మంత్రిమండలి

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ (ఎన్‌ఐడి) చ‌ట్టం, 2014 లో స‌వ‌ర‌ణ‌ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 12 SEP 2018 4:22PM by PIB Hyderabad

ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌ లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ డిజైన్, అమ‌రావ‌తి/విజ‌య‌వాడ‌; మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌ లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌, భోపాల్‌; అసమ్ లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, జోర్ హాట్‌; ఇంకా హ‌రియాణా లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, కురుక్షేత్ర‌ ల‌ను నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ (ఎన్‌ఐడి) చ‌ట్టం, 2014 పరిధి లోకి చేర్చేందుకు, అలాగే వీటిని అహమదాబాద్‌ లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కు సమానంగా జాతీయ ప్రాధాన్య‌ం కలిగినటువంటి సంస్థ‌ లుగా ప్ర‌క‌టించడానికి ఎన్‌ఐడి చ‌ట్టం, 2014 లో స‌వ‌ర‌ణ‌ ను ప్ర‌తిపాదించే బిల్లు ను పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  అవసరమయ్యే కొన్ని చిన్న చిన్న స‌వ‌ర‌ణ‌ల‌నూ ఈ బిల్లు లో ప్రతిపాదించడమైంది; ఉదాహ‌ర‌ణ‌కు ఎన్ఐడి విజ‌య‌వాడ‌ పేరు ను ఎన్‌ఐడి అమ‌రావ‌తి గా మార్చే ప్రతిపాదన తో పాటు ప్రిన్సిప‌ల్ డిజైన‌ర్‌ నామావళి ని ప్రొఫెస‌ర్ కు స‌మానమైందిగా పేర్కొన్న ప్ర‌తిపాద‌న‌ కూడా ఈ సవరణలలో భాగంగా ఉంది. 

జాతీయ ప్రాముఖ్యం కలిగిన కొత్త ఎన్‌ఐడి ల‌ను దేశం లోని వివిధ భౌగోళిక ప్రాంతాల‌లో ఏర్పాటు చేయ‌డం అత్యంత నైపుణ్యం క‌లిగిన మాన‌వ వ‌న‌రుల‌ను డిజైన్ రంగానికి అందుబాటు లోకి తీసుకు రావ‌డానికి సహాయకారి కాగలదు.  ఇది హ‌స్త‌క‌ళ‌లు, చేనేతలు, గ్రామీణ సాంకేతిక విజ్ఞానం, చిన్న, మ‌ధ్య‌త‌ర‌హా, భారీ వాణిజ్య సంస్థ‌ లకు, వివిధ వ‌ర్గాల‌కు నిలకడతనంతో కూడిన డిజైన్ సంబంధ సేవ‌లను అందించ‌డం ద్వారా ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉద్యోగ అవ‌కాశాల‌ను సృష్టించగలదు.  ఫలితంగా సామ‌ర్ధ్యాల పెంపున‌కు సైతం దోహ‌ద‌ప‌డుతుంది.  ఇది వ్య‌వ‌స్థ‌ నిర్మాణానికి తగ్గ వ్యాప్తి కార్యక్రమాలకూ ఉప‌యోగపడనుంది.


**



(Release ID: 1546102) Visitor Counter : 180