ప్రధాన మంత్రి కార్యాలయం

పాక్‌ యోంగ్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి; సిక్కిమ్ కు లభించిన గ‌గ‌న‌త‌ల సంధాన సదుపాయం

Posted On: 24 SEP 2018 1:24PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సిక్కిమ్ లో పాక్‌యోంగ్ విమానాశ్ర‌యాన్ని నేడు ప్రారంభించారు.  ఇది హిమాల‌య ప్రాంత రాష్ట్రం లో తొలి విమానాశ్ర‌యం; అంతే కాదు, ఇది దేశం లోని వందో విమానాశ్ర‌యం కూడా.

ఈ సంద‌ర్భం లో పెద్ద సంఖ్య లో హాజ‌రైన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్రసంగిస్తూ ఈ రోజు సిక్కిమ్ కు ఒక చారిత్ర‌కమైన దిన‌మని, అలాగే భార‌త‌దేశానికి కూడా ఒక ముఖ్య‌మైన రోజు అని అభిర్ణించారు.  పాక్‌యోంగ్ విమానాశ్ర‌యాన్ని కలుపుకొని భార‌త‌దేశం విమానాశ్ర‌యాల్లో శ‌త‌కాన్ని సాధించింద‌ని ఆయ‌న తెలిపారు.  సిక్కిమ్ రాష్ట్రానికే చెందిన యువ క్రికెట‌ర్ నిలేశ్ లామీచానే ఇటీవ‌లే జ‌రిగిన విజ‌య్ హ‌జారే ట్రోఫీ లో వంద ప‌రుగులు సాధించినట్లు కూడా ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు.

పాక్‌యోంగ్ విమానాశ్ర‌యం సిక్కిమ్ కు సంధానాన్ని ఎంత‌గానో సానుకూల‌ప‌రుస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఇది సామాన్యుడికి ఉప‌యోగ‌ప‌డాల‌నే ఈ విమానాశ్ర‌యాన్ని యుడిఎఎన్ (‘ఉడాన్’) ప‌థ‌కం లో చేర్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

యావ‌త్తు ఈశాన్య ప్రాంతం లో సంధానాన్ని మౌలిక స‌దుపాయాల ప‌రంగా మ‌రియు భావోద్వేగాల ప‌రంగా శ‌ర వేగంగా ఇనుమ‌డింపజేసేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  అభివృద్ధి ప‌నుల‌ను స‌మీక్షించ‌డం కోసం ఈశాన్య ప్రాంత రాష్ట్రాల‌ను స్వ‌యంగా తాను అనేకసార్లు సంద‌ర్శించినట్లు ఆయ‌న చెప్పారు.  దీనికి తోడు కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రాంతాన్ని త‌ర‌చుగా సంద‌ర్శిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.  దీనితో క్షేత్ర స్థాయి లో ఫలితాలు క‌నిపిస్తున్నాయని ఆయ‌న చెప్పారు.  పెద్ద వంతెన‌లు, మెరుగైన ర‌హ‌దారులు, రైలు మార్గాల అనుసంధానం, గ‌గ‌నత‌ల సేవ‌లు వర్ధిల్లడాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

ప్ర‌స్తుతం దేశం లో ఉన్న 100 విమానాశ్ర‌యాల్లో 35 విమానాశ్ర‌యాలు గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో కార్య‌క‌లాపాలు మొద‌లుపెట్టుకొన్నవేనని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

సేంద్రియ వ్య‌వ‌సాయం లో సిక్కిమ్ సాధించిన ప్రగ‌తి ని గురించి ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో పేర్కొన్నారు.  కేంద్ర ప్ర‌భుత్వం ‘‘మిశ‌న్ ఆర్గానిక్ వేల్యూ డివెల‌ప్‌మెంట్ ఫ‌ర్ నార్త్ ఈస్ట‌ర్న్ రీజియ‌న్’’ ను చేప‌ట్టిన సంగతిని ఆయ‌న గుర్తుకు తెచ్చారు.
 

**



(Release ID: 1547047) Visitor Counter : 313