో ఇత‌ర వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ఉప వ‌ర్గీక‌ర‌ణ అంశంపై ప‌రిశీలన జరుపుతున్న క‌మిశన్ యొక్క ప‌ద‌వీకాలాన్ని 2018 వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 30 వ తేదీ నుండి మ‌రో ఆరు నెల‌ల పాటు అంటే 2019 వ సంవ‌త్స‌రం మే నెల 31 వ తేదీ వ‌ర‌కు పొడిగించేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.
 
ఈ క‌మిశన్ రాష్ట్ర ప్ర‌భుత్వాలు, రాష్ట్రాల‌ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంఘాలు, వివిధ స‌ముదాయాల సంఘాలు మ‌రియు వేరువేరు వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులకు చెందిన సాధార‌ణ ప్ర‌జానీకం తో స‌హా త‌త్సంబంధిత వ‌ర్గాల‌ తో విస్తృత‌మైన స‌మావేశాల‌ను నిర్వ‌హించింది; అంతేకాదు, ఉన్న‌త విద్య సంస్థ‌ లో ప్ర‌వేశం పొందిన ఒబిసి ల కులం వారీ రికార్డుల‌ ను, అలాగే కేంద్రీయ విభాగాల‌ లో, కేంద్ర ప్ర‌భుత‌్వ‌ రంగ సంస్థ‌లు, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులలో మరియు ఆర్థిక సంస్థ‌ లలో నియామ‌కం జ‌రిగిన వారి కి సంబంధించిన ఇదే విధ‌మైన కులం వారీ గణాంకాలను కూడా సేక‌రించింది.  

ఉప వ‌ర్గీక‌ర‌ణ సంబంధిత ప‌ట్టిక‌ల‌ను ఖ‌రారు చేసి, నివేదిక‌ ను ఇచ్చే కన్నా ముందు సేకరించినటువంటి గణాంకాల పరీక్ష, విశ్లేషణ ల ఆధారం గా రాష్ట్రాల తోను, ఆ రాష్ట్రాల‌ కు చెందిన వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంఘాల తోను మరో విడత చ‌ర్చలు సాగించవలసిన అవ‌స‌ర‌ం ఉందని కమిశన్ అభిప్రాయ‌ప‌డింది. 


**



(Release ID: 1553537) Visitor Counter : 613