మంత్రిమండలి
నేర సంబంధ అంశాల్లో పరస్పరం న్యాయ సహాయాన్ని అందజేసుకోవడం పై భారతదేశానికి, మొరాకో కు మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
प्रविष्टि तिथि:
01 NOV 2018 12:18PM by PIB Hyderabad
నేర సంబంధ అంశాల్లో పరస్పరం న్యాయ సహాయాన్ని అందజేసుకోవడం పై భారతదేశానికి, మొరాకో కు మధ్య ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
లాభాలు:
ఈ ఒప్పందం నేర విచారణ, ఆచూకీ తీయడం, నిర్భంధించడం, జప్తు చేయడం లేదా స్వాధీనం లోకి తీసుకోవడం, ఇంకా దర్యాప్తు చేయడం వంటి వాటి లో భారతదేశానికి, మొరాకో కు మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఒక స్థూలమైన ఫ్రేమ్ వర్క్ ను అందజేయనుంది. నేర విచారణ లోను, దర్యాప్తు లోను ప్రభావశీలత ను పెంపొందించడం తో పాటు సమాజం యొక్క సమగ్ర వికాసానికి అత్యావశ్యకమైన శాంతియుత వాతావరణాన్ని కల్పించడం ఈ ఒప్పందం ధ్యేయాలలో భాగం గా ఉన్నాయి. ఈ ఒప్పందం వ్యవస్థీకృత నేరగాళ్ళ మరియు ఉగ్రవాదుల వ్యవహార సరళి కి సంబంధించి ఉత్తమమైన అంతర్ దృష్టి ని పొందడంలో తన వంతు పాత్ర ను నిర్వర్తించగలుగుతుంది. ఆంతరంగిక భద్రత రంగం లో చక్కని విధాన నిర్ణయాల ను తీసుకోవడం లో ఈ అంతర్ దృష్టి ని ఉపయోగించుకొనేందుకు వీలు ఉంటుంది.
**
(रिलीज़ आईडी: 1551634)
आगंतुक पटल : 271