మంత్రిమండలి
ఫార్మస్యూటికల్ రంగం లో సహకారం అంశం పై భారతదేశానికి మరియు ఉజ్‌బెకిస్తాన్ కు మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
26 SEP 2018 4:12PM by PIB Hyderabad
ఫార్మస్యూటికల్ ప్రోడక్టుల కు సంబంధించిన వ్యాపారం, పరిశ్రమ మరియు పరిశోధన మరియు అభివృద్ధి రంగాల లో సహకారాన్ని పెంచుకోవడానికి భారతదేశం మరియు ఉజ్‌బెకిస్తాన్ ల మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అమోదం తెలిపింది. ఈ ఎంఒయు పై ఉజ్‌బెకిస్తాన్ అధ్యక్షులు 2018 సంవత్సరం అక్టోబరు 1వ తేదీ నాడు భారతదేశాన్ని సందర్శించేందుకు వచ్చే సమయం లో సంతకాలు జరుగనున్నాయి.
ఉభయ దేశాల లో ఫార్మాస్యూటికల్ పరిశ్రమ వృద్ధి కి ఉన్న ప్రాముఖ్యాన్ని మరియు ఫార్మాస్యూటికల్ రంగం లో వ్యాపారం, ఉత్పత్తి, పరిశోధన మరియు అభివృద్ధి అంశాల లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టి లో పెట్టుకొని ద్వైపాక్షిక సహకారానికి ఒక రూపాత్మక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇరు దేశాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఈ ఎంఒయు రెండు దేశాల లోను విభిన్న చికిత్సాత్మక విభాగాల లో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రీడియంట్స్ (ఎపిఐ స్) సహా మందుల ఉత్పత్తి కి గల అవకాశాలను అన్వేషిస్తుంది. అంతేకాకుండా, ఎపిఐ స్ సహా ఫార్మాస్యూటికల్ ప్రోడక్టుల ఎగుమతి మరియు దిగుమతి సంబంధిత న్యాయపరమైన ఆవశ్యకతలు, నియంత్రణ పరమైన ఆవశ్యకతలు, వ్యాపారం మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియల తాలూకు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి కూడా ఈ ఎంఒయు మార్గాన్ని సుగమం చేస్తుంది.
**
(Release ID: 1547445)