మంత్రిమండలి

ప్రజానుకూలమైన మరియు పేదలకు హితకరమైన కార్యక్రమాలకు ఊతం

నేశ‌న‌ల్ మిశన్ ఫ‌ర్ ఫైనాన్షియ‌ల్ ఇన్‌క్లూజ‌న్- ప్రధాన మంత్రి జన్‌ ధ‌న్ యోజ‌న (పిఎమ్‌జెడివై) ని 14.8.2018 త‌రువాత కూడా కొన‌సాగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

- ఖాతాల ను ఆరంభించ‌డం లో శ్రద్ధ ను “ప్ర‌తి ఒక్క కుటుంబం నుండి ప్ర‌తి ఒక్క వ‌యోజ‌నుడు” కు మరలించడం;

- ఓవ‌ర్ డ్రాఫ్ట్ విషయంలో ప్ర‌స్తుతం ఉన్న‌ టువంటి 5,000 రూపాయ‌ల ప‌రిమితి ని 10,000 రూపాయ‌ల‌కు పెంచ‌డ‌మైంది;

- 2,000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఓవ‌ర్ డ్రాఫ్ట్ పై ఎటువంటి ష‌ర‌తులు ఉండ‌వు;

- ఓవ‌ర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యాన్ని పొందేందుకు గాను వ‌య‌స్సు ప‌రిమితి ని 18-60 ఏళ్ళ నుండి 18-65 ఏళ్ళు గా స‌వ‌రించ‌డ‌మైంది;

- 28.8.18 త‌రువాత‌ తెర‌చిన కొత్త పిఎమ్‌జెడివై ఖాతాలకు నూత‌న రూపే కార్డుదారుల ప్ర‌మాద బీమా ర‌క్ష‌ణ పరిమితి ని ఒక ల‌క్ష‌ రూపాయ‌ల నుండి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు విస్త‌రించ‌డ‌మైంది.


Posted On: 05 SEP 2018 9:15PM by PIB Hyderabad

ప్రజానుకూలమైన మరియు పేదలకు హితకరమైన కార్యక్రమాలకు ఊతం అందించడంలో భాగంగా నేశ‌న‌ల్ మిశ‌న్ ఫ‌ర్ ఫైనాన్షియ‌ల్ ఇన్‌క్లూజ‌న్- ప్ర‌ధాన మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న (పిఎమ్‌జెడివై) ని ఈ కింద పేర్కొన్న మార్పుల తో కొన‌సాగించేందుకు 2018, సెప్టెంబ‌ర్ 5వ తేదీ నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది:-

 

 

•             ద నేశ‌న‌ల్ మిశ‌న్ ఫ‌ర్ ఫైనాన్షియ‌ల్ ఇన్‌క్లూజ‌న్ (పిఎమ్‌జెడివై) ని 14.8.2018 త‌రువాత కూడా కొన‌సాగించ‌డానికి;

 

•             ఇప్పుడు ఉన్నటువంటి ఓవ‌ర్ డ్రాఫ్ట్ (ఓడి) ప‌రిమితి ని 5,000 రూపాయ‌ల నుండి 10,000 రూపాయ‌ల‌కు పెంచ‌డానికి;

 

•             2,000 రూపాయ‌ల వ‌ర‌కు ఓడి కి ఎటువంటి ష‌ర‌తులు ఉండబోవు;

 

•             ఓడి సౌక‌ర్యాన్ని అందుకోవ‌డం కోసం ఉద్దేశించిన వ‌య‌స్సు ప‌రిమితి ని 18-60 ఏళ్ళ నుండి 18-65 ఏళ్ళ‌కు స‌వ‌రించ‌డానికి;

 

•             ‘‘ప్ర‌తి ఒక్క కుటుంబం నుండి ప్ర‌తి ఒక్క వ‌యోజ‌నుడికి’’ విస్త‌రించిన‌టువంటి ర‌క్ష‌ణ సదుపాయంలో భాగంగా, 28.8.18 తరువాత తెరవబడిన కొత్త పిఎమ్‌జెడివై ఖాతాలకు రూపే కార్డుదారుల‌కు ప్ర‌మాద బీమా ర‌క్ష‌ణ పరిమితి ని ఒక ల‌క్ష‌ రూపాయ‌ల నుండి రెండు ల‌క్ష‌ల  రూపాయ‌ల‌కు పెంచ‌డానికి.

 

ప్ర‌భావం:

 

ఈ మిశ‌న్ యొక్క కొన‌సాగింపు, దేశం లోని అంద‌రు వ‌యోజ‌నులు/కుటుంబాలు క‌నీసం ఒక ప్రాథ‌మిక బ్యాంకు ఖాతా ను క‌లిగివుండ‌డానికి మ‌రియు ఆ ఖాతా అందించే ఇత‌ర ఆర్థిక సేవ‌లు, సామాజిక భ‌ద్ర‌త ప‌థ‌కాల తో పాటు 10,000 రూపాయ‌ల వ‌ర‌కు ఓవ‌ర్ డ్రాఫ్ట్ ను పొందేందుకు వీలు క‌ల్పిస్తుంది.  ఈ విధంగా ఈ చ‌ర్య వారిని ఆర్థిక సేవ‌ల ప్ర‌ధాన స్ర‌వంతి లోకి తీసుకుపోతుంది.  అంతేకాక ప్ర‌భుత్వం అమ‌లు ప‌రుస్తున్న వివిధ స‌బ్సిడీ ప‌థ‌కాల యొక్క ప్ర‌యోజ‌నాలు మ‌రింత ప్ర‌భావ‌వంతం గా బ‌దలాయించేందుకు కూడా మార్గాన్ని సుగ‌మం చేస్తుంది.

 

పిఎమ్‌జెడివై లో భాగంగా సమకూరిన విజ‌యాలు:

 

 

•             దాదాపుగా 32.41 కోట్ల జ‌న్ ధ‌న్ ఖాతాలను 81,200 కోట్ల రూపాయ‌ల కు పైగా డిపాజిట్ నిల్వ తో తెర‌వ‌బ‌డ్డాయి.

 

•             53 శాతం మ‌హిళా జ‌న్ ధ‌న్ ఖాతాదారుల తో పాటు 59 శాతం జ‌న్ ధ‌న్ ఖాతాలు గ్రామీణ ప్రాంతాల లోను, సెమీ అర్బ‌న్ ప్రాంతాల లోను ఉన్నాయి.  అమ‌ల‌వుతున్న జ‌న్ ధ‌న్ ఖాతాల‌లో 83 శాతానికి పైగా ఖాతాలు (అస‌మ్‌, మేఘాల‌య‌, జ‌మ్ము & క‌శ్మీర్ రాష్ట్రాలు మిన‌హా) ఆధార్ తో ముడి వేయ‌బ‌డ్డాయి.  ఈ ఖాతాదారుల కు సుమారు 24.4 కోట్ల రూపే కార్డు లను జారీ చేయ‌డ‌మైంది.

 

•             7.5 కోట్ల‌కు పైగా జ‌న్ ధ‌న్ ఖాతాలు డిబిటి ల‌ను అందుకొంటున్నాయి.

 

•             గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన 1.26 ల‌క్ష‌ల స‌బ్ స‌ర్వీసు ఏరియా ల‌లో బ్యాంకింగ్ క‌ర‌స్పాండెట్ (బిసి) లను నియ‌మించ‌డ‌మైంది.  ప్ర‌తి ఒక్క‌ బిసి 1000-1500 కుటుంబాల‌కు సేవ‌ల‌ను అందిస్తారు.  2018వ సంవ‌త్స‌రం జులై నెల లో బిసి ల ద్వారా దాదాపు 13.16 కోట్ల ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్ట‌మ్ (AePS) లావాదేవీలు జ‌రిగాయి.  

 

•             13.98 కోట్ల చందాదారులతో కూడిన ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న (పిఎమ్ఎస్‌బివై)లో భాగంగా ఇంత‌వ‌ర‌కు 388.72 కోట్ల రూపాయ‌ల ప్రమేయం కలిగిన 19,436 క్లెయిము ల‌ను పరిస్కరించడ‌ం జరిగింది. 

 

•             ఇదే విధంగా, 5.47 కోట్ల మంది చందాదారులతో కూడిన ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న (పిఎమ్‌జెజెబివై)లో భాగంగా 2206.28 కోట్ల రూపాయ‌ల ప్రమేయం కలిగిన 1.10 ల‌క్ష‌ల క్లెయిము ల‌ను పరిష్కరించడం జరిగింది.

 

•             అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఎపివై) కై 1.11 కోట్ల మంది చందాలు చెల్లించారు. 

 

పిఎమ్‌జెడివై అమ‌లు కోసం జ‌న్ ధ‌న్ ఖాతా ల‌ను మ‌రియు మొబైల్ బ్యాంకింగ్ ను ఆధార్ (జెఎఎమ్) కు జ‌త‌ప‌ర‌చ‌డ‌మైంది.  జెఎఎమ్ పొదుపునకు మార్గాన్ని  సుగ‌మం చేయడంతో పాటు ప‌ర‌ప‌తి విత‌ర‌ణ, సామాజిక భ‌ద్ర‌త వంటి వాటికి కూడా రంగాన్ని సిద్ధం చేస్తోంది.  పైపెచ్చు డిబిటి ద్వారా వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల తాలూకు ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌నాలను దేశం లోని పేద ప్ర‌జ‌ల‌కు మళ్లించడం జరుగుతోంది.

 

‘‘ప్ర‌తి కుటుంబం నుండి ఖాతాలను తెరవడం’’పై ప్రత్యేక శ్రద్ధ ను ‘‘ప్ర‌తి ఒక్కవ‌యోజ‌నుడి’’ కి మ‌ళ్ళిస్తూ, ఆర్థిక స‌మ్మిళితం లక్ష్య సాధన లో ప్రధాన కార్య‌క్ర‌మమైన పిఎమ్‌జెడివై యొక్క అమ‌లు ను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించ‌డ‌మైంది.  జ‌న్ ధ‌న్- ఆధార్- మొబైల్ (జెఎఎమ్‌) త్రయం ఈ కార్య‌క్ర‌మాల అమ‌లుకు అవ‌స‌ర‌మైన వెన్నెముక గా నిలుస్తూ, డిజిట‌ల్ స‌దుపాయాల‌ తో కూడినటువంటి, ఆర్థిక సేవ‌ల స‌మితమైనటువంటి మ‌రియు బీమా ర‌క్ష‌ణ సమేతమైనటువంటి స‌మాజం దిశ‌గా ప‌య‌నాన్ని వేగ‌వంతం చేస్తున్నది.

 

పూర్వ‌రంగం:

 

బ్యాంకింగ్ సేవ‌లు మ‌రింత‌గా వ్యాప్తి చెందేటట్లు గాను, ఆర్థిక స‌మ్మిళితం ల‌క్ష్యాన్ని ప్రోత్స‌హించేందుకు గాను దేశవ్యాప్తంగా ప్ర‌తి ఒక్క కుటుంబానికి క‌నీసం ఒక బ్యాంకు ఖాతా ను స‌మ‌కూర్చ‌ేందుకు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2014 ఆగ‌స్టు 15వ తేదీ నాడు తాను ఇచ్చిన స్వాతంత్య్ర దినోత్స‌వ ఉప‌న్యాసం లో ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న (పిఎమ్‌జెడివై) పేరుతో ఒక నేశ‌న‌ల్ మిశ‌న్ ఆన్ ఫైనాన్షియ‌ల్ ఇన్‌క్లూజ‌న్ ను ప్ర‌క‌టించారు.  ఈ ప‌థ‌కాన్ని ప్ర‌ధాన మంత్రి 2014, ఆగ‌స్టు 28వ తేదీ నాడు జాతీయ స్థాయి లో లాంఛ‌నంగా ప్రారంభించారు.

 

 

**



(Release ID: 1545201) Visitor Counter : 165