మంత్రిమండలి
ఇండియా సింగపూర్‌ల మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సిఇసిఎ) సవరణకు రెండవ ప్రొటోకాల్‌కు కేబినెట్ అనుమతి
प्रविष्टि तिथि:
03 OCT 2018 6:57PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అద్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఇండియా-సింగపూర్ మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సిఇసిఎ) సవరణకు వీలు కల్పించే రెండో ప్రొటోకాల్‌కు వెనుకటి తేదినుంచి అమలులోకి వచ్చే విధంగా ఆమోదం తెలిపింది. సి.ఇ.సి.ఎ పై 2018 ఆగస్టు 24న సంతకాలు జరిగాయి.
ప్రయోజనాలుః
రెండో ప్రొటోకాల్‌పై సంతకాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందింప చేయడంతోపాటు, ఇండియా-సింగపూర్‌ల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది.సిఇసిఎ ను ఇది మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుతుంది.
(रिलीज़ आईडी: 1548494)
आगंतुक पटल : 170