మంత్రిమండలి
పర్యావరణ పరమైన సహకారం అంశంలో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) దేశాల మధ్య అవగాహనపూర్వక ఒప్పంద ప్రతానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
24 OCT 2018 1:09PM by PIB Hyderabad
పర్యావరణ సంబంధ సహకారం అంశం పై బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) దేశాల మధ్య సంతకాలు జరిగిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫాక్టో ఆమోదాన్ని తెలిపింది. ఈ ఎంఒయు పై దక్షిణ ఆఫ్రికా లోని జోహాన్స్ బర్గ్ లో 2018వ సంవత్సరం జులై లో 10వ బ్రిక్స్ శిఖర సమ్మేళనం జరిగిన సందర్భంగా సంతకాలయ్యాయి.
దిగువన పేర్కొన్న అంశాల పై సహకారం అవసరమని ఈ ఎంఒయు గుర్తించింది:
ఎ) వాయు సంబంధమైన నాణ్యత;
బి) జలం;
సి) జీవ వైవిధ్యం;
డి) జల, వాయు పరివర్తన;
ఇ) వ్యర్థాల నిర్వహణ;
ఎఫ్) సుస్థిర అభివృద్ధి మరియు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకై నిర్దేశించుకొన్న 2030వ సంవత్సరపు కార్యాచరణ ప్రణాళిక ను అమలు చేయడం; ఇంకా
జి) భాగస్వామ్య పక్షాలు అంగీకారం తెలిపే మేరకు సహకారానికి ఉద్దేశించినటువంటి ఇతర రంగాలు.
ఈ ఎంఒయు పర్యావరణ పరిరక్షణ, ఇంకా ప్రాకృతిక వనరుల నిర్వహణ రంగం లో సమానత్వం, ఆదాన ప్రదానం మరియు పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన ప్రతి ఒక్క దేశం లో అమలయ్యే శాసనాలు, న్యాయ నిబంధనల వెలుగు లో బిఆర్ఐసిఎస్ దేశాల మధ్య సన్నిహిత, దీర్ఘకాలిక సహకారం నెలకొనడానికి, అలాగే ఆ విధమైనటువంటి సహకారం పెంపొందడానికి వీలు కల్పిస్తుంది.
పర్యావరణ పరమైన సమస్యలు పెరుగుతూ ఉండడమనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా యావత్తు భూ గ్రహానికే ఒక పెను సవాలు ను రువ్వుతోంది. పర్యావరణం యొక్క పరిరక్షణ దిశ గా ప్రపంచం లో 40 శాతానికి పైగా జనాభా నివసిస్తున్న అయిదు ప్రధాన దేశాలు.. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా ,ఇంకా దక్షిణ ఆఫ్రికా ల యొక్క బాధ్యత ను ఈ ఎంఒయు గుర్తిస్తోంది.
ఈ అవగాహనపూర్వక ఒప్పందం మెరుగైన పర్యావరణ రక్షణ, ఉత్తమమైన పరిరక్షణ లతో పాటు జల, వాయు పరివర్తన ను మెరుగైన పద్ధతి లో నిర్వహించడం, ఇంకా వన్య ప్రాణి పరిరక్షణ/సంరక్షణ లకు చక్కని మార్గాన్ని అభివృద్ధి చేయడం లో అత్యధునాతన సాంకేతికత లను తీసుకు రాగలదని ఆశించడం జరిగింది. బ్రిక్స్ దేశాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా ఉత్తమమైన పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం తో పాటు, విశేష అనుభవాల ను ఒక దేశం తో మరొక దేశం పంచుకొనేందుకు ఈ ఎంఒయు ఆస్కారం కల్పించనుంది. అలాగే, సుస్థిరాభివృద్ధి కి, పర్యావరణ పరిరక్షణ కు కూడా ఇది తోడ్పాటును అందించగలుగుతుంది. పరస్పర ప్రయోజనాలు ముడిపడినటువంటి రంగాల లో పథకాలను అమలు పరచే అవకాశాన్ని కూడా ఈ అవగాహనపూర్వక ఒప్పందం కల్పించనుంది.
**
(Release ID: 1550637)
Visitor Counter : 178