మంత్రిమండలి

ఉజ్‌బెకిస్తాన్ లోని అందిజాన్ ప్రాంతం లో ఉజ్‌బెక్- ఇండియ‌న్ ఫ్రీ ఫార్మ‌స్యూటిక‌ల్ జోన్ స్థాప‌న లో స‌హ‌కారానికై భార‌త‌దేశం, ఉజ్‌బెకిస్తాన్ ల మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 26 SEP 2018 4:16PM by PIB Hyderabad

ఉజ్‌బెకిస్తాన్ లోని అందిజాన్ ప్రాంతం లో ఉజ్‌బెక్ - ఇండియ‌న్ ఫ్రీ ఫార్మ‌స్యూటిక‌ల్ జోన్ స్థాప‌న లో స‌హ‌కారానికి గాను భార‌త‌దేశం, ఉజ్‌బెకిస్తాన్ ల మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందానికి (ఎంఒయు కు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ వహించిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఉజ్‌బెకిస్తాన్ అధ్య‌క్షులు 2018వ సంవ‌త్స‌రం అక్టోబ‌రు 1వ తేదీ నాడు భార‌త‌దేశాన్ని సంద‌ర్శించే సంద‌ర్భంగా ఈ ఎంఒయు పై సంత‌కాలు జ‌రుగ‌నున్నాయి.
 
రెండు దేశాల లోను ఫార్మాస్యూటిక‌ల్స్ మరియు బ‌యోఫార్మ‌స్యూటిక‌ల్ ఇండస్ట్రీ వృద్ధి కి గ‌ల ప్రాముఖ్యాన్ని మ‌రియు ఫార్మ‌ాస్యూటిక‌ల్, బ‌యోఫార్మాస్యూటిక‌ల్ రంగాల‌లో వ్యాపారం, ప‌రిశ్ర‌మ, ఇంకా ఉత్ప‌త్తి ల ప‌రంగా ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి గ‌ల ప్రాముఖ్యాన్ని దృష్టి లో పెట్టుకొని ద్వైపాక్షిక స‌హ‌కారం కోసం ఒక రూపాత్మ‌క యంత్రాంగాన్ని నెల‌కొల్పాలని ఇరు దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నాయి. ఈ ఎంఒయు ఉజ్‌బెకిస్తాన్ లో గ‌ల అందిజాన్ ప్రాంతంలో ఉజ్‌బెక్ - ఇండియ‌న్ ఫ్రీ ఫార్మాస్యూటిక‌ల్ జోన్ ను ఏర్పాటు చేసేందుకు అనువు గా ఒక స‌హ‌కార పూర్వ‌క‌మైన చ‌ట్రానికి వీలు క‌ల్పిస్తుంది.  అంతేకాకుండా, భార‌త‌దేశ ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీలు, బ‌యోఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ లు ఉజ్‌బెక్ - ఇండియ‌న్ ఫ్రీ ఫార్మాస్యూటిక‌ల్ జోన్ లో ఉత్ప‌త్తి క‌ర్మాగారాల లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి మ‌రియు ఉత్ప‌త్తి క‌ర్మాగారాల‌ను నెల‌కొల్ప‌డానికి కూడా మార్గాన్ని ఈ ఎంఒయు సుగ‌మం చేస్తుంది.


**



(Release ID: 1547502) Visitor Counter : 117